సిసి రోడ్డు పనులను ప్రారంభించిన మాజీ జెడ్పిటిసి

సైదాపూర్ మండలం దుదేనపల్లి గ్రామంలోని పెద్దమ్మ తల్లి దేవస్థానంలోని గుడి చుట్టూ సిసి రోడ్ పనులను బుధవారం రోజున ప్రారంభించడం జరిగిందని ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ జెడ్పిటిసి గుండారపు శ్రీనివాస్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో దుదేదనపల్లి గ్రామ ఎంపీటీసీ చాడ చైతన్య మరియు గ్రామ శాఖ అధ్యక్షులు తాళ్లపల్లి చిన్న వెంకటేశం,కాంగ్రెస్ కార్యకర్తలు,ముదిరాజ్ కులస్తులు పాల్గొన్నారు.రాష్ట్ర రవాణా,బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ముదిరాజ్ కులస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు.
విద్యా ఉపాధి రంగాల్లో మహిళలకు అవకాశాలు కల్పించాలి

చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని,రాష్ట్రం లో వెంటనే మహిళా కమిషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ జన సమితి మహిళా విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు రాగులపెల్లి లక్ష్మి డిమాండ్ చేశారు.మహిళా జన సమితి ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యాలయం లో నిర్వహించిన మహిళా సదస్సులో వారు మాట్లాడుతూ దేశంలో,రాష్ట్రంలో ఇంకా మహిళలు రెండవరకం పౌరులుగానే చూడబడుతున్నారని,సమాన పనికి సమాన వేతనం ఇంకా పొందలేకపోతున్నారని తెలిపారు. ఎన్నికల సమయాల్లో మహిళను మహారాణులను చేస్తామంటూ ఉదార […]
పచ్చదనం పరిశుభ్రత,మానవ సంబంధాలపై అవగాహన కల్పించాలి

ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ప్రజలకు పచ్చదనం పరిశుభ్రత మానవ సంబంధాల అభివృద్ధిపై అవగాహన కల్పించాలని సైదాపూర్ ఎంపీపీ , ఎంపీటీసీల పోరం రాష్ట్ర అధ్యక్షుడు సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు పిలుపునిచ్చారు.సోమవారం రోజున మండలంలోని లస్మన్నపల్లి గ్రామంలో సింగపూర్ లోని వీఎస్ఆర్ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎన్ఎస్ఎస్ వేసవికాల ప్రత్యేక శిబిరాన్ని ప్రారంభం చేశారు.ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను ఉద్దేశించి మాట్లాడుతూ సమాజాన్ని రక్షించేది సమాజాన్ని చైతన్యవంతుల్ని చేసే బాధ్యత ( […]
మహిళా సదస్సు ని విజయవంతం చేయండి

Make the women’s conference a success
మంత్రి పొన్నంని సన్మానించిన దేశిని కోటి

కరీంనగర్ లోని వి కన్వెన్షన్ హాల్ లో ఆదివారం జరిగిన గౌడ కులస్థుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ను జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దేశిని స్వప్న-కోటి గజామాలతో శాల్వతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా దేశిని కోటిని మంత్రి దగ్గరికి తీసుకోని గుండెలకు హత్తుకున్నారు.నాటి నుండి ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో తడక శ్రీకాంత్,నేరెళ్ళ మహేందర్ గౌడ్,బొంగొని వీరన్న,దేశిని సదానందం,శ్రీపతి నరేష్,పైడిపల్లి ఆనందం,రామ్మూర్తి,బుర్ర సంపత్,అయోధ్య గౌడ్, సదానందం,రమేష్,తదితరులు పాల్గొన్నారు
మహాశివరాత్రి రుద్రహోమంలో పాల్గొన్న వొడితల ప్రణవ్

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామంలోని అతి పురాతనమైన శ్రీ అపర్ణ సోమేశ్వర స్వామి ఆలయంలో అభిషేకాలు,రుద్ర హోమం,రాత్రి శివపార్వతుల కల్యాణం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ని ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో మేళతాళాలతో స్వాగతం పలికారు.అనంతరం ఆలయంలో శుక్రవారం శివపార్వతుల కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన రుద్ర హోమం చేశారు.. ఆలయంలో అర్చన అభిషేక కార్యక్రమాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆలయ అర్చకులు వొడితల […]
గంగిరెద్దుల భవనానికి భూమి పూజ

హుజురాబాద్ మండలం శాలపల్లి ఇందిరానగర్ గ్రామంలో మొట్టమొదటి సంచార జాతి అయిన గంగిరెద్దుల కులస్తుల కొరకు 10 లక్షల రూపాయల నిధులతో కమిటీ హాల్ నిర్మించడం జరుగుతుందని ఇందిరానగర్ మాజీ కోడిగూటి శారద ప్రవీణ్ తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 10 లక్షల రూపాయల నిధులతో మొట్టమొదటిసారిగా ఒక సంచార జాతి గంగిరెద్దుల కులానికి కమ్యూనిటీ హాల్ నిర్మించడం తెలంగాణలోనే మొట్టమొదటిగా చెప్పుకోవచ్చని వారు తెలిపారు.మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ శుభకార్యానికి […]
శనివారం రోజున విద్యుత్ సరఫరాలో అంతరాయం

సైదాపూర్,ఆకునూరు సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాలలో మార్చి 9 శనివారం రోజున సాయంత్రం నాలుగు గంటల నుండి 6 గంటల వరకు 33/11 కెవి సబ్ స్టేషన్ మరమ్మతుల దృశ్య విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని సైదాపూర్ ఏఈ బొమ్మ ఆంజనేయులు గౌడ్ తెలియజేశారు.
33% రిజర్వేషన్ మహిళలకు ఇచ్చేవరకు పోరాటం ఆగదు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ధర్నా చేయాల్సి రావడం సిగ్గు చేటని ఎమ్మెల్సీ కవిత అన్నారు.సంతోషంగా సంబురాలు చేసుకునే ఉమెన్స్ డే రోజున ఆడ బిడ్డల ఉద్యోగాలకై ధర్నాలు చేసే దౌర్భాగ్యపు స్థితిని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసు కొచ్చిందని విమర్శించారు. బాబా సాహెబ్ అంబేద్కర్ మహిళలకు అనేక హక్కు లు కల్పించారని చెప్పారు.ప్రభుత్వ నియామకాల్లో మహిళలకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఇవాళ హైదరాబాద్ ధర్నా చౌక్‌లో ఎమ్మెల్సీ కవిత దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ […]
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి వినతి పత్రం

సైదాపూర్ మండలానికి చెందిన వైద్యఆరోగ్యశాఖలో విధులు నిర్వహిస్తున్న రెండవ ఏఎన్ఎంలకు గత మూడు నెలలుగా వేతనాలు రాక మేము తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నామని,ఈఎంఐ చెల్లింపులు పిల్లల కళాశాల ఫీజులు,మా ఆరోగ్యరీత్యా మెడిసిన్ ఖర్చులు,మారోజు వారి రవాణా ఖర్చుల విషయంలో తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నామని,మాకు వెంటనే డిసెంబర్,జనవరి,ఫిబ్రవరి మూడు మాసాల వేతనాలను విడుదల చేసి మాఖాతాలో జమ చేయగలరని గురువారం రోజున జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుజాతకి తెలంగాణ రెండవ ఏఎన్ఎం అసోసియేషన్ ఆధ్వర్యంలో వినతిపత్రం […]
