- జమ్మికుంట మున్సిపాలిటీ చైర్మన్ ములుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్)
- ముస్లిం సోదరులందరికీ రంజాన్ పవిత్ర మాస శుభాకాంక్షలు
- జమ్మికుంట పట్టణ సీఐ ఎస్ రామకృష్ణ గౌడ్

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్ కార్యాలయంలో టిడబ్ల్యూజేఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు సౌడమల్ల యోహన్ ఆధ్వర్యంలో ముస్లిం పాత్రికేయులకు అధికారులకు టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు .ఈ కార్యక్రమానికి జమ్మికుంట మున్సిపాలిటీ చైర్మన్ ములుగు ప్రశాంత్, పట్టణ సీఐ ఎస్ రామకృష్ణ గౌడ్, హాజరై వారు మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీక రంజాన్ అని అన్నారు. రంజాన్ మాసంలో సూర్యాస్తమయం తర్వాత ముస్లింలు తమ రోజా (ఉపవాసం) విరమించే భోజనాన్ని “ఇఫ్తార్” అని పోస్తారు ఇది రోజంతా ఆకలి, దప్పులతో గడిపిన తర్వాత తీసుకునే ప్రధాన ఆహారం సాధారణంగా ఖర్జూరాలు, నీటితో ఉపవాసం మొదలుపెట్టి, కుటుంబం, బంధు మిత్రులతో కలిసి ఇఫ్తార్‌ను ఆనందంగా జరుపుకుంటారు.ఈ రంజన్ మాసం మొత్తం రోజు ఉపవాసం ఉండే ముస్లిం సోదర,సోదరీమణులను ఆ అల్లా చల్లగా చూడాలని మరియు జమ్మికుంట పట్టణ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూఎఫ్ జిల్లా కార్యదర్శి కుడితాడి బాపూరావు, జిల్లా నాయకులు ఖాజా ఖాన్,హుజరాబాద్ నియోజకవర్గం కార్యదర్శులు, ఏబూసి సంపత్, భూపతి సంతోష్, అరికిల్ల భానుచందర్, దొడ్డె రాజేంద్రప్రసాద్, కందుకూరి రాజు, బడుగు రవికుమార్,ఎమ్.ఏ రషీద్, రచ్చ రవి కృష్ణ, సంతోష్ ,తదితరులు పాల్గొన్నారు.