జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగిన మానకొండూర్ వీధులు

మానకొండూర్(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 24:జై శ్రీరామ్ నినాదాలతో మానకొండూర్ పుర వీధులు మారుమ్రోగాయి.మానకొండూర్ మండలంలో బాలాంజనేయ స్వామి గుడిలో హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి హిందూ ఐక్యత బైక్ ర్యాలీని నిర్వహించారు.యువకులంతా కాషాయ జెండాలతో జైశ్రీరామ్ నినాదాలతో మానకొండూరు వీధులలో ర్యాలీ ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షులు రాపాక ప్రవీణ్, విశ్వహిందూ పరిషత్ మండల కార్యదర్శి దేవాసాని సంపత్,సొల్లు అజయ్ వర్మ, ఎడబోయిన రామకృష్ణారెడ్డి,మియాపురం లక్ష్మణాచారి,కత్తి ప్రభాకర్ గౌడ్,కంది రాజు రెడ్డి, […]

మల్కాజ్గిరి పై..ఆధిపత్యం ఎవరిది.?

హైదరాబాద్ (ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 20:మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గం అంటేనే మినీ ఇండియానే! దేశంలోనే అత్యధిక ఓట్లున్న లోక్ సభ సెగ్మెంట్ మల్కాజ్ గిరి. ఈ ఒక్క పార్లమెంట్ పరిధిలో ఉన్న ఓటర్ల సంఖ్యే 38 లక్షలు. దేశంలో అన్ని ప్రాంతాలు, వర్గాల ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఉంటారు. గ్రేటర్ హైదరాబాద్ లో అంతర్భాగమైన మల్కాజిగిరిలో గెలవడం ఏ పార్టీకైనా ప్రతిష్టాత్మకమే. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సిట్టింగ్ సీటు మల్కాజ్ గిరిని కైవసం చేసుకోవాలని అధికార కాంగ్రెస్ […]

స్పందన అనాధాశ్రమంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని స్థానిక పోలీస్ వారి సహకారంతో సామాజిక కార్యకర్త,  అంబాల రజనీకాంత్ ఆధ్వర్యంలో,ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత మహనీయుడు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు జరిపించడం జరిగింది ఈ సందర్భంగా   స్పందన పిల్లల అనాధాశ్రమంలో పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి పిల్లలందరికీ  నోట్ బుక్కులు,పెన్నులు ఫ్రూట్స్ పంపిణీ చేసి పిల్లలకు అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని తను పేద బడుగు బలహీన వర్గాలకు చేసిన తన త్యాగాన్ని గుర్తు చేస్తూ పిల్లలు […]

ఒలింపియాడ్ లో సత్తా చాటిన శ్రీ కాకతీయ పాఠశాల విద్యార్థులు

హుజురాబాద్, ఏప్రిల్ 08:జాతీయ స్థాయిలో నిర్వహించిన ఇండియన్ నేషనల్ టాలెంట్ సెర్చ్ ఒలింపియాడ్ (ఐ.ఎన్.టి.ఎస్.ఓ) పరీక్షలో హుజురాబాద్ పట్టణంలోని శ్రీ చైతన్య కరికులం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ కాకతీయ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ మాట్ల సందీప్ కుమార్ తెలిపారు. పాఠశాల విద్యార్థులు 315 మంది ఒలంపియాడ్ పరీక్షలు రాయగా 271 మంది విద్యార్థులు జాతీయ స్థాయిలో బహుమతులు పొందారు.జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో పచ్చిమట్ల అనన్య, రెండవ స్థానంలో గూడూరి ఆశిష్ […]

ఉపాధిహామీ పని ప్రదేశాల్లో కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించాలి

కరీంనగర్ ఏప్రిల్08:ఉపాధిహామీ పని ప్రదేశాల్లో కూలీలకు కనీస సౌకర్యాలు,మౌలిక వసతులు కల్పించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం రోజున పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో డి ఆర్ డి ఓ ఉప్పుల శ్రీధర్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సృజన్ కుమార్ మాట్లాడుతూ వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని పని ప్రదేశాల్లో ఉపాధిహామీ కూలీలకు […]

ఆ కార్పోరేట్ జూనియర్ కళాశాలల గుర్తింపు రద్దు చేయాలి

ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామారపు వెంకటేష్ కరీంనగర్ ఏప్రిల్ 06:జిల్లాల్లో  ప్రైవేట్  జూనియర్ కళాశాలలలు ఇంటర్ బోర్డు నిబంధనలు పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ముందస్తు అడ్మిషన్లు,వేసవి తరగతులు నిర్వహిస్తున్నారని  జిల్లా ఇంటర్ బోర్డు అధికారులు వెంటనే  ప్రైవేట్  జూనియర్ కళాశాలల ఆగడాలు అరికట్టాలని లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రైవేట్ కార్పొరేట్ జూనియర్ కళాశాలల ముందు ప్రత్యక్ష ఆందోళనలకు దిగుతామని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామారపు వెంకటేష్ ఒక ప్రకటనలో  అన్నారు.ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు రామారపు […]

ఘనంగా భారతీయ జనతా పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

మానకొండూర్ ఏప్రిల్ 06:భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మానకొండూరు మండలంలోని అన్ని గ్రామాలలో భారతీయ జనతా పార్టీ జెండాలను ఆవిష్కరించి టిఫిన్ బయట కార్యక్రమాలను నిర్వహించారు.ఈ సందర్భంగా మానకొండూర్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు రాపాక ప్రవీణ్ బిజెపి జెండా ఆవిష్కరించారు.అనంతరం సీట్లు పంపిణీ చేశారు.అనంతరం కార్యకర్తలు అందరితో కలిసి టిఫిన్ బయట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించడం గర్వకారణం అని […]

సర్వాయి పాపన్న గుట్టని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం

సైదాపూర్ ఏప్రిల్ 2:సర్వాయిపేట పరిసర ప్రాంతంలో ఉన్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్గుట్ట ను పర్యాటక కేంద్రం కోసంసీఎం దృష్టి కి తీసుకెళ్ళి అభివృద్ధి కోసం కృషి చేస్తానని బిసి,రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం అన్నారు.సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా సర్వాయిపేట మహ్మదాపూర్ గ్రామల నడుమ ఉన్న సర్వాయి పాపన్న గుట్ట మీద ఉన్న పాపన్న విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.సర్దార్ […]

కాంగ్రెస్ లో చేరిన మున్సిపల్ వైస్ చైర్మన్

జమ్మికుంట మార్చ్ 30:జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దేశిని స్వప్న-కోటి, ఆయన వర్గీయులు శనివారం హైదరాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్, హుజురాబాద్ నియోజక ఇంచార్జ్ వొడితల ప్రణవ్ ల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.దేశిని స్వప్న-కోటి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. తాను 1995నుండి కాంగ్రెస్ పార్టీ కార్య కర్తగా పని చేశానని,ఎన్ ఎస్ యూఐ మండల అధ్యక్షుడిగా, కాంగ్రెస్ […]

భగవంతుని నామస్మరణతోనే మానసికమైన ప్రశాంతత

జమ్మికుంట మార్చ్ 26:జమ్మికుంట పట్టణంలోని మారుతీ నగర్ గల అయ్యప్ప స్వామి దేవాలయంలో జరుగుతున్న 25వ వార్షికోత్సవ ద్వితీయ పుష్కర కుంభాభిషేక మహోత్సవంలో భాగంగా పడిపూజ మహోత్సవంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వోడితల ప్రణవ్ అయ్యప్ప స్వామి పడి పూజా కార్యక్రమంలో పాల్గొని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ జమ్మికుంట పట్టణంలోని ఈ మార్గము గుండా చాలాసార్లు ప్రయాణించడం జరిగిందని,అయ్యప్ప స్వామి పుట్టినరోజు నాడు ఆ పడిపూజ కార్యక్రమంలో పాల్గొనే […]