ఒలింపియాడ్ లో సత్తా చాటిన శ్రీ కాకతీయ పాఠశాల విద్యార్థులు

హుజురాబాద్, ఏప్రిల్ 08:జాతీయ స్థాయిలో నిర్వహించిన ఇండియన్ నేషనల్ టాలెంట్ సెర్చ్ ఒలింపియాడ్ (ఐ.ఎన్.టి.ఎస్.ఓ) పరీక్షలో హుజురాబాద్ పట్టణంలోని శ్రీ చైతన్య కరికులం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ కాకతీయ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ మాట్ల సందీప్ కుమార్ తెలిపారు. పాఠశాల విద్యార్థులు 315 మంది ఒలంపియాడ్ పరీక్షలు రాయగా 271 మంది విద్యార్థులు జాతీయ స్థాయిలో బహుమతులు పొందారు.జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో పచ్చిమట్ల అనన్య, రెండవ స్థానంలో గూడూరి ఆశిష్ […]
ప్రజా సమస్యల పరిష్కారమే నా ద్యేయం

జమ్మికుంట ఏప్రిల్ 08:కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని ప్రజలందరి సమస్యల పరిష్కారానికి కొట్లాడుతానని స్వతంత్ర ఎంపీ అభ్యర్థి పేరాల మానస అన్నారు.సోమవారం ఆమె జమ్మికుంట పట్టణంలోని ప్రెస్ క్లబ్‌లో నాయకులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు.తాను తొలుత తన సమస్యల పరిష్కారానికి మాత్రమే పోరాటం చేశానని, ఈ క్రమంలో చాలా మంది యువకులు, రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలు తన దృష్టికి పలు సమస్యలు తీసుకొచ్చారని చెప్పారు.తన ఊరిలో మాత్రమే కాకుండా రకరకాల సమస్యలతో చాలా కుటుంబాలు […]
నీళ్లు ఇచ్చేదాక నిన్నొదల రేవంత్ రెడ్డి

హుజురాబాద్ ఏప్రిల్ 06:హుజురాబాద్ నియోజకవర్గంలో రైతులకు మరో తడి నీళ్లు అందించేదాకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వదిలిపెట్టనని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. శనివారం బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ పిలుపుమేరకు హుజరాబాద్ పార్టీ కార్యాలయం వద్ద చేపట్టిన ఒక్కరోజు రైతు దీక్షలో భాగంగా ఆయన మాట్లాడారు. బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ ఆదేశాల మేరకు 118 నియోజకవర్గాలతో పాటు ఈ నియోజకవర్గంలో కూడా రైతులకు ప్రభుత్వం వెంటనే సాగునీరు అందించాలని ఉద్దేశంతో దీక్ష చేపట్టామన్నారు. ఈ […]
ఛలో తుక్కుగూడ సభ కి కదిలిన కాంగ్రెస్ శ్రేణులు

జమ్మికుంట ఏప్రిల్ 06:జమ్మికుంట మండలం నుండి చలో తుక్కుగూడ లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన జాతీయ మేనిఫెస్టో విడుదల సభకు హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వొడితల ప్రణవ్ బాబు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు.ఈ కార్యక్రమంలో వీరవేని పరుశురాం, పర్లపల్లి నాగరాజు,రాచపల్లి సమ్మయ్య,సలిగంటి సతీష్,రాచపల్లి సాగర్, రాచపల్లి శ్రీనివాస్, నాగినేని రాజేశ్వర్ రావు,తాల్ల శ్రావణ్, కరట్లపల్లి శ్రీనివాస్,ఎరబాటి రమేష్ దోగ్గల భాస్కర్,రాచపల్లి శేఖర్, కొలుగురి సాయి,రాచపల్లి వంశీ,రాచపల్లి […]
పెద్దంపల్లిలో శ్రీ పోతరాజు సహిత శ్రీ పోచమ్మ,నాగమ్మ దేవతల ప్రతిష్టాపన మహోత్సవ వేడుకలు

జమ్మికుంట ఏప్రిల్ 05:జమ్మికుంట మండల పరిధిలోని పెద్దంపల్లి గ్రామంలో శ్రీ పోతరాజు సహిత శ్రీ పోచమ్మ ,నాగమ్మ దేవతల విగ్రహ ప్రతిష్ట మహోత్సవ వేడుక అంగరంగ వైభవంగా మొదలైంది.పెద్దంపల్లి గ్రామంలో శుక్రవారం రోజు తెల్లవారుజామున వినాయక హోమం తో మొదలై ఆదివారం వనభోజనాలతో ఈ ప్రతిష్టాపన పూర్తవుతుందని అర్చకులు తెలిపారు.ఈ కార్యక్రమానికి జమ్మికుంట మండలం ఎంపీపీ దొడ్డే మమత,పెద్దంపల్లి సర్పంచ్ ఇల్లందుల అన్నపూర్ణ,వార్డ్ నెంబర్లు,గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
జగ్గయ్యపల్లిలో చిరుతల రామాయణం ప్రదర్శన ప్రారంభం

జమ్మికుంట ఏప్రిల్ 04:మానవ సంబంధాలను గుర్తు చేసేదే చిరుతల రామాయణమని జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వరరావు అన్నారు.బుధవారం జమ్మికుంట మండలంలోని జగ్గయ్యపల్లి గ్రామంలో శ్రీ చిరుతల రామాయణ నాటక ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వరరావు,జగ్గయ్యపల్లి మాజీ సర్పంచ్ వంశీధర్ రావు,రామాయణ కళా గురువు కరీంనగర్ జిల్లా సాంస్కృతిక సంస్థల సమైక్య ఉపాధ్యక్షుడు బోళ్ళ కొమురయ్య,శంకరపట్నం మండల అధ్యక్షుడు పడాల సత్యనారాయణ చేతుల మీదుగా జ్యోతి […]
సులోచనాదేవి దంపతులు శేషజీవితం హాయిగా గడపాలి

జమ్మికుంట మార్చ్ 31:జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పొత్కపల్లి టీచర్ చదువు సులోచనాదేవి ఉద్యోగ విరమణ అభినందన సన్మాన సభ ఆదివారం జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా జరిగింది. జెడ్పీహెచ్ఎస్ పొత్కపల్లి ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు,పాఠశాల యాజమాన్య కమిటీ, హెచ్ఎంలు,స్టూడెంట్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు విద్యార్థులు,పుర ప్రముఖులు,రాజకీయ నాయకులు,విద్యార్థినీ విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ 37 ఏండ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో ఎంతో మంది విద్యార్థినీ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన […]
ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ సహజం

హుజురాబాద్ మార్చ్ 31:హుజురాబాద్ ప్రధాన తపాల కార్యాలయంలో పోస్ట్ మేన్ గా విధులు నిర్వర్తిస్తున్న ముంజాల సంపత్ పదవి విరమణ కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పదవి విరమణ చేసిన సంపత్,రమాదేవి దంపతులను బంధువులు, సహచర ఉద్యోగులు పూల మాలలు,శాలువాలతో ఘనంగా సన్మానించారు.హుజురాబాద్ హెడ్ పోస్ట్ మాస్టర్ ఊకంటి మహేందర్ మాట్లాడుతూ పోస్టల్ కార్యాలయంలో సంపత్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారని తెలిపారు. ప్రజలతో మమేకమై తన ఉద్యోగ ధర్మాన్ని నిర్వహిస్తూ మంచి పేరు […]
జగ్గయ్యపల్లిలో ఘనంగా పోచమ్మ బోనాలు

జమ్మికుంట మార్చ్ 31:చిరుతల రామాయణం తెలంగాణా ప్రాంతంలో చాలా వ్వాప్తిలో ఉంది.ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో చిరుతల రామాయణం అతి ప్రాచీన కళారూపం.పల్లెల్లోని యువకులు,కళా అభిమానులు కలిసి ఒక గురువును నియమించుకుని చిరుతల రామాయణాన్ని నేర్చుకుంటారు.అలాంటి కళారూపాన్ని జమ్మికుంట మండల పరిధిలోని జగ్గయ్యపల్లి గ్రామములో ఏప్రిల్ మూడవ తారీఖు నుండి ఏడవ తారీఖు వరకు ప్రదర్శిస్తున్నట్లు రామాయణ కళాకారులు తెలిపారు.రామాయణ కళాకారుడు,కరీంనగర్ జిల్లా సాంస్కృతిక సంస్థల సమైక్య జిల్లా ఉపాధ్యక్షుడు బోల్ల కొమురయ్య,శంకరపట్నం మండల అధ్యక్షుడు పడాల సత్యనారాయణ […]
కాంగ్రెస్ లో చేరిన మున్సిపల్ వైస్ చైర్మన్

జమ్మికుంట మార్చ్ 30:జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దేశిని స్వప్న-కోటి, ఆయన వర్గీయులు శనివారం హైదరాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్, హుజురాబాద్ నియోజక ఇంచార్జ్ వొడితల ప్రణవ్ ల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.దేశిని స్వప్న-కోటి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. తాను 1995నుండి కాంగ్రెస్ పార్టీ కార్య కర్తగా పని చేశానని,ఎన్ ఎస్ యూఐ మండల అధ్యక్షుడిగా, కాంగ్రెస్ […]
