మున్సిపల్ సర్వసభ్య సమావేశ ఎజెండా లో అవినీతి

మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశంలో ప్రవేశ పెట్టిన ఎజండ ప్రజల కోసం అభివృద్ది కోసం ఉపయోగ పడేలా లేదని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఆరోపిస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సర్వసభ్య సమావేశం 12 గంటలకు వుందని సమాచారం అందించి ఆ తరువాత 11 గంటలకు సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు మున్సిపల్ అధికారులు మళ్ళీ సమాచారం అందించారని తెలిపారు.ఈ సమాచారం తో 11:30 కు మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ గదిలోకి వెళ్ళగానే […]

దళితబందు రెండవ విడత ఎప్పుడు ఇస్తారో జిల్లా మంత్రి ప్రకటన చేయాలి

హుజురాబాద్ నియోజకవర్గం లోని పైలెట్ ప్రాజెక్టు అయినటువంటి దళితబందును రెండవ విడతను ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు పూర్తిస్థాయిలో మంజూరు చేస్తుందో జిల్లా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ ఒక ప్రకటన ద్వారా తెలపాలని హుజురాబాద్ నియోజకవర్గ దళితబందు సాధన సమితి సభ్యులు విజ్ఞప్తి చేశారు.గత బి అర్ ఎస్ ప్రభుత్వం దళితబందు పూర్తిస్థాయిలో మంజూరు చేయడంలో విఫలం అయిందని రెండవ విడత కోసం 18 నెలలుగా ఎదురు చూస్తున్న దళితులకు అన్యాయం చేశారని,ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అయిన […]

దళిత బందు ఇచ్చేది పక్కా కాంగ్రెస్ ప్రభుత్వమే

హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలో “దళిత బంధు” రెండో విడత అమలును ఆపింది అప్పటి బీఆర్ఎస్ సర్కార్,అప్పటి ఎమ్మెల్సీ,ప్రస్తుత ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. గురువారం జమ్మికుంట పట్టణంలోని  ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాతకాల అనిల్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ “దళిత బందు” సాధన కమిటీ నాయకుల ప్రకటనల వల్ల దళిత బంద్ లబ్ధిదారులు అయోమయానికి గురవుతున్నారని,కాంగ్రెస్ ప్రభుత్వంను బద్నామ్ […]

మా వెనుక ఎవరూ లేరు

జమ్మికుంట దళిత బంధు సాధన కమిటీ నాయకులు జమ్మికుంట ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళిత బంధు లబ్ధిదారులైన తాము రెండో విడత దళిత బంధు సాధనకై ప్రజావాణిలో కలెక్టర్ కు దరఖాస్తు చేసుకునేందుకు వెళ్లగా అక్కడి నాయకులు తప్పుడు సమాచారం ఇచ్చి తమను అక్రమంగా అరెస్టు చేసి కనీసం మహిళలు,వృద్ధులు అని కూడా చూడకుండా సిటిఎస్ కు తరలించారు.తమకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని కానీ స్థానిక […]

జమ్మికుంటలో మాదిగ హక్కుల దండోరా ఆవిర్భావ వేడుకలు

జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని గాంధీ చౌరస్తాలో మాదిగ హక్కుల దండోరా (ఎం హెచ్ డి) సంస్థ ఆవిర్భావన జరిగి మూడు వసంతాలు పూర్తి చేసుకుని నాలుగవ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఎం.హెచ్.డి హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి దొడ్డే రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో జమ్మికుంట గాంధీ చౌరస్తాలో ఎంహెచ్ డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాలేశ్వరం సాల్మన్ మాదిగ చేతులమీదుగా జెండా ఎగరవేయడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదిగలకు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో స్థానం కల్పించాలని పెద్దపల్లి ఎంపీ […]

గుడ్ న్యూస్ పాస్టర్స్ అసోసియేషన్ నూతన కమిటీ నియామకం

జమ్మికుంట,ధనాధన్ న్యూస్: గుడ్ న్యూస్ పాస్టర్స్ అసోసియేషన్ అధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు.జమ్మికుంట మండలం అధ్యక్షునిగా వడ్లూరి ఏ పప్రా,కార్యదర్శిగా కలకోట స్టీఫెన్ రాజ్,ట్రెజరర్ కలకోట సత్యరాజు లను ఎన్నుకున్నారు.అదేవిధంగా ముఖ్య సలహాదారునిగా తాల్లపల్లి జాషువా,వైస్ ప్రెసిడెంట్ కె ప్రభాకర్,జాయింట్ సెక్రెటరీ ఎం మోజెస్,కమిటీ సభ్యులు సిహెచ్ రాజు,రవీందర్ పాలు,యెహోషువ ను ఎన్నుకున్నారు.ఈ సందర్బంగా నూతన కమిటీ మాట్లాడుతూ క్రైస్తవ సోదరులకు ఇలాంటి ఆపద వచ్చినా అండగా నూతన కమిటీ ఉంటదని తెలిపారు.ఇటీవల క్రైస్తవులు అణిచివేతకు గురవుతున్నారని […]

సాంస్కృతిక శాఖ మండల కమిటీ ఎన్నిక

జమ్మికుంట,ధనాధన్ న్యూస్: కళలను ప్రోత్సహించడమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కళలను వెలికితీస్తూ కళాకారులుగా తయారు చేయడమే సాంస్కృతిక సంస్థల ముఖ్య ఉద్దేశమని జమ్మికుంట సాంస్కృతిక సమాఖ్య సంస్థ మండల అధ్యక్షుడు వేముల అశోక్ తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు వైఎస్ శర్మ ఆదేశాల మేరకు,హుజురాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు తాండ్ర శంకర్ సూచనలతో జమ్మికుంట మండల కమిటీని సోమవారం ఎన్నుకున్నారు.ఉపాద్యక్ష, ప్రధాన కార్యదర్శి గా జమ్మికుంట మండలం జగ్గయ్యపల్లి గ్రామానికి చెందిన మొలుగూరి సుమలత,కొలుగూరి రజిత ను […]

ఇచ్చిన మాట నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ

హుజురాబాద్,ధనాధన్ న్యూస్: ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానం మేరకు ఆరు గ్యారంటిల్లో ప్రతీ హామీని నేరవేరుస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లోపే 4 గ్యారంటీలను అమలు పరుస్తున్నమని ఇది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి కి నిదర్శనమని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకర్గ ఇంఛార్జి ప్రణవ్ అన్నారు.రేపటి నుండి మరో రెండు పథకాలను ప్రవేశపెడుతున్నామని సామాన్య ప్రజలకు ఉపయోగపడే ఈ పథకాలను తెలంగాణ ప్రజలు,హుజురాబాద్ నియోజక వర్గ ప్రజలు సద్వినియోగపరుచుకోవాలనీ కోరారు.ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలలోపే రెండు స్కీములను […]

జమ్మికుంట లో ఉచిత మెగా వైద్య శిబిరం

జమ్మికుంట పట్టణంలోని ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా క్యాంప్ నిర్వహించడం జరిగింది.ఈ క్యాంపులో 140 మంది రోగులు వారికి ఉన్న అనారోగ్య సమస్యలను చూపించుకున్నారు.వీరికి ఉచిత రక్త పరీక్షలు-మూత్ర పరీక్షలు మరియు గుండె పరీక్ష (ఈసీజీ) చేసి సీనియర్ డాక్టర్లు ఆకుల శ్రీనివాస్(జనరల్ ఫిజీషియన్),కార్తీక్ రెడ్డి (సర్జన్) లచే పేషెంట్లకు ఉన్న రోగ నిరోధకతను గుర్తించి వారికి సలహాలు మరియు సూచనలు చెప్పి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో […]

అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు

జమ్మికుంట,ధనాధన్ న్యూస్: జమ్మికుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల నుండి అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జమ్మికుంట పట్టణ సిఐ వరగంటి రవి ఒక ప్రకటనలో తెలిపారు.ఈరోజు జమ్మికుంట మండలంలోని విలాసాగర్ గ్రామానికి చెందిన పలువురు ఇసుక ట్రాక్టర్ యజమానులను పోలీస్ స్టేషన్ కు పిలిపించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ అక్రమంగా ఇసుక తరలిస్తూ అడ్డుకుంటున్న పోలీస్ సిబ్బంది విధులకు ఆటంకం కలిగించిన విలాసాగర్ గ్రామానికి […]