గజ్జెల కాంతం కే పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ టిక్కెట్ ఇవ్వాలి

జమ్మికుంట మండలంలోని విలాసాగర్ గ్రామంలో ఎర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచపల్లి సాగర్ మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా గజ్జెల కాంతంకి ఇవ్వాలని తెలంగాణ అంబేడ్కర్ యువజన సంఘం హుజూరాబాద్ నియోజకవర్గ ఇంచార్జీ రాచపల్లి సాగర్ కాంగ్రెస్ పార్టీ ని కోరారు.తెలంగాణ రాష్ట్రంలో 80 లక్షల మంది మాదిగలు గత ప్రభుత్వం చేసిన అణచివేతను గమనించే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో యావత్తు మాదిగలు కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడి […]

చదువుకు పేదరికం అడ్డుకాకూడదు

చదువుకు పేదరికం అడ్డు కాదని,చదువుకోవడానికి ముందుకు వస్తే సహకరించడానికి మేము ఉన్నామని, కలుషితం లేని మంచినీరు తాగడం కోసం పాఠశాలకు వాటర్ ప్యూరిఫైడ్ నీళ్లను త్వరలోనే అందజేస్తామని కాంగ్రెస్ హుజురాబాద్ నియోజకవర్గ ఇంఛార్జ్ వొడితల ప్రణవ్ అన్నారు.హుజురాబాద్లోని జిల్లా బాలికల ఉన్నత పాఠశాలలో జయన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షప్యాడ్లు,స్టేషనరీని అందజేశారు.

రైల్వే పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

రైల్వే పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జమ్మికుంట బ్రాంచ్ సర్వసభ్య సమావేశం ఏర్పాటు జరిగింది. పాత కార్యవర్గం యొక్క కాల పరిమితి ముగిసినందున, నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షుడుగా దాసరి రాజేశ్వరరావు, కార్యదర్శిగా మొహమ్మద్ మొయినుద్దీన్, కార్యనిర్వాహక అధ్యక్షుని గా టీ వెంకటస్వామి, సంయుక్త్య కార్యదర్శిగా శీలం మల్లేశం, సహాయ కార్యదర్శులుగా ఏం పరశురాములు, జి.మొగిలి, బి.సమ్మయ్య, డి. సారంగపాణి, ఎస్.రామచందర్, ఎస్.రాజయ్య కోశాధికారిగా బి.విద్యాసాగర్ సహాయ కోశాధికారిగా ఎండి ఖాదర్ ఖాన్ గౌరవ సలహాదారులుగా […]

కార్పొరేషన్ల ఏర్పాటు పట్ల హర్షం

ఎన్నో ఏళ్ల ఉద్యమ ఫలితంగా కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో 16 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించడం అభినందనీయం అని తెలంగాణ ఓసి జేఏసీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి గూడూరి స్వామిరెడ్డి (లోక్సత్తా) పేర్కొన్నారు. గూడూరి స్వామిరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద సీఎం రేవంత్రెడ్డి,మంత్రి పొన్నం ప్రభాకర్, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వొడితెల ప్రణవ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత […]

ప్రజా సమస్యల పరిష్కారమే
ప్రధాన ధ్యేయం

సైదాపూర్ మండలంలో పలు అభివృద్ధి పనులను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ పార్టీలకతీతంగా ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకెళ్తున్నానని వెల్లడించారు.గ్రామాల్లో తాగునీటికి ఏ ఒక్కరు ఇబ్బంది పడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని,ఇందుకు నిధులు మంజూరు చేసే బాధ్యత తాను తీసుకుంటానని పేర్కొన్నారు. గురువారం సైదాపూర్ మండలానికి సంబంధించి దాదాపు కోటి రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్,జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి శంకుస్థాపన చేశారు. అమనగుర్తి  […]

మున్నూరు కాపుల కల నెరవేరింది

-పొనగంటి మల్లయ్య,మున్నూరు కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మున్నూరు కాపు రాష్ట్ర కార్పొరేషన్  ఏర్పాటు చేయడంతో మున్నూరు కాపుల కల నెరవేరిందని మున్నూరు కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి పొనగంటి మల్లయ్య అన్నారు.బుధవారం స్థానిక మోత్కులగూడెం చౌరస్తాలో మున్నూరు కాపు జర్నలిస్టుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఏబూసి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బాణాసంచాలు పేల్చి,స్వీట్లు పంపిణీ చేసి,సంబరాలు చేసుకున్నారు.అనంతరం పొనగంటి మల్లయ్య,సింగిల్ విండో అధ్యక్షులు పొనగంటి సంపత్,మున్నూరు కాపు జిల్లా […]

మంత్రి పొన్నంని సన్మానించిన దేశిని కోటి

కరీంనగర్ లోని వి కన్వెన్షన్ హాల్ లో ఆదివారం జరిగిన గౌడ కులస్థుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ను జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దేశిని స్వప్న-కోటి గజామాలతో శాల్వతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా దేశిని కోటిని మంత్రి దగ్గరికి తీసుకోని గుండెలకు హత్తుకున్నారు.నాటి నుండి ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో తడక శ్రీకాంత్,నేరెళ్ళ మహేందర్ గౌడ్,బొంగొని వీరన్న,దేశిని సదానందం,శ్రీపతి నరేష్,పైడిపల్లి ఆనందం,రామ్మూర్తి,బుర్ర సంపత్,అయోధ్య గౌడ్,  సదానందం,రమేష్,తదితరులు పాల్గొన్నారు

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో అధ్యక్షురాలు మురికి పూర్ణిమ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలలో డాక్టర్ హేమలత, వావిలాల కొత్తూరు జయశ్రీ,వికారాబాద్ ప్రవచన రత్న బిరుదాంకితురాలు,గీతా ప్రచారకురాలు విశ్వహిందూ పరిషత్ జిల్లా మాతృ శక్తి సంయోజక భాగ్యలక్ష్మి, ఫార్మర్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఆదర్శ రైతు అవార్డు గ్రహీత చాలా స్వరూప,కొత్తపల్లి డాక్టర్ వాణి, పెళ్లి అరుణాదేవి,వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ గవర్నర్ డాక్టర్ జంధ్యం మాధవి,ఆదర్శ రైతు ఆస్కార్ అవార్డు గ్రహీత,వాసవి […]

సిరిసేడు లో వైభవంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం

ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు గ్రామంలోని అతి పురాతనమైన శ్రీ అపర్ణ సోమేశ్వరస్వామి శివాలయంలో నిర్వహించిన శివపార్వతుల కళ్యాణం పెద్ద ఎత్తున హాజరైన భక్తుల మధ్య కనులపండువగా జరిగింది.ఈ కళ్యాణ మహోత్సవానికి హాజరైన హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆలయ కమిటీ ఛైర్మన్ కొండ విజయ్ స్వగృహం నుండి మేళతాలల మధ్య ముత్యాల తలంబ్రాలు మోసుకెళ్లి శివాలయంలో నిర్వహించే శివపార్వతుల కళ్యాణానికి సమర్పించారు.అనంతరం పాడి కౌశిక్ రెడ్డి ఆలయంలో ప్రత్యేక అర్చన,అభిషేకాలు చేశారు.ఈ సందర్భంగా వేదపండితులు […]