ఘనంగా సద్దుల బతుకమ్మ పండుగ వేడుకలు

సైదాపూర్, అక్టోబర్ 18: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఆకునూరు గ్రామంలో సద్దుల బతుకమ్మ పండుగ వేడుకలను ఆడపడుచులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు తీరక్క, గునుగు, చామంతి, బంతి తదితర రకరకాల పుష్పాలతో బతుకమ్మలను భక్తిశ్రద్ధలతో అందంగా అలంకరించారు.అనంతరం తమ ఇళ్లలో పసుపుతో గౌరమ్మను తయారు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాక్షాత్తు పార్వతీదేవి స్వరూపంగా భావించే గౌరమ్మను పూజిస్తూ, ఆమె ఆశీస్సులు, దీవెనలు ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. ఆడపడుచులు సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో […]
