లెదర్ పార్కులపై గత బిఆర్ఎస్ ప్రభుత్వం చిన్నచూపు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: గత పదేండ్ల భారత రాష్ట్ర సమితి పాలనలో లెదర్ పార్కులపై చిన్నచూపు చూసిందని పూర్తిగా మాదిగల పట్ల వివక్ష చూపిందని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ మరియు రాష్ట్ర అధ్యక్షులు రేగుంట సునీల్ మాదిగ అన్నారు. ఆదివారంనాడు కరీంనగర్ జిల్లా జమ్మికుంట లెదర్ పార్కు ను సందర్శించిన సందర్భంగా స్థానిక లెదర్ పార్కు కమిటి నాయకులతో కలసి వారు మీడియా తో మాట్లాడారు.కేసీఆర్ పాలనలో వెనుకబడిన మాదిగలు కాంగ్రెస్ […]
పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: అర్హులైన ప్రతి పేదవాడికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ అన్నారు.హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో లబ్దిదారులకు పది లక్షల విలువ చేసే ఎల్.ఒ.సీ లను,సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రమాదవశాత్తు,వివిధ అనారోగ్య సమస్యలతో చికిత్స పొంది ఆర్థిక భారం భరించలేక ముఖ్యమంత్రి సహాయనిధి కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ భాద్యతగా అండగా ఉంటుందని అన్నారు.సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరు చేసిన సందర్భంగా సీఎం రేవంత్ […]
మాజీ మున్సిపల్ చైర్మన్ విజయ్ కుమార్ సేవలు ఆదర్శప్రాయం

హుజురాబాద్/ధనాధన్: హుజురాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్లూరి విజయకుమార్ (బ్రహ్మచారి) నిస్వార్థ ప్రజా సేవలు ఆదర్శప్రాయమని ప్రజాకవి రచయిత మానవ విలువల పరిరక్షణ సేవ సంస్థ జాతీయ అధ్యక్షులు నాగుల సత్యం గౌడ్ అన్నారు. పట్టణంలోని అవంతి కన్వెన్షన్ హాల్లో ఆదివారం ప్రజాకవి నాగుల సత్యం గౌడ్ ఆధ్వర్యంలో వడ్లూరి విజయ్ కుమార్ 57వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేశారు. అనంతరం మంచి మనసే దేవుడి మందిరం అనే కవిత జ్ఞాపకం అందజేసి, […]
నువ్వు మగాడివి ఐతే..ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహారతీరుపై హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జి వొడితల ప్రణవ్ తీవ్ర ఆగ్రహన్ని వ్యక్తం చేశారు.కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి,మంత్రుల మీద అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని,పార్టీ మారిన ఎమ్మెల్యేల పట్ల మాట్లాడే కౌశిక్ రెడ్డి నిజంగా మొగోడు అయితే హుజురాబాద్ నియోజకవర్గంలో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలిపి చూపించాలని అన్నారు.గత పదేళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం అనేక స్కాంలు చేస్తే,10 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక స్కీములు […]
ప్రశాంత వాతావరణంలో దసరా పండగ జరుపుకోవాలి

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: దసరా పండుగను ప్రశాంత వాతావరణంలో జమ్మికుంట మండల ప్రజలు జరుపుకోవాలని జమ్మికుంట పట్టణ సీఐ వరగంటి రవి ప్రజలకు సూచించారు… శుక్రవారం జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని మోత్కులగూడెంలో గ్రామ పెద్దలు ప్రజల తో సిఐ సమావేశం నిర్వహించి దసరా పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపి ఎలాంటి గొడవలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సిఐ తెలిపారు. ఎవరైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన అనవసరమైన గొడవలకు తెరలేపిన చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని సూచించారు. […]
కాకతీయ విద్యార్థుల అ”పూర్వ” కలయిక

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: సమాజంలో తల్లీ,తండ్రీ,గురువు దైవంతో సమానమని అంతటి గురువులను కలుసుకోవడం సంతోషంగా ఉందని కాకతీయ విద్యార్థులు అభిప్రాయపడ్డారు.జమ్మికుంట పట్టణంలోని స్వాతి ఫంక్షన్ హాల్ లో కాకతీయ విద్యార్థుల 2008-09 సంవత్సరాలకి చెందిన ఆత్మీయ సమ్మేళనం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకతీయ విద్యాసంస్థల అధినేత ఆవిరినేని సుధాకర్ రావు,జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు,పట్టణ సీఐ వరంగంటి రవి హాజరయ్యారు.అనంతరం వారు మాట్లాడుతూ ఏ వ్యక్తికైనా తల్లిదండ్రులు మొదటి గురువులైతే,విద్యను బోధించిన గురువు రెండవ […]
దళిత బందు పై ప్రభుత్వ వైఖరి తెలుపాలె

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజూరాబాద్ నియోజక వర్గంలో దళిత బంధు రెండవ విడత పై అధికార పార్టీ స్పష్టమైన నిర్ణయం తెలియజేయక పోతే రాబోయే రోజుల్లో ధర్మ సమాజ్ పార్టీ రిలే నిరాహారదీక్షలు చేయటం జరుగుతుందిని ధర్మ సమాజ్ పార్టీ నాయకులు తెలిపారు.లబ్ధిదారులకి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి శ్రీకాంత్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నరేష్,హుజురాబాద్ నియోజక వర్గ నాయకులు రాకేష్,రవి కిరణ్,సందీప్,సదానందం, రవితేజ,ప్రేమ్ సాగర్,అభిలాష్,రవికుమార్,రాజు జిల్లా నాయకులూ శ్రీకాంత్,సురేష్ […]
దేవీ నవరాత్రుల్లో ఎనిమిదో రోజు కన్యా పూజ

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట పట్టణంలోని గణేష్ నగర్ లోని 24 వ వార్డు నందు రాజేష్ ఠాకూర్ రాకేష్ ఠాగూర్ ఆధ్వర్యంలో కన్య పూజ చేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ అమ్మవారు ఎనిమిదవ రోజు దుర్గాదేవిగా భక్తులకు దర్శనం ఇస్తారని దుర్గామాత అని తలవగానే మన మదిలో త్రిశూలధారియై దుర్గాష్టమి నాడే 6 నుండి 12 సంవత్సరాల లోపు ఆడపిల్లలకు పూజ చేసి, తాంబూలాలు,కానుకలు ఇస్తారు.దీన్ని కన్యా పూజ అంటారు.బాలికల్లో దుర్గాదేవి కొలువై ఉంటుందని నమ్ముతారు.అందుకే […]
పోస్ట్ ద్వారా సీఎం కి వినతిపత్రం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: హుజరాబాద్ నియోజకవర్గం రెండవ విడత దళిత బంధు నిధులను విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి పోస్ట్ ద్వారా వినతి పత్రం పంపడం జరిగింది.ఈ సందర్భంగా జమ్మికుంట మాజీ జెడ్పిటిసి డాక్టర్.శ్రీరామ్ శ్యామ్ మాట్లాడుతూ గత రాష్ట్ర ప్రభుత్వం హుజురాబాద్ నియోజకవర్గం దళిత బంధు పైలెట్ ప్రాజెక్టును ఏర్పాటు చేయడం జరిగింది.అందులో భాగంగా ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున నిధులను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం […]
నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటా:ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

హుజురాబాద్/ధనాధన్ న్యూస్ సెప్టెంబర్ 25: హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రజల ఏవైనా సమస్యలు వచ్చినప్పుడూ తాను ఎప్పుడు అండగా ఉంటానని, వాటి పరిష్కారానికి పూర్తిస్థాయిలో కృషి చేస్తానని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హామీ ఇచ్చారు. బుధవారం ఆయన అనారోగ్యంతో ఇబ్బందులు ఎదుర్కొన్న బాధిత కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడారు. “నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులుంటే నేరుగా నన్ను సంప్రదించండి. నేను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను. ప్రజల సంక్షేమం కోసం అందుబాటులో ఉండటం నా […]
