ఒలింపియాడ్ లో సత్తా చాటిన శ్రీ కాకతీయ పాఠశాల విద్యార్థులు

హుజురాబాద్, ఏప్రిల్ 08:జాతీయ స్థాయిలో నిర్వహించిన ఇండియన్ నేషనల్ టాలెంట్ సెర్చ్ ఒలింపియాడ్ (ఐ.ఎన్.టి.ఎస్.ఓ) పరీక్షలో హుజురాబాద్ పట్టణంలోని శ్రీ చైతన్య కరికులం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ కాకతీయ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ మాట్ల సందీప్ కుమార్ తెలిపారు. పాఠశాల విద్యార్థులు 315 మంది ఒలంపియాడ్ పరీక్షలు రాయగా 271 మంది విద్యార్థులు జాతీయ స్థాయిలో బహుమతులు పొందారు.జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో పచ్చిమట్ల అనన్య, రెండవ స్థానంలో గూడూరి ఆశిష్ … Read more

ఉపాధిహామీ పని ప్రదేశాల్లో కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించాలి

కరీంనగర్ ఏప్రిల్08:ఉపాధిహామీ పని ప్రదేశాల్లో కూలీలకు కనీస సౌకర్యాలు,మౌలిక వసతులు కల్పించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం రోజున పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో డి ఆర్ డి ఓ ఉప్పుల శ్రీధర్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సృజన్ కుమార్ మాట్లాడుతూ వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని పని ప్రదేశాల్లో ఉపాధిహామీ కూలీలకు … Read more

ఆ కార్పోరేట్ జూనియర్ కళాశాలల గుర్తింపు రద్దు చేయాలి

ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామారపు వెంకటేష్ కరీంనగర్ ఏప్రిల్ 06:జిల్లాల్లో  ప్రైవేట్  జూనియర్ కళాశాలలలు ఇంటర్ బోర్డు నిబంధనలు పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ముందస్తు అడ్మిషన్లు,వేసవి తరగతులు నిర్వహిస్తున్నారని  జిల్లా ఇంటర్ బోర్డు అధికారులు వెంటనే  ప్రైవేట్  జూనియర్ కళాశాలల ఆగడాలు అరికట్టాలని లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రైవేట్ కార్పొరేట్ జూనియర్ కళాశాలల ముందు ప్రత్యక్ష ఆందోళనలకు దిగుతామని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామారపు వెంకటేష్ ఒక ప్రకటనలో  అన్నారు.ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు రామారపు … Read more

ఘనంగా భారతీయ జనతా పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

మానకొండూర్ ఏప్రిల్ 06:భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మానకొండూరు మండలంలోని అన్ని గ్రామాలలో భారతీయ జనతా పార్టీ జెండాలను ఆవిష్కరించి టిఫిన్ బయట కార్యక్రమాలను నిర్వహించారు.ఈ సందర్భంగా మానకొండూర్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు రాపాక ప్రవీణ్ బిజెపి జెండా ఆవిష్కరించారు.అనంతరం సీట్లు పంపిణీ చేశారు.అనంతరం కార్యకర్తలు అందరితో కలిసి టిఫిన్ బయట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించడం గర్వకారణం అని … Read more

భగవంతుని నామస్మరణతోనే మానసికమైన ప్రశాంతత

జమ్మికుంట మార్చ్ 26:జమ్మికుంట పట్టణంలోని మారుతీ నగర్ గల అయ్యప్ప స్వామి దేవాలయంలో జరుగుతున్న 25వ వార్షికోత్సవ ద్వితీయ పుష్కర కుంభాభిషేక మహోత్సవంలో భాగంగా పడిపూజ మహోత్సవంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వోడితల ప్రణవ్ అయ్యప్ప స్వామి పడి పూజా కార్యక్రమంలో పాల్గొని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ జమ్మికుంట పట్టణంలోని ఈ మార్గము గుండా చాలాసార్లు ప్రయాణించడం జరిగిందని,అయ్యప్ప స్వామి పుట్టినరోజు నాడు ఆ పడిపూజ కార్యక్రమంలో పాల్గొనే … Read more

భగత్ సింగ్ స్ఫూర్తితో యువత ఉద్యమించాలి

కరీంనగర్ మార్చ్ 23:ఏఐవైఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో భగత్ సింగ్ 93 వ వర్ధంతిని పురస్కరించుకొని బోయవాడలోని భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.అనంతరం ఎఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు  బ్రాహ్మణపల్లి యుగంధర్ మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలర్పించిన త్యాగశీలి, నేటి యువతకు ఆదర్శప్రాయుడైన భగత్ సింగ్ జయంతిని పురస్కరించుకుని సామ్రాజ్యవాద పాలకుల విధానాలపై గళం విప్పేందుకు యువత నడుం బిగించాలన్నారు.భారతదేశంలో 1907 సెప్టెంబర్‌ 28న పంజాబ్‌ రాష్ట్రం రాయల్‌పూర్‌ జిల్లా బంగా … Read more

ఘనంగా భగత్ సింగ్ 93వ వర్ధంతి వేడుకలు

హుజురాబాద్,మార్చ్ 20: హుజురాబాద్ పట్టణ కేంద్రంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో భగత్ సింగ్ 93వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామారపు వెంకటేష్ మాట్లాడుతూ.. భగత్ సింగ్ దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటీష్ ముష్కరులను ఎదిరించి పోరాడి దేశానికి స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడడాని పేర్కొన్నారు. భగత్ సింగ్ జయంతి, వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని భగత్ సింగ్ కి భారతరత్న … Read more

టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) హుజురాబాద్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం జమ్మికుంట పట్టణంలోని ప్రెస్‌క్లబ్ కార్యాలయంలో ముస్లీం పాత్రికేయులు,అధికారులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఉపవాస దీక్షలు ఆచరించే ముస్లిం సోదరులకు ఇచ్చే ఇఫ్తార్ విందు మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. పాత్రికేయులు అంటే కేవలం సమాజంలోని సమస్యల పట్ల జవాబుదారిగా ఉండటమే కాకుండా అన్నీ మతాలను గౌరవిస్తూ ఉంటామని జమ్మికుంట జర్నలిస్టులు ఈ సందర్భంగా వెల్లడించారు.ఇఫ్తార్ విందుకు … Read more

ఈటెల రాజేందర్ జన్మదిన సందర్బంగా ప్రత్యేక పూజలు చేసిన మైనార్టీ నాయకులు

బిజీగీర్ షరీఫ్ గ్రామంలోని హజ్రత్ సయ్యద్ ఇంకుషావలి దర్గాలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ జన్మదినం సందర్భంగా జమ్మికుంట ముస్లిం మైనార్టీ నాయకులు బుధవారం రోజున దర్గాలోని సమాధులకు చాదర్లు సమర్పించారు.మత గురువు మౌలానా యాసీన్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.మైనార్టీ నాయకుడు మహమ్మద్ నసిరుద్దీన్ మాట్లాడుతూ ఈటెల రాజేందర్ ఆయురారోగ్యం బాగుండాలని,రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో మల్కాజ్ గిరి నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో ఈటెల రాజేందర్ గెలవాలని దర్గాలో ప్రార్థించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు మొహమ్మద్ … Read more

ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ప్రైవేటు అంబులెన్స్ లు

హుజురాబాద్,ధనాధన్ న్యూస్: రోడ్డు మీద అంబులెన్సు వస్తుందంటే మనం ఎంత పనిలో ఉన్న అందులో ఉన్న పేషేంట్ ప్రాణాలు నిలువాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ,బండికి సైడ్ ఇస్తాము.కానీ అత్యవసర పరిస్థితిలో వినియోగించే అంబులెన్స్ యజమానుల నిర్లక్ష్య వైఖరిలతో ప్రాణాలకు చేటు చేకూరుతుంది.వీళ్ళ నిర్వాహకం వల్ల నిండు ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి..కనీసం వాహనాల్లో మౌలిక  వసతులు లేకుండా,కనీసం డీజిల్,పెట్రోల్ కూడా చూసుకోకుండా ప్రజల ప్రాణాలను హరిస్తున్నారు.కనీసం ప్రథమ చికిత్స చేసే టెక్నీషియన్ కూడా లేకుండా డబ్బు సంపాదనే ధ్యేయంగా ప్రజల … Read more