వివాహం జరిగిన మూడేళ్లలోనే విడాకులు తీసుకోవడంపై నటి నిహారిక స్పందించారు. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. విడాకులకు ముందు, తర్వాత ఎదుర్కొన్న సమస్యలపై మాట్లాడారు.అది తనకెంతో క్లిష్టమైన దశ అన్నారు. బాధను తట్టుకోలేక ఎన్నోసార్లు కన్నీళ్లు పెట్టుకున్నానని చెప్పారు.మాది ప్రేమ వివాహం కాదు.వివాహం,ఆ వెంటనే విడిపోవడం ఎంతో క్లిష్టంగా ఉంటుంది.పెళ్లి అనేది చిన్న విషయం కాదు, జీవితాంతం కలిసి ఉండాలనే ఉద్దేశంతోనే ఎవరైనా వివాహం చేసుకుంటారు.నేనూ అదే ఆశతో అడుగులు వేశా అనుకున్నవిధంగా పరిస్థితుల్లేవు.సులభంగా మనుషులను నమ్మకూడదనే కవిషయం అర్థమైంది. నేనొక జీవిత పాఠం నేర్చుకున్నా, ప్రపంచం ఇక్కడితో అయిపోలేదని తెలుసుకున్నా. ఆవిధంగా ముందుకుసాగుతున్నా. ఆన్లైన్ వేదికగా చాలామంది. నా గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. వాటిని చూసి బాధపడిన క్షణాలున్నాయి. నేను ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నానో వాళ్లకు తెలియదు. క్లిష్ట సమయంలో నాన్న అండగా నిలబడ్డారు. నాకు ధైర్యం చెప్పారు. కుటుంబం నన్ను ఎప్పటికీ భారం అనుకోలేదు. ప్రస్తుతానికి నా ఫోకస్ మొత్తం సెల్ఫ్ కేర్ పైనే ఉంది. నేను సంతోషంగా ఉంటూ కుటుంబానికి అన్నివిధాలా తోడుగా ఉండాలనుకుంటున్నా” అని నిహారిక చెప్పారు. నటుడు, నిర్మాత నాగబాబు కుమార్తెగా నిహారిక సుపరిచితురాలే, 2020 డిసెంబర్లో చైతన్య జొన్నలగడ్డతో ఆమెకు వివాహం జరిగింది. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నామని గతేడాది అనౌన్స్ చేశారు. వివాహానంతరం సినిమాలకు దూరమైన నిహారిక ‘డెడ్ ”పిక్సెల్స్’ వెబ్ సిరీస్లో రీ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఆమె ‘వాట్’ ది ఫిష్’లో నటిస్తున్నారు.
