- కాస్మోటిక్,కామన్ డైట్ చార్జీల పెంపు హర్షదాయకం
- కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్
హుజురాబాద్/ధనాధన్ న్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తుందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.శనివారం స్థానిక కేసీ క్యాంపులోని మహాత్మ జ్యోతిరావు పూలే,మైనార్టీ గురుకుల పాఠశాలలో కాస్మోటిక్ చార్జీల పెంపు,కామన్ డైట్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని,విద్యార్థుల సమస్యలను నేరుగా మా వద్దకు తీసుకురావాలని కోరారు.విద్యారంగ అభివృద్ధి విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ప్రభుత్వం వచ్చిన వెంటనే వైద్య,విద్య రంగానికి అధిక నిధులు కేటాయించామని అన్నారు.విద్యార్థుల భోజన సదుపాయం విషయంలో గత ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా తేడా ఉందని,డైట్,కాస్మోటిక్ చార్జీల పెంపు చరిత్రాత్మక ఘట్టమని తెలిపారు.వసతి గృహాల్లో ఉంటూ చదువుకునే విద్యార్థులు బాగా చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు.ఉన్నత చదువులు చదివి వివిధ రంగాల్లో అత్యున్నత స్థానాల్లో ఉన్న వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.గత ప్రభుత్వం విద్యార్థుల కాస్మోటిక్,డైట్ చార్జీలను 15 సంవత్సరాలుగా పెంచలేదని,గతంలో ఎన్నడూ లేనివిధంగా గురుకులాల అభివృద్ధితో పాటు పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం పాటుపడుతుందని పేర్కొన్నారు.అనంతరం వసతిగృహాల్లోని వంట గది,డైనింగ్ హాల్,తరగతి గదులను ఆయన పరిశీలించారు.అలాగే మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల విద్యార్థినిలు డప్పు చప్పులతో ఘన స్వాగతం పలికారు.విద్యార్థులు మొదట విషయ పరిజ్ఞానాన్ని అలవర్చుకోవాలని తద్వారా భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదిగుతారని అన్నారు.ఈ కార్యక్రమంలో హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నం మానుకోవాలి
విద్యార్థుల భోజన విషయంలో తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని ప్రణవ్ అన్నారు.భోజన విషయంలో ఏదైనా సందిగ్ధం ఉంటే నేరుగా పిల్లలతో కలిసి భోజనం చేసి మాట్లాడాలని సూచించారు.తప్పుడు ప్రచారాలు మానుకొవాలని మరొక్కసారి హెచ్చరించారు.పిల్లల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తల్లిలాగా చూస్తుందని అన్నారు.