హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజురాబాద్ కు చెందిన గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ వారు హుజురాబాద్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్( బాలికలు ) లో చదువుతున్న 140 మంది విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ లను ట్రస్టు నిర్వాహకులు గంగిశెట్టి జగదీశ్వర్ (రిటైర్డ్ టీచర్) పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బోరగాల తిరుమల చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా ఈశ్వర్ రెడ్డి మాట్లాడుతూ 13 సంవత్సరముల నుండి గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్టు ద్వారా ట్రస్టు నిర్వాహకులు జగదీశ్వర్ సొంత డబ్బులతో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు వివిధ సేవా కార్యక్రమాలు, సమాజంలోని పేదలకు చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొన్నారు. వేల్పుల రత్నం మాట్లాడుతూ మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ చేస్తున్న సేవలు వెలకట్టలేమని తెలిపారు. ప్రధానోపాధ్యాయురాలు మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి పాఠశాలకు తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని భవిష్యత్తులో సేవా కార్యక్రమాలు చేసే అంత ఎదగాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో రిటైర్డ్ పి జి హెచ్ ఎం వేల్పుల రత్నం,ఈశ్వర్ రెడ్డి, ఉపాధ్యాయ బృందము, విద్యార్థులు పాల్గొన్నారు.