సైబర్ క్రైమ్ నేరాల పట్ల అవగాహన

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: సైబర్ క్రైమ్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని,బండి మీద వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ ఆంక్షలను పాటించాలని జమ్మికుంట ఎస్సై ఆరోగ్యం తెలిపారు.జమ్మికుంట మండల పరిధిలోని జగ్గయ్యపల్లి గ్రామములో సాయంత్రం సైబర్ క్రైమ్ మోసాల పట్ల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.నేను సైతం కార్యక్రమంలో సోలార్ సీసీ కెమెరాల పట్ల ప్రజల మరింత బాధ్యతగా ముందుకు వెళ్లాలని,దాతలు సహకరించాలని,మంచి కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ పోలీసు అధికారులు జలీల్,సోని,బ్లూ కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

ఆనందోత్సహాల నడుమ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ఇల్లందకుంట/ధనాధన్ న్యూస్: ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలలో ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.2003-04 సంవత్సరం లో పదవ తరగతి చదివిన విద్యార్థులు పాఠశాల ప్రాంగణంలో కలుసుకొని ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. నాటి పూర్వ విద్యార్థులందరూ ఒకచోట చేరడంతో సందడి నెలకొని ముఖాల్లో వెలుగులు నిండాయి. అనంతరం అప్పటి  ఉపాధ్యాయులను ఆహ్వానించి వారిని ఘనంగా సత్కరించి జ్ఞాపకలను అందజేశారు.20 […]

రాష్ట్రవ్యాప్తంగా ఆటోల బంద్ విజయవంతం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట మండల పరిధిలోని స్థానిక బస్టాండ్ ఏరియా,కొత్తపల్లి మడిపల్లి చౌరస్తా వద్ద శనివారం రోజున,రాష్ట్రవ్యాప్తంగా ఆటోల బందుకు పిలుపునిచ్చిన యూనియన్ సంఘాలు నేడు  రాష్ట్రవ్యాప్తంగా ఆటోలను బందు చేస్తూ నిరసనలు వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టి నేటితో సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆటో కార్మికులు జీవనోపాధి తీవ్రంగా దెబ్బతిన్నదని,ఈ పథకం వలన ఆటో కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని రాష్ట్రవ్యాప్తంగా మహాలక్ష్మి […]

ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలను ఆకస్మిక తనిఖీలు చేసిన ప్రణవ్

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: గతంలో కంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ పాఠశాలలో అన్నిరకాల సౌకర్యాలు చేపడుతున్నామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ అన్నారు.శనివారం నాడు హుజురాబాద్ నియోజకవర్గంలోని వీణవంక,సైదాపూర్ మండలాల పరిధిలోగల ఎంజెపిబిటి బాలుర పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీలు చేశారు.అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి వసతులపై ఆరాతీసి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు.గతానికంటే భిన్నంగా విద్యార్థుల డైట్ విషయంలో అనేక రకాల చర్యలు […]

దోషులను కఠినంగా శిక్షించాలి

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: కమలాపూర్ మండలం శనిగరం గ్రామంలో గురువారం రాత్రి శ్రీ మల్లేశ్వర స్వామి దేవాలయంలో విగ్రహాలు ధ్వంసం చేసిన వ్యక్తులను గుర్తించి కఠినంగా శిక్షించాలని రజక యువజన సంఘం జిల్లా నాయకులు కైలాసకోటి గణేష్ డిమాండ్ చేశారు.ఈ సందర్బంగా పత్రిక ప్రకటనలో గణేష్ మాట్లాడుతూ రజక కుల బాంధవుడు శ్రీ మల్లేశ్వర స్వామి విగ్రహాల ధ్వంసం చేసి రజక కుల బాంధవుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని అధికారులను కోరారు.తెలంగాణ రాష్ట్రంలో   […]

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్ పై భగ్గుమన్న హుజురాబాద్

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టుతో హుజురాబాద్ నియోజకవర్గం ఒక్కసారిగా భగ్గుమంది.ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు జగదీశ్ రెడ్డి లతోపాటు టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు నాయకులను అక్రమ అరెస్టులను నిరసిస్తూ హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట కేంద్రంగా టిఆర్ఎస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు.దీంతో పోలీసులు వారిని నివారించే ప్రయత్నం చేశారు.అనంతరం టిఆర్ఎస్ నాయకులను అరెస్టు చేశారు.ఈ సందర్భంగా టిఆర్ఎస్ నాయకులు పలువురు […]

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్ హేయమైన చర్య

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి  హైదరాబాదులోతన నివాసంలో పోలీసులు అరెస్టు చేయడం హేయమైన  చర్య అని మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక శ్రీనివాస్ అన్నారు.తన ఫోన్ టాపింగ్ చేస్తున్నారని బంజారా హిల్స్ ఏసిపి అనుమతి తోనే ఫిర్యాదు చేయడానికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పోలీస్ స్టేషన్ కి వెళ్లారని అన్నారు.పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇయ్యడానికి వెళ్తే విధులకు ఆటంకం కలిగించారని సిఐ ఫిర్యాదు చేయడం పోలీసుల విజ్ఞతికేవదిలేస్తున్నామన్నారు.ఎమ్మెల్యే ఇంటి  […]

యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షునిగా బోడిగె శ్రీకాంత్

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో భాగంగా జమ్మికుంట మండల అధ్యక్షునిగా 21 మంది పోటీ చేయగా ఆ ఫలితాలను యువజన కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ డిసెంబరు 4 బుధవారం సాయంత్రం విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో 870 మెజారిటీ ఓట్లతో జమ్మికుంట పట్టణానికి చెందిన బుడిగె శ్రీకాంత్ హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండల అధ్యక్షునిగా గెలుపొందడం జరిగింది.ఈ సందర్బంగా యువజన కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్షులు బుడిగె శ్రీకాంత్ మీడియా ప్రతినిధులతో […]

పోగొట్టుకున్న 50 సెల్ ఫోన్లు స్వాధీనం

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజురాబాద్ డివిజన్ పరిధిలో గత కొంతకాలంగా సెల్ ఫోన్ పోగొట్టుకొని పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం  సాంకేతిక పరిజ్ఞానాన్ని (CEIR portal) ఉపయోగించి సుమారు 50  ఫోన్లు కనిపెట్టి బుధవారం హుజురాబాద్ ఏసీపీ  కార్యాలయంలో ఫోన్లు తిరిగి బాధితులందరికీఅందజేశారు.ఈ సందర్భంగా హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జీ మాట్లాడుతూ సెల్ ఫోన్ పోయిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని అన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయకుంటే దొంగిలించిన ఫోన్లతో అసాంఘిక కార్యక్రమాలు చేపట్టే ఆస్కారం ఉంటుందని అన్నారు. […]

వెన్కేపల్లిలో దివ్యాంగులకు ఉచిత బస్ పాస్ పంపిణీ

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలం వెన్కేపల్లి గ్రామపంచాయితీ కార్యాలయంలో మంగళవారం రోజున మ్యాకల రాజు  ఆధ్వర్యంలో ముఖ్యఅతిథిగా వచ్చిన హుజురాబాద్ డిఎమ్ చేతులమీదుగా దివ్యాంగులకి ఉచిత బస్ పాస్లు పంపిణీ చేశారు.ముఖ్యఅతిథిగా వచ్చిన హుజురాబాద్ డిఎమ్ కు శాలువాతో సన్మానించారు. అనంతరం హుజూరాబాద్ డిపో మేనేజర్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ దివ్యాంగులు ఆర్టీసీ ఉచిత బస్ పాస్లు వినియోగించుకోవాలి.ఆర్టీసి బస్సులో ప్రయాణం సురక్షితం అని,ఆర్టీసీ బస్సులో ప్రయాణించడం వల్ల తక్కువ ఖర్చుతో ప్రయాణం చేయవచ్చునని,ట్రాఫిక్ సమస్యను  నియంత్రించడం,పర్యావరణం  కాలుష్యం తగ్గుతుందని […]