ప్రజా ప్రతిభ క్యాలెండర్ ఆవిష్కరణ

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజురాబాద్ పట్టణంలో ప్రజా ప్రతిభ క్యాలెండర్‌ను హుజురాబాద్ ఆర్.సి రిపోర్టర్ ఇప్పకాయల సాగర్ ఆధ్వర్యంలో ఘనంగా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో హుజురాబాద్ టౌన్ సిఐ టీ.కరుణాకర్, మున్సిపల్ కమిషనర్ కె.సారపు సమ్మయ్య ముఖ్య అతిథులుగా పాల్గొని క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పత్రికా విలేకరులు ప్రభుత్వానికి,ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తూ, ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల శ్రేయస్సు దిశగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత వహించాలని పేర్కొన్నారు.అలాగే ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్యపరుస్తూ సమాజంలో పత్రికలు కీలక పాత్ర […]

ఘనంగా వీకేఎస్పీ జమ్మికుంట వాసవి క్లబ్ ప్రమాణ స్వీకారం మహోత్సవం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వికేఎస్పి జమ్మికుంట క్లబ్ కు 2026 సంవత్సరానికి అధ్యక్షులుగా గుండా రాజేంద్రప్రసాద్, ప్రధాన కార్యదర్శి చందా సంతోష్, కోశాధికారి  చిదురాల పూర్ణచందర్, ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగాలుగా సిరిపురం రాజేష్, గవర్నర్ పుల్లూరి బాలమోహన్, ఎల్లంకి ప్రదీప్,లతోపాటు వైస్ గవర్నర్ తంగళ్ళపల్లి రాజభాస్కర్, రివిజన్ చైర్ పర్సన్ రామిడి శ్రీనివాస్, జోన్ చైర్ పర్సన్ అయితు రమేష్, వాసవి క్లబ్ అధికారులు కె […]

బోగస్ ఓట్లను తొలగించాలి

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: మ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో అక్రమంగా నమోదైన బోగస్ ఓట్లను వెంటనే తొలగించాలని కోరుతూ యూత్ కాంగ్రెస్ నాయకులు అధికారులకు వినతి పత్రం సమర్పించారు. జమ్మికుంట తహసీల్దార్ వెంకట్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఆయాజ్‌లను కలిసి ఓటరు జాబితాలోని అక్రమాలపై ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బుడిగె శ్రీకాంత్, జిల్లా కార్యదర్శి సజ్జు మాట్లాడుతూ, కొందరు రాజకీయ నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం మున్సిపాలిటీతో సంబంధం లేని వ్యక్తుల […]

రంగాపూర్ కల్వరి చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

హుజురాబాద్,ధనాధన్ న్యూస్:మండల పరిధిలోని రంగాపూర్ కల్వరి టెంపుల్‌లో క్రీస్తు జన్మదిన వేడుకలు బుధవారం అత్యంత వైభవంగా జరిగాయి. చర్చి ఫాదర్ రెవరెండ్ డాక్టర్ పి.ఆర్. నెల్సన్ పర్యవేక్షణలో జరిగిన ఈ సంబరాల్లో నియోజకవర్గ నలుమూలల నుంచి క్రైస్తవ సోదరులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తులు నూతన వస్త్రాలు ధరించి చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.సందడిగా సాంస్కృతిక ప్రదర్శనలు:ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. ముఖ్యంగా […]

అధికారుల వైఖరికి నిరసనగా అంబేద్కర్ కు వినతిపత్రం

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: విద్యాశాఖ అధికారుల తీరుకు నిరసనగా హుజరాబాద్ పట్టణంలో గల అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసినట్లు ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ తెలంగాణ రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ మెంబర్ కొలుగూరి సూర్య కిరణ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజూరాబాద్ మండల విద్యాధికారి పై విద్యాశాఖలో పలుమార్లు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోకపోవడంలో గల ఆంతర్యం ఏమిటో తెలియడం లేదని హుజరాబాద్ మండలం లో ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య […]

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పెద్దపీట వేస్తుంది

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలమైన పునాదనీ,కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఇస్తుందని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.శుక్రవారం రోజున కరీంనగర్ పట్టణంలోని ఇందిరా భవన్ లో నూతనంగా కరీంనగర్ జిల్లా అధ్యక్షుడుగా ఎన్నికైన చొప్పదండి శాసన సభ్యుడు మేడిపల్లి సత్యం ప్రమాణస్వీకార కార్యక్రమం కార్యకర్తల కోలాహలల మధ్య ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్,ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్,మానకొండూర్ ఎమ్మెల్యే […]

జమ్మికుంటలో రికార్డింగ్ స్టూడియో ప్రారంభం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్:జమ్మికుంట మండల కేంద్రంలో శ్రావణ్ రికార్డింగ్ స్టూడియో ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ప్రొప్రైటర్ పుల్లా శ్రీలత మీడియాతో మాట్లాడుతూ జమ్మికుంట పట్టణ, పరిసరాల ప్రాంత ప్రజల సౌకర్యార్థం అట్టహాసంగా, అత్యంత నూతన పరికరాలతో నేడు జమ్మికుంట బస్టాండ్ ఆవరణలో శ్రావణ్ రికార్డింగ్ స్టూడియో ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ ప్రాంత ప్రజలు ఇకపై రికార్డింగ్ కొరకు దూర ప్రాంతాలకు వెళ్ళవలసిన అవసరం లేదని, అత్యంత మెరుగైన పరికరాలతో రికార్డింగ్ స్టూడియో ను అందుబాటులోకి తీసుకోవచ్చామని […]

హుజురాబాద్ ఎంఈఓ కమిషనర్ అండ్ డైరెక్టర్ కు ఫిర్యాదు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజూరాబాద్ మండల విద్యాధికారి పై కమిషనర్ మరియు సంచాలకులు పాఠశాల విద్య తెలంగాణ కి ఫిర్యాదు చేసినట్లు ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ తెలంగాణ రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ మెంబర్ కొలుగూరి సూర్య కిరణ్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరుసగా విద్యాశాఖ ఉన్నతాధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ సదరు మండల విద్యాధికారి మరియు గోపాల్ రెడ్డి అనే ఉపాధ్యాయుడు పై చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందని అన్నారు. అధికార దుర్వినియోగం జరిగింది […]

కొత్తపల్లిలో మార్మోగిన అయ్యప్ప శరణు ఘోష

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలోని కొత్తపల్లి గ్రామం నిన్న (మంగళవారం) ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయింది. స్థానిక నాగేంద్ర స్వామి దేవాలయ ప్రాంగణంలో పోరెడ్డి రవీందర్ రెడ్డి తన 18వ పడి సందర్భంగా మహా దివ్య పడిపూజ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం అయ్యప్ప స్వామి శరణు ఘోషతో ఆ ప్రాంతమంతా మారు మ్రోగింది. పండితుల మంత్రోచ్ఛారణల మధ్యమోతే తిరుపతి గురుస్వామి, కే వెంకట్రావు, కన్నన్ దురై రాజ్ గురు స్వాముల ఆధ్వర్యంలో […]

దళిత బంధు నిధులపై వివక్ష ఏంది!

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: దళిత బంధు పథకం రెండో విడత నిధులు మంజూరు చేయడంలో జరుగుతున్న జాప్యం, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై జమ్మికుంట మండలంలోని దళిత లబ్ధిదారులు, దళిత బంధు పోరాట సమితి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిధులు అందనందున, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయవద్దని దళితులకు విజ్ఞప్తి చేస్తూ తమ సమితి సభ్యులు మండలంలోని దళితవాడల్లో ప్రచారం చేయనున్నట్లు పోరాట సమితి సభ్యుడు కోడెపాక రక్షిత్ ఒక ప్రకటనలో తెలిపారు. నాయకుడిపై కోపాన్ని […]