రైల్వే పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

రైల్వే పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జమ్మికుంట బ్రాంచ్ సర్వసభ్య సమావేశం ఏర్పాటు జరిగింది. పాత కార్యవర్గం యొక్క కాల పరిమితి ముగిసినందున, నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షుడుగా దాసరి రాజేశ్వరరావు, కార్యదర్శిగా మొహమ్మద్ మొయినుద్దీన్, కార్యనిర్వాహక అధ్యక్షుని గా టీ వెంకటస్వామి, సంయుక్త్య కార్యదర్శిగా శీలం మల్లేశం, సహాయ కార్యదర్శులుగా ఏం పరశురాములు, జి.మొగిలి, బి.సమ్మయ్య, డి. సారంగపాణి, ఎస్.రామచందర్, ఎస్.రాజయ్య కోశాధికారిగా బి.విద్యాసాగర్ సహాయ కోశాధికారిగా ఎండి ఖాదర్ ఖాన్ గౌరవ సలహాదారులుగా … Read more

కార్పొరేషన్ల ఏర్పాటు పట్ల హర్షం

ఎన్నో ఏళ్ల ఉద్యమ ఫలితంగా కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో 16 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించడం అభినందనీయం అని తెలంగాణ ఓసి జేఏసీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి గూడూరి స్వామిరెడ్డి (లోక్సత్తా) పేర్కొన్నారు. గూడూరి స్వామిరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద సీఎం రేవంత్రెడ్డి,మంత్రి పొన్నం ప్రభాకర్, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వొడితెల ప్రణవ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత … Read more

ప్రజా సమస్యల పరిష్కారమే
ప్రధాన ధ్యేయం

సైదాపూర్ మండలంలో పలు అభివృద్ధి పనులను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ పార్టీలకతీతంగా ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకెళ్తున్నానని వెల్లడించారు.గ్రామాల్లో తాగునీటికి ఏ ఒక్కరు ఇబ్బంది పడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని,ఇందుకు నిధులు మంజూరు చేసే బాధ్యత తాను తీసుకుంటానని పేర్కొన్నారు. గురువారం సైదాపూర్ మండలానికి సంబంధించి దాదాపు కోటి రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్,జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి శంకుస్థాపన చేశారు. అమనగుర్తి  … Read more

మున్నూరు కాపుల కల నెరవేరింది

-పొనగంటి మల్లయ్య,మున్నూరు కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మున్నూరు కాపు రాష్ట్ర కార్పొరేషన్  ఏర్పాటు చేయడంతో మున్నూరు కాపుల కల నెరవేరిందని మున్నూరు కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి పొనగంటి మల్లయ్య అన్నారు.బుధవారం స్థానిక మోత్కులగూడెం చౌరస్తాలో మున్నూరు కాపు జర్నలిస్టుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఏబూసి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బాణాసంచాలు పేల్చి,స్వీట్లు పంపిణీ చేసి,సంబరాలు చేసుకున్నారు.అనంతరం పొనగంటి మల్లయ్య,సింగిల్ విండో అధ్యక్షులు పొనగంటి సంపత్,మున్నూరు కాపు జిల్లా … Read more

మహిళా సదస్సు ని విజయవంతం చేయండి

Make the women’s conference a success

మంత్రి పొన్నంని సన్మానించిన దేశిని కోటి

కరీంనగర్ లోని వి కన్వెన్షన్ హాల్ లో ఆదివారం జరిగిన గౌడ కులస్థుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ను జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దేశిని స్వప్న-కోటి గజామాలతో శాల్వతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా దేశిని కోటిని మంత్రి దగ్గరికి తీసుకోని గుండెలకు హత్తుకున్నారు.నాటి నుండి ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో తడక శ్రీకాంత్,నేరెళ్ళ మహేందర్ గౌడ్,బొంగొని వీరన్న,దేశిని సదానందం,శ్రీపతి నరేష్,పైడిపల్లి ఆనందం,రామ్మూర్తి,బుర్ర సంపత్,అయోధ్య గౌడ్,  సదానందం,రమేష్,తదితరులు పాల్గొన్నారు

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో అధ్యక్షురాలు మురికి పూర్ణిమ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలలో డాక్టర్ హేమలత, వావిలాల కొత్తూరు జయశ్రీ,వికారాబాద్ ప్రవచన రత్న బిరుదాంకితురాలు,గీతా ప్రచారకురాలు విశ్వహిందూ పరిషత్ జిల్లా మాతృ శక్తి సంయోజక భాగ్యలక్ష్మి, ఫార్మర్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఆదర్శ రైతు అవార్డు గ్రహీత చాలా స్వరూప,కొత్తపల్లి డాక్టర్ వాణి, పెళ్లి అరుణాదేవి,వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ గవర్నర్ డాక్టర్ జంధ్యం మాధవి,ఆదర్శ రైతు ఆస్కార్ అవార్డు గ్రహీత,వాసవి … Read more

సిరిసేడు లో వైభవంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం

ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు గ్రామంలోని అతి పురాతనమైన శ్రీ అపర్ణ సోమేశ్వరస్వామి శివాలయంలో నిర్వహించిన శివపార్వతుల కళ్యాణం పెద్ద ఎత్తున హాజరైన భక్తుల మధ్య కనులపండువగా జరిగింది.ఈ కళ్యాణ మహోత్సవానికి హాజరైన హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆలయ కమిటీ ఛైర్మన్ కొండ విజయ్ స్వగృహం నుండి మేళతాలల మధ్య ముత్యాల తలంబ్రాలు మోసుకెళ్లి శివాలయంలో నిర్వహించే శివపార్వతుల కళ్యాణానికి సమర్పించారు.అనంతరం పాడి కౌశిక్ రెడ్డి ఆలయంలో ప్రత్యేక అర్చన,అభిషేకాలు చేశారు.ఈ సందర్భంగా వేదపండితులు … Read more

మహాశివరాత్రి రుద్రహోమంలో పాల్గొన్న వొడితల ప్రణవ్

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామంలోని అతి పురాతనమైన శ్రీ అపర్ణ సోమేశ్వర స్వామి ఆలయంలో అభిషేకాలు,రుద్ర హోమం,రాత్రి శివపార్వతుల కల్యాణం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ని ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో మేళతాళాలతో స్వాగతం పలికారు.అనంతరం ఆలయంలో శుక్రవారం శివపార్వతుల కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన రుద్ర హోమం చేశారు.. ఆలయంలో అర్చన అభిషేక కార్యక్రమాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆలయ అర్చకులు వొడితల … Read more

గంగిరెద్దుల భవనానికి భూమి పూజ

హుజురాబాద్ మండలం శాలపల్లి ఇందిరానగర్ గ్రామంలో మొట్టమొదటి సంచార జాతి అయిన గంగిరెద్దుల కులస్తుల కొరకు 10 లక్షల రూపాయల నిధులతో కమిటీ హాల్ నిర్మించడం జరుగుతుందని ఇందిరానగర్ మాజీ కోడిగూటి శారద ప్రవీణ్ తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 10 లక్షల రూపాయల నిధులతో మొట్టమొదటిసారిగా ఒక సంచార జాతి గంగిరెద్దుల కులానికి కమ్యూనిటీ హాల్ నిర్మించడం తెలంగాణలోనే మొట్టమొదటిగా చెప్పుకోవచ్చని వారు తెలిపారు.మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ శుభకార్యానికి … Read more