వరి మొక్కజొన్న యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన

సైదాపూర్ మండలంలోనివెన్నంపల్లి గ్రామ రైతు వేదికలో మంగళవారం రోజున కేవీకే జమ్మికుంట శాస్త్రవేత్త శ్రీనివాస్ రెడ్డి  రైతులకు వరి మరియు మొక్కజొన్న పంటల ఎరువుల యాజమాన్యం,వాటిలో వచ్చు వివిధ రకాల పురుగులు,తెగుళ్ల యాజమాన్యం మీద అవగాహన కార్యక్రమం కల్పించడం జరిగింది.డిడిఏ,ఎఫ్టిసి చత్రునాయక్  రైతులకు సేంద్రీయ వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయం చేయడం వలన నేలకు,రైతుకు కలిగే లాభాల గూర్చి వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎంఏవో వైదేహి,ఏఈవో రజిత గ్రామ రైతులు పాల్గొన్నారు.

రంజాన్ ఏర్పాట్లకై జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం

ఈ నెల 12వ తేదీన ప్రారంభం కానున్న 30 రోజుల పవిత్ర రంజాన్ మాసంను పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సూచించిన విధంగా రంజాన్ పండుగ ఏర్పాట్లు పకడ్బందిగా చేయాలని కోరుతూ నేడు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ మైనార్టి డిపార్ట్మెంట్ చైర్మన్ మహ్మద్ తాజొద్దీన్ ఆధ్వర్యంలో పలువురు మైనారిటీ నేతలతో కలిసి కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.కరీంనగర్ పట్టణంతో పాటు జిల్లాలోని 4 మున్సిపాలిటిలు,16 మండలాల పరిధిలోని […]

ప్రజా పాలనలో కొలువుల జాతర

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తను ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్క పథకాన్ని అమలు చేస్తూ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా 90 రోజుల్లోనే ప్రజలు మెచ్చే విధంగా తన పరిపాలన కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన విషయంలో ఒక అడుగు ముందుకు వేసి 5192 మంది కి జూనియర్ లెక్చరర్, గురుకుల టీచర్లు గా ఉద్యోగ నియామక పత్రాలు అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. ఇదే కాకుండా ఎన్నో […]

సైదాపూర్ లో ప్రజా పాలన హెల్ప్ డెస్క్ ప్రారంభం

సైదాపూర్ మండలకేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం రోజున ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కేంద్రాన్ని  రాష్ట్ర ఎంపీపీల పోరం రాష్ట్ర అధ్యక్షుడు సైదాపూర్ ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు.అనంతరం మాట్లాడుతూ ప్రజా పాలన సేవ కేంద్రం దరఖాస్తు చేసుకున్నవరు వారి దరఖాస్తులలో ఏమైనా తప్పులుంటే సవరణ చేసుకునే వెసులుబాటు ఉంటుందని, అలాగే గతంలో దరఖాస్తు చేసుకొని వారు కొత్తగా ప్రజాపాలన హెల్ప్ డెస్క్ లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో దూలం మంజుల,ఎంపీడీవో […]

బీజేపీ గెలిస్తే మోదీయే పీఎం- మరి కాంగ్రెస్ గెలిస్తే ఎవరు పీఎం

మరో 10 రోజుల్లో ఎన్నికల కోడ్ రాబోతోంది.ఆరు గ్యారంటీలు అటకెక్కబోతున్నాయి.ఆ హామీలను కాకి ఎత్తుకెళ్లిందని చెప్పబోతున్నరు.గట్టిగా నిలదీస్తే మేం హామీలను అమలు చేయాలనుకున్నాం,కానీ ఎలక్షన్ కోడ్ వచ్చింది.ఎన్నికలైపోంగనే అమలు చేస్తామని కాకమ్మ కథలు చెప్పబోతున్నరని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు.గత పాలనలో చేసిన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ తో కుమ్కక్కై 6 గ్యారంటీలపై నోరు మెదపడటం లేదని మండిపడ్డారు.రెండు పార్టీలకు తగిన బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ […]

మహిళల ఆర్థిక అభివృద్ధికి సంపూర్ణ సహకారం

మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెంది స్వయం సమృద్ధి సాధించే దిశగా ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు.శనివారం రాష్ట్ర,ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మంథని పట్టణంలో ఎన్.ఏ.సి ను సందర్శించి మహిళలకు రెండవ బ్యాచ్ కుట్లు, అల్లికల శిక్షణను ప్రారంభించారు.ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వం అందించే అవకాశాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం […]

మున్సిపల్ సర్వసభ్య సమావేశ ఎజెండా లో అవినీతి

మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశంలో ప్రవేశ పెట్టిన ఎజండ ప్రజల కోసం అభివృద్ది కోసం ఉపయోగ పడేలా లేదని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఆరోపిస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సర్వసభ్య సమావేశం 12 గంటలకు వుందని సమాచారం అందించి ఆ తరువాత 11 గంటలకు సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు మున్సిపల్ అధికారులు మళ్ళీ సమాచారం అందించారని తెలిపారు.ఈ సమాచారం తో 11:30 కు మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ గదిలోకి వెళ్ళగానే […]

ఎక్సైజ్ సిఐ,ఎస్సై లకు ఘన సన్మానం

సాధారణ బదిలీల్లో భాగంగా జమ్మికుంట పట్టణానికి నూతనంగా వచ్చినటువంటి ఎక్సైజ్ సీఐ మాధవిలత,ఎస్సై సౌమ్యలను సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడు మండలాల పరిధిలో ఉన్న గీత కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని,గీత కార్మికులకు ప్రమాదవశాత్తు ప్రమాదం జరిగినప్పుడు పై అధికారులతో మాట్లాడి ప్రమాద బారిన పడిన కార్మికునికి న్యాయం చేసేలా కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమములో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మ్యాడగొని బుచ్చయ్య గౌడ్,జిల్లా […]

దళితబందు రెండవ విడత ఎప్పుడు ఇస్తారో జిల్లా మంత్రి ప్రకటన చేయాలి

హుజురాబాద్ నియోజకవర్గం లోని పైలెట్ ప్రాజెక్టు అయినటువంటి దళితబందును రెండవ విడతను ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు పూర్తిస్థాయిలో మంజూరు చేస్తుందో జిల్లా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ ఒక ప్రకటన ద్వారా తెలపాలని హుజురాబాద్ నియోజకవర్గ దళితబందు సాధన సమితి సభ్యులు విజ్ఞప్తి చేశారు.గత బి అర్ ఎస్ ప్రభుత్వం దళితబందు పూర్తిస్థాయిలో మంజూరు చేయడంలో విఫలం అయిందని రెండవ విడత కోసం 18 నెలలుగా ఎదురు చూస్తున్న దళితులకు అన్యాయం చేశారని,ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అయిన […]

దళిత బందు ఇచ్చేది పక్కా కాంగ్రెస్ ప్రభుత్వమే

హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలో “దళిత బంధు” రెండో విడత అమలును ఆపింది అప్పటి బీఆర్ఎస్ సర్కార్,అప్పటి ఎమ్మెల్సీ,ప్రస్తుత ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. గురువారం జమ్మికుంట పట్టణంలోని  ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాతకాల అనిల్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ “దళిత బందు” సాధన కమిటీ నాయకుల ప్రకటనల వల్ల దళిత బంద్ లబ్ధిదారులు అయోమయానికి గురవుతున్నారని,కాంగ్రెస్ ప్రభుత్వంను బద్నామ్ […]