పొన్నంకు బండి భయం పట్టుకుంది

వీణవంక(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 22:వీణవంక మండలంలోని పలు గ్రామాల్లో బిజెపి జిల్లా,మండల నాయకులు పర్యటించి రాబోయే ఎన్నికల్లో బండి సంజయ్ కుమార్ గెలుపు కోసం చేయవలసిన పనుల గురించి గ్రామ నాయకులకు,కార్యకర్తలకు పలు సూచనలు చేయడం జరిగింది.అనంతరం బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి, కరీంనగర్ పార్లమెంటు కు బండి సంజయ్ ఏమీ అభివృద్ధి చేయలేదని పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను బిజెపి నాయకులు తీవ్రంగా ఖండించారు.తెలంగాణ […]

శ్రీ సీతారాముల కళ్యాణం..కనులవిందు

పట్టు సమర్పిస్తున్న కలెక్టర్ పమేలా సత్పతి. జమ్మికుంట(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 17:అపర భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం గురువారం కమనీయం రమణీయంగా జరిగింది.సీతా రామచంద్రస్వామి ఉత్సవమూర్తులను పట్టు వస్త్రాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి మేళ తాళాల మధ్య వేదపండితుల వేదమంత్రోచరణ మధ్య ఎదుర్కోళ్ల కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.రాష్ట్ర ప్రభుత్వం తరఫున కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి దంపతులు, హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జి పట్టు వస్త్రాలను ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. […]

హస్తం గూటికి మరో బిఆర్ఎస్ కౌన్సిలర్

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 16:హుజురాబాద్ లో గులాబీ పార్టీ నుండి మెల్లమెల్లగా ఒక్కొక్క లీడర్ జారుకుంటుంన్నారు.ఇప్పటికే పలువురు అధికారం లో ఉన్న నాయకులు బిఆర్ఎస్ పార్టీ ని వీడి కాంగ్రెస్ లో చేరగా,తాజా గా జమ్మికుంట పట్టణానికి చెందిన కౌన్సిలర్ శ్రీపతి నరేష్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.హైదరాబాద్ లో హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి ఓడితల ప్రణవ్ బాబు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీ లోని ఆహ్వానించారు.ఈ సందర్బంగా శ్రీపతి నరేష్ మాట్లాడుతూ తన చేరికకు సహకరించిన మంత్రి పొన్నం […]

స్పందన అనాధాశ్రమంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని స్థానిక పోలీస్ వారి సహకారంతో సామాజిక కార్యకర్త,  అంబాల రజనీకాంత్ ఆధ్వర్యంలో,ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత మహనీయుడు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు జరిపించడం జరిగింది ఈ సందర్భంగా   స్పందన పిల్లల అనాధాశ్రమంలో పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి పిల్లలందరికీ  నోట్ బుక్కులు,పెన్నులు ఫ్రూట్స్ పంపిణీ చేసి పిల్లలకు అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని తను పేద బడుగు బలహీన వర్గాలకు చేసిన తన త్యాగాన్ని గుర్తు చేస్తూ పిల్లలు […]

బండి సంజయ్ మంత్రి  పొన్నం కాలిగోటి కూడా సరిపోడు

కరీంనగర్(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 14:బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలకాలంలో ప్రజా వ్యతిరేక విధానాలు,తెలంగాణ రాష్ట్రానికి చేసిన అన్యాయం,కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలలు మరియు విభజన చట్టంలో ఆమలు కాని హామీలపై ఆదివారంనాడు కరీంనగర్ లో బీసీ మరియు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేపట్టిన నిరసనదీక్షలో హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ పాల్గొన్నారు.ఈ సంధర్బంగా అయన మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి నియోజకవర్గంలో ఉండక, ఉనికి కోసం పక్క నియోజకవర్గంలో వెళ్లి సినిమా డైలాగులు కొడుతున్నాడు.ముఖ్యమంత్రి […]

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 14:జమ్మికుంట మున్సిపాలిటీ పరిధి 16వ వార్డులో వార్డ్ యూత్ అధ్యక్షులు పుల్లూరి ప్రశాంత్ ఆధ్వర్యంలో 133వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి మరియు కేక్ కట్ చేసి ఘనంగా జరిపించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ శీలం శ్రీనివాస్,వెంకటేశ్వర్లపల్లి సర్పంచ్ బోయిని కుమార్,పల్లపు రవి,శనిగరపు రవి,తిరుపతి శ్రీనివాస్,మిడిదొడ్డి శంకర్,రామ్ రాజబాబు,పుల్లూరి శ్యాంమూర్తి,దాసారపు వేణు మరియు వార్డు సభ్యులు రమేష్,రవి,విజయ్,కాజా తన్వీర్,రాజేందర్,శివ సాయి తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్,జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 14:రైల్వే పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఏ ఐ ఆర్ ఆర్ ఎఫ్) జమ్మికుంట బ్రాంచ్ కార్యాలయంలో బ్రాంచ్ అధ్యక్షులు  దాసరి రాజేశ్వర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.ఈ వేడుకల్లో దాసరి రాజేశ్వర్ పూలే మరియు అంబేద్కర్ ఆశయాలను వారి సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో బ్రాంచ్ కార్యదర్శి ఎండి మొయినుద్దీన్,ట్రెజరర్ బి.విద్యాసాగర్,ఎండి ఖాదర్ ఖాన్,టి.వెంకటస్వామి డి.సారంగపాణి కొమురయ్య,దేశరాజు పల్లి రాజయ్య,ఎస్.మల్లేశంలతో పాటు సభ్యులందరూ పాల్గొన్నారు.

క్రమశిక్షణతో జరుపుకునే పండుగ రంజాన్

హుజురాబాద్(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 11:ప్రపంచ దేశాలలో రంజాన్ పండుగను ముస్లిం సోదరులు అత్యంత కఠిన ఉపవాస దీక్షలతో క్రమశిక్షణతో నియమ నిబంధనలను పాటిస్తూ రంజాన్ మాసాన్ని పవిత్ర మాసంగా పరిగణిస్తూ ప్రార్థనలు చేయడం జరుగుతుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్,హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వోడితల ప్రణవ్ అన్నారు.హుజూరాబాద్,జమ్మికుంట పట్టణంలోని  ఈద్గాల వద్ద ముస్లిం సోదరులతో కలిసి రంజాన్ పండుగను పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.అనంతరం ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒకరికొకరు […]

స్పందన అనాధాశ్రమంలో ఘనంగా సామూహిక జన్మదిన వేడుకలు

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 09:జమ్మికుంట మండల కేంద్రంలో 2024 ఉగాది పండుగ పురస్కరించుకొని సామాజిక కార్యకర్త, ఫెర్టిలైజర్ ప్రైవేట్ ఎంప్లాయిస్ యూనియన్ మండల అధ్యక్షుడు అంబాల రజనీకాంత్ ఆధ్వర్యంలో తన మిత్ర బృంద సభ్యులతో కలిసి మంగళవారం స్పందన పిల్లల అనాధాశ్రమంలో అనాధ పిల్లల సామూహిక జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.అనంతరం పిల్లలకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి,ఫ్రూట్స్,బ్రెడ్స్ ప్యాకేట్స్ అందజేశారు.ఈ కార్యక్రమంలో గోపాల్ రావు,తిరుపతి,జూపాక సందీప్,వోల్లలా శ్రీకాంత్,సంపంగి రాకేష్,రాజు,మహంకాళి శివ,దొడ్డె రాజు,మ్యాడగని సురేష్,పులల సురేష్,రాజు,అనిల్,మిడిదొడ్డి సాయిరాం,సాయి,అభి తదితరులు పాల్గొన్నారు

మున్నూరు కాపు యువగర్జన పోస్టర్ ఆవిష్కరణ

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 09:5000 కోట్లతో మున్నూరు కాపు ఆర్థిక కార్పొరేషన్ ప్రకటించాలని మున్నూరు కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి పోనగంటి మల్లయ్య అన్నారు. మంగళవారం స్థానిక మండల కేంద్రంలో మున్నూరు కాపు యువగర్జన పోస్టర్ ను మున్నూరు కాపు జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఏభూషి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా పొన్నగంటి మల్లయ్య,సింగిల్ విండో అధ్యక్షులు పొనగంటి సంపత్,మున్నూరు కాపు సంక్షేమ సంఘం జిల్లా నాయకులు సాయిని రవి,ఆకుల రాజేందర్ లు మాట్లాడారు.ఈ నెల […]