హుజురాబాద్ డిపోను సందర్శించిన ఆర్ఎం

By dhanadhannews.com

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజురాబాద్ పట్టణ కేంద్రంలోని స్థానిక డిపోను కరీంనగర్ రీజినల్ మేనేజర్ రాజు మంగళవారం రోజున సందర్శించారు. అనంతరం డిపో ఆవరణలో మొక్కలు నాటి ఆర్టీసీ సిబ్బందికి పలు సూచనలు తెలియజేశారు. ఆర్ఏం మాట్లాడుతూ నష్టాల్లో ఉన్న ఆర్టీసీ కార్పొరేషన్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంతో లాభాల బాటలో నడుస్తుందని, దీనికి ప్రధాన పాత్ర పోషిస్తుంది డ్రైవర్,కండక్టర్,మెకానిక్ లని,ఎంతో శ్రమ ఒడ్చి వారు కార్పొరేషన్ కోసం కృషి చేస్తున్నారని,ఆర్టీసీ డిపోలో ప్రశాంతమైన వాతావరణం ఉండాలని,బస్సులను పరిశుభ్రంగా ఉంచాలని తద్వారా  ప్రయాణికులకు మంచి సర్వీస్ ఇవ్వడమే కాకుండా ఆదాయం పెరుగుతుందని,ఉద్యోగులకు ఎలాంటి సమస్యలు వచ్చిన తెలుపవచ్చునని నేను అందుబాటులో ఉంటానని తెలియజేశారు.ఆర్ఎంను హుజురాబాద్ డిపో మేనేజర్ రవీంద్రనాథ్ శాలువాతో  ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ఎంఓ భూపతిరెడ్డి,సూపర్డెంట్ నజిరుద్దీన్,ఎస్టిఐ సారయ్య,ఏఎంఎఫ్ సమ్మయ్య,సిస్టం సూపర్వైజర్ రమేష్,డిపో ఉద్యోగులు పాల్గొన్నారు.