- సాయం పెంపు ప్రతిపాదన దిశ కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు … లబ్ధిదారులకు భారీ ఊరట
తెలంగాణ రాష్ట్రంలో పేద కుటుంబాలకు శుభవార్త వినిపిస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం 2026-27 వార్షిక బడ్జెట్‌పై తుది కసరత్తు చేస్తోంది.
ఈసారి బడ్జెట్‌లో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టింది.ప్రత్యేకంగా సామాజిక సంక్షేమ పథకాలపై ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు సమాచారం.
అందులో ముఖ్యంగా ‘కల్యాణ లక్ష్మి’ మరియు ‘షాదీ ముబారక్’ పథకాలపై దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ పథకాల కింద లబ్ధిదారులకు రూ.1,00,116 ఆర్థిక సాయం అందుతోంది.అయితే ఈ మొత్తాన్ని పెంచాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.కొత్త ప్రతిపాదన ప్రకారం అదనంగా రూ.50,000 పెంచే అవకాశం ఉన్నట్లుతెలుస్తోంది.దీంతో మొత్తం సాయం రూ.1,50,116కు పెరగనుంది.
ఈ నిర్ణయం అమలైతే వేలాది పేద కుటుంబాలకు ఊరట లభిస్తుంది.
ప్రత్యేకంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అమ్మాయిల వివాహాలకు ఇది తోడ్పడుతుంది.
బడ్జెట్‌లో ఈ పెంపుకు ప్రత్యేక కేటాయింపులు చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం.ప్రస్తుతం అధికార యంత్రాంగం దీనిపై లెక్కలు సిద్ధం చేస్తోంది.అంతిమంగా అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాతే అధికారిక ప్రకటన వెలువడనుంది.
అయితే ఈ వార్త ఇప్పటికే ప్రజల్లో ఆసక్తిని పెంచుతోంది.
పథకం సాయం పెంపుతో ప్రభుత్వం పేదల సంక్షేమానికి మరింత అంకితభావంతో పనిచేస్తోందని భావిస్తున్నారు.
ఇది అమలైతే సామాజిక భద్రతా చర్యల్లో మరో కీలక అడుగు అవుతుంది.
ఇప్పుడు అందరి దృష్టి బడ్జెట్‌పై నిలిచింది.
ఈ ప్రతిపాదన నిజంగా అమలవుతుందా అన్న ఆసక్తి నెలకొంది.
