సైదాపూర్ లో బీఆర్ ఎస్ పార్టి ముఖ్య కార్యకర్తలు సమావేశం

సైదాపూర్ మండలం లో బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సోమరపు రాజయ్య ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కరీంనగర్  బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయిన్ పల్లి వినోద్ కుమార్ ,మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ హాజరై ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 12 ఎస్ ఆర్ ఆర్ కాలేజ్ గ్రౌండ్లో జరిగే  కరీంనగర్ కధన  బేరి కి సభకు మండలం నుండి 2000 వెల మంది తరలివచ్చి […]

వరి మొక్కజొన్న యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన

సైదాపూర్ మండలంలోనివెన్నంపల్లి గ్రామ రైతు వేదికలో మంగళవారం రోజున కేవీకే జమ్మికుంట శాస్త్రవేత్త శ్రీనివాస్ రెడ్డి  రైతులకు వరి మరియు మొక్కజొన్న పంటల ఎరువుల యాజమాన్యం,వాటిలో వచ్చు వివిధ రకాల పురుగులు,తెగుళ్ల యాజమాన్యం మీద అవగాహన కార్యక్రమం కల్పించడం జరిగింది.డిడిఏ,ఎఫ్టిసి చత్రునాయక్  రైతులకు సేంద్రీయ వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయం చేయడం వలన నేలకు,రైతుకు కలిగే లాభాల గూర్చి వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎంఏవో వైదేహి,ఏఈవో రజిత గ్రామ రైతులు పాల్గొన్నారు.

సైదాపూర్ లో ప్రజా పాలన హెల్ప్ డెస్క్ ప్రారంభం

సైదాపూర్ మండలకేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం రోజున ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కేంద్రాన్ని  రాష్ట్ర ఎంపీపీల పోరం రాష్ట్ర అధ్యక్షుడు సైదాపూర్ ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు.అనంతరం మాట్లాడుతూ ప్రజా పాలన సేవ కేంద్రం దరఖాస్తు చేసుకున్నవరు వారి దరఖాస్తులలో ఏమైనా తప్పులుంటే సవరణ చేసుకునే వెసులుబాటు ఉంటుందని, అలాగే గతంలో దరఖాస్తు చేసుకొని వారు కొత్తగా ప్రజాపాలన హెల్ప్ డెస్క్ లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో దూలం మంజుల,ఎంపీడీవో […]

పురుషుల పొదుపు సంఘం సమితి అధ్యక్షుడి ఏకగ్రవ ఎన్నిక

సైదాపూర్ పురుషులు పొదుపు సంఘం సమితి అధ్యక్షుడుగా పైడిపల్లి రవీందర్ గౌడ్ ను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు 8 సంఘల పరిదిలోని అధ్యక్షులు ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో సహవికాస ప్రతినిదులు కవిత  లక్ష్మణ్,  సమితి పాలకవర్గ సభ్యుల ఆద్వర్యంలో ఎన్నుకోవడం జరిగింది.సమితి ఉపాధ్యక్షుడుగా బత్తుల భూమయ్య  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమంలో 8 సంఘాల అధ్యక్షులు సంఘాల పాలకవర్గాలు మరియు ఘణకులు పోగు రమేష్,జేల్ల శ్రీనివాస్,బత్తుల భూమయ్య,ఇందులకంటి మాధవరెడ్డి,తిరుపతి,వాసుదేవ రెడ్డి,మదన్ మొహన్,చెంచాల దిలీప్,రాజిరెడ్డి,వెల్ది రాజు తదితరులు పాల్గొన్నారు.

బండి సంజయ్ కి మతి బ్రమించింది

కరీంనగర్,ధనాధన్ న్యూస్: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నిన్న చిగురుమామిడి మండలంలో జరిగిన ప్రజాహిత యాత్రలో రాష్ట్ర  రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని,దమ్ము ధైర్యం ఉంటే ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలి తప్ప వ్యక్తిగత దూషణలతో పాటు మహిళ లోకాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం దురదృష్టకరమని అన్నారు.తక్షణమే మంత్రి పొన్నం కి క్షమాపణలు చెప్పనియెడల బండి ప్రజాహిత యాత్ర ని అడ్డుకుంటామని హెచ్చరించారు. కేవలం […]

మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన ఉడిగే రాజశేఖర్

సైదాపూర్,ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలంలోని దుద్దెనపల్లి గ్రామంలో ఇటీవలే అనారోగ్యంతో మరణించిన కోడం పద్మ(50)  కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.అనంతరం మణికంఠ మాడ్రన్ రైస్ మిల్ ఉడిగే విజయ రాజశేఖర్  50 కిలోల బియ్యం సహాయం అందించడం జరిగింది. అనంతరం మాట్లాడుతూ గ్రామ ప్రజలకు ఎల్లవేళలా  ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రకాష్,సురేష్,శ్రీనివాస్,ప్రవీణ్, చంద్రమోహన్ పాల్గొన్నారు.

పేద మహిళలను లక్పతీ దీదీలుగా తయారు చేయాలి

సైదాపూర్,ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండల కేంద్రంలోని స్త్రీశక్తి భవనంలోని సంతోషిమాత మండల సమాఖ్య కార్యాలయం లో మంగళవారం రోజున సెర్ప్ సిబ్బంది వివోఏలకు లక్పతి దీదీ కార్యక్రమంపై డిపిఎం వంగ రవిందర్,ఎపిఎంలు తిరుపతి,కుమారస్వామిలు శిక్షణ ఇచ్చారు.శిక్షణ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ గ్రామైఖ్య సంఘం పరిదిలో ఎనభై మంది మహిళలను గుర్తించి వారిని ఫెసిలిటేట్ చేస్తూ ట్రబుల్ షూటర్ గా,నైపుణ్యాలు కల్పించి పర్యవేక్షణ చేసే భాధ్యత రిసోర్స్ పర్సన్స్  చూడాలని,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలను తెలియజేస్తూ ఉపాధి అవకాశాలు […]

శివాజీ ఉత్సవ కమిటీ ఉన్నట్టా లేనట్టా

సైదాపూర్,ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలంలోని ఆకునూరు గ్రామంలో గత సంవత్సరంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేతుల మీదుగా ఆకునూరు గ్రామంలో శివాజీ కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్,స్వామి వివేకానంద,చత్రపతి శివాజీ విగ్రహాలను అన్నదానాలతో అంగరంగ వైభవంగా  ఆవిష్కరించారు.అంతవరకు బాగానే ఉన్నా,ఛత్రపతి శివాజీ విగ్రహం ఆవిష్కరించిన తరువాత మొదట వచ్చిన జయంతి ఉత్సవాలను సోమవారం రోజున ఎవరు నిర్వహించలేదు.అందుకు గల కారణాలు ఏమైనా ఉత్సవ నిర్వహణ చేయకపోవడం మాత్రం గ్రామ ప్రజలను ద్రిగ్బంతికి గురిచేసింది.కనీసం వచ్చే […]

మృతుని కుటుంబానికి పరామర్శ

సైదాపూర్,ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలంలోని దుద్దెనపల్లి గ్రామానికి  కేశవేణి రాయమల్లు(89) అనారోగ్యంతో ఇటీవలే మరణించగా వారి కుటుంబ సభ్యులను ఆదివారం రోజున పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన అనంతరం మణికంఠ మాడ్రన్ రైస్ మిల్ ఉడిగే విజయ రాజశేఖర్  25కిలోల బియ్యం అందజేయడం జరిగిందని,గ్రామ ప్రజలకు ఎల్లవేళలా  ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని తెలిపారు.ఈ కార్యక్రమంలో పేసరు సంపత్,నీల కృష్ణ,అప్పాల మల్లేష్,కుందేళ్ళ సమ్మయ్య,పర్షవేణి విజయ్,టి శ్రీనివాస్,పొన్నం వెంకటయ్య,కేశవేణి బాలయ్య  పాల్గొన్నారు.

పొన్నం ప్రభాకర్ పై అనుచిత వాఖ్యలు చేస్తే తాట తిస్తాం

సైదాపూర్,ధనాధన్ న్యూస్: మంత్రి పొన్నం ప్రభాకర్ పై అనుచిత వాఖ్యలు చేస్తే ఉరుకునేది లేదని హుస్నాబాద్ నియెజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వేముల శ్రీనివాస్ ఒక ప్రకటన లో హెచ్చరించారు.ఈ సందర్భంగా వేముల శ్రీనివాస్ మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ విమర్శించే స్థాయి పాడి కౌశిక్ రెడ్డి కి లేదని అసలు తెలంగాణ ఉద్యమ సమయంలో పాడి కౌశిక్ రెడ్డి ఎక్కడ ఉన్నరని ఎద్దేవా చేశారు.ఉద్యమం ద్రోహి కౌశిక్ రెడ్డి అని ప్రజలను బ్లాక్ మెయిల్ […]