ఘనంగా యుప్ టీవీ అధినేత జన్మదిన వేడుకలు

వీణవంక,ధనాధన్ న్యూస్: వీణవంక మండలకేంద్రంలో యుప్ టీవీ అధినేత పాడి ఉదయ్ నందన్ రెడ్డి జన్మదిన వేడుకలును యాప్ టీవీ ఉద్యోగులు మరియు టూరిటో మహిళా ఉద్యోగులు,వీణవంక గ్రామస్తులు ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఉద్యోగులు మరియు స్థానికులు మాట్లాడుతూ అన్నా అంటే నేనున్నానని ఈ నియోజకవర్గంలోని ఐదు మండలాల పేద ప్రజలకు అండగా ఉంటూ,నిరుపేద విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్న పాడి ఉదయ్ నందన్ రెడ్డి నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో […]
ఘనంగా శ్రీ విశ్వేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని బొమ్మల గుడి శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి దేవాలయంలో శనివారం వేద పండితుల మధ్య మంత్రోచ్ఛారణ మధ్య శ్రీ విశ్వేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం కమనీయం గా వైభవంగా ఆలయ అర్చకులు వేణుగోపాల్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. శనివారం 85 వార్షికోత్సవంలో భాగంగా నిర్వహించిన కళ్యాణ మహోత్సవానికి ఆలయ ట్రస్టిలు కొండూరు కుటుంబ సభ్యులు పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.భక్తులు స్వామి వారి కళ్యాణం మహోత్సవమ్ నేత్రపర్వంగా వీక్షించి మొక్కులు […]
తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు వికాస సమితి జమ్మికుంట మండల అధ్యక్షుడిగా అనిల్ కొలుగూరి

జమ్మికుంట,ధనాధన్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు వికాస సమితి (రి.1251/2016) రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు యర్రమాద కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు జమ్మికుంట మండల అధ్యక్షులుగా కొలుగూరి అనిల్ ను నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణారెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ఆశయాలను ఆదర్శాలను మండల వ్యాప్తంగా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి,చట్టాలపై అవగాహన కల్పిస్తామన్నారు.సమాజంలో జరుగుతున్న అవినీతిని అక్రమాలను వెలికి తీసేందుకు సమాచార హక్కు చట్టం ఒక వజ్రాయుధమని తెలిపారు.(సహవిస) జమ్మికుంట మండల అధ్యక్షుడిగా […]
ఘనంగా లోటస్ పాండ్ పాఠశాల వార్షికోత్సవం

జమ్మికుంట,ధనాధన్ న్యూస్: జమ్మికుంట పట్టణంలోని స్థానిక ఎంపిఆర్ గార్డెన్స్ లో లోటస్ పాండ్ పాఠశాల వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చైర్మన్ డాక్టర్ పుల్లూరి సంపత్ రావు విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి జ్యోతి ప్రజ్వలనం చేసి కార్యక్రమం ప్రారంభించారు.విద్యార్థులను ఉద్దేశించి చైర్మన్ డా.పుల్లూరి సంపత్ రావు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు జీవన నైపుణ్యాలను పెంచుకోవాలని అన్నారు.తల్లితండ్రులు కూడా వారికి ఎన్ని పనులు ఉన్న కొంత సమయాన్ని పిల్లలతో కూడా గడుపుతూ ఉన్నట్లయితే తల్లిదండ్రులపై సమాజంపై […]
బాలవికాస స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు అభినందనీయం

బాల వికాస స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న సమాజ సేవలు అభినందనీయమని హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.జమ్మికుంట పట్టణంలోని నూతన వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో ఆదివారం ఏర్పాటు చేసిన వికాస బాలల పుట్టినరోజు వేడుకల్లో ముఖ్యఅతిథిగా హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ పాల్గొన్నారు.బాల వికాస కోఆర్డినేటర్లు సభ్యులు వొడితల ప్రణవ్ కి పూలు చల్లుతూ బతుకమ్మలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ బాల […]
శివాలయ ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరైన వోడితల ప్రణవ్

వీణవంక,ధనాధన్ న్యూస్: వీణవంక మండలంలోని చల్లూరు గ్రామంలోని శివాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్ శుక్రవారం హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయనకు ఆలయ పూజారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దేవాలయాల విశిష్టత ప్రజలకు తెలిసే విధంగా దేవాలయాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వాల బల కిషన్ […]
సిరిసేడు శివాలయం చైర్మన్ గా కొండ విజయ్ ఏకగ్రీవ ఎన్నిక

ఇల్లందకుంట,ధనాధన్ న్యూస్: ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామనికి చెందిన శ్రీ అపర్ణ సోమేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ గా కొండ విజయ్ ని ఏకగ్రీవంగా శనివారం ఎన్నిక చేస్తూ నియామకపు పత్రాన్ని హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ అందజేశారు. ఈ సందర్భంగా వొడితల ప్రణవ్ మాట్లాడుతూ రానున్న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కాకతీయుల కాలం నాటి పురాతన శివాలయంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహించి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని కమిటీకి సూచించారు.అనంతరం […]
గాయపడిన కార్యకర్తను పరామర్శించిన ఒడితల ప్రణవ్

ఇల్లందకుంట,ధనాధన్ న్యూస్: ఇల్లందకుంట మండలం పాతర్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కోడం శ్రీనివాస్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడగా ఆయనను కాంగ్రెస్ పార్టీ నియజకవర్గ ఇంచార్జీ వొదితల ప్రణవ్ శనివారం పరామర్శించారు.ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి గురించి వారి కుటంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఇళ్ళందకుంట మండల అధ్యక్షుడు ఇంగిలే రామారావు,యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి తిప్పారపు సంపత్,యూత్ కాంగ్రెస్ నాయకుడు చల్లూరి రాహుల్,సీనియర్ నాయకులు పెద్ది కుమార్,వంగ రామకృష్ణ,పరమేశ్వర్,సామల రాజిరెడ్డి,అన్నం […]
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

జమ్మికుంట,ధనాధన్ న్యూస్: జమ్మికుంట పట్టణ సీఐ గా వరగంటి రవి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.గతంలో రామగుండం ట్రాఫిక్ సీఐగా,అదేవిధంగా కరీంనగర్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో వరగంటి రవి విధులు నిర్వహించి జమ్మికుంట సీఐగా బదిలీపై వచ్చారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని సీఐ తెలిపారు.పట్టణంలో ట్రాఫిక్ తో పాటు చిన్న చిన్న సమస్యలు ఉన్నట్టు తమ దృష్టికి వచ్చిందని త్వరలోనే వాటిని పరిష్కరిస్తామని ఆయన అన్నారు.ప్రజలకు […]
ప్రమాదవశాత్తు తాటిచెట్టు పై నుండి జారీ గీత కార్మికునికి గాయాలు

జమ్మికుంట,ధనాధన్ న్యూస్: నిరుపేద కుటుంబానికి చెందిన బాలసాని శ్రీనివాస్ అనే గీత కార్మికుడు తాటి చెట్టు పై నుండి జారీ పడిన ఘటన జమ్మికుంట మండలం పెద్ధంపల్లి లో చోటు చేసుకుంది.వివరాలలోకి వెళితే రంగమ్మపల్లి గ్రామానికి చెందిన బాలసాని శ్రీనివాస్ అనే గీత కార్మికుడు పెద్దంపల్లి తాటి వనంలో తాటి చెట్లు ఎక్కి జీవనం కొనసాగిస్తున్నాడు.ఎప్పటిలాగే తాటి చెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తూ మోకుజారీ తాటి చెట్టుపై నుండి పడి తీవ్ర గాయాలు అయ్యాయి.అక్కడే ఉన్న తోటి గీత […]
