భారీ లొంగుబాటు: సీఎం ముందు ఆయుధాలు వదిలిన మావోయిస్టులు

By dhanadhannews.com

హైదరాబాద్/ధనాధన్ న్యూస్. తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి మరో పెద్ద దెబ్బ తగిలింది. శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో 124 మంది మావోయిస్టులు ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతి లో చేరారు. ఈ లొంగుబాటు కార్యక్రమం హైదరాబాద్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగింది. పోలీస్ అధికారుల సమక్షంలో మావోయిస్టులు తమ వద్ద ఉన్న తుపాకులు, ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. లొంగిపోయిన వారిలో PLGA (People’s Liberation Guerrilla Army) కమిటీ సభ్యులు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు.పోలీసుల వివరాల ప్రకారం, లొంగుబాటు సమయంలో మొత్తం 100కు పైగా తుపాకులు అప్పగించబడ్డాయి. వీటిలో AK-47, SLR వంటి ఆధునిక ఆయుధాలు కూడా ఉన్నాయి.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, మావోయిస్టులు హింసా మార్గాన్ని వదిలి ప్రజాస్వామ్య మార్గంలోకి రావడం మంచి పరిణామమని అన్నారు. ప్రభుత్వ పునరావాస పథకాల ద్వారా లొంగిపోయిన వారికి జీవనోపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, మావోయిస్టులు హింసా మార్గాన్ని వదిలి ప్రజాస్వామ్య మార్గంలోకి రావడం మంచి పరిణామమని అన్నారు. ప్రభుత్వ పునరావాస పథకాల ద్వారా లొంగిపోయిన వారికి జీవనోపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.శాంతి, అభివృద్ధి కోసం ఆయుధాలు వదిలి సమాజంలో భాగస్వాములు కావాలని మిగిలిన మావోయిస్టులకు కూడా సీఎం పిలుపునిచ్చారు. రాష్ట్రంలో శాంతి భద్రతల కోసం పోలీసులు చేసిన కృషిని ఆయన అభినందించారు. పోలీసుల సమాచారం ప్రకారం, ఇటీవల జరిగిన ఆపరేషన్ల కారణంగా మావోయిస్టు దళాలు బలహీనపడుతున్నాయి. దీంతో పలువురు నాయకులు, సభ్యులు వరుసగా లొంగిపోతున్నారు.

Leave a ReplyCancel reply