అదనపు కట్నం కోసం వేధింపులు.. నలుగురిపై కేసు నమోదు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్ మే 10: అదనపు కట్నం తీసుకురావాలని కోడలిని వేధించిన భర్తతో పాటు అత్తమామలు, బంధువులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మడిపల్లి గ్రామానికి చెందిన ఇగ్గేటి అనూష (26)కు గత ఏడాది ఉల్లంపల్లి గ్రామానికి చెందిన బుల్లి అజయ్‌కుమార్‌తో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. వివాహ సమయంలో వధువు కుటుంబ సభ్యులు ఎకరం భూమి, రూ.8 లక్షల నగదు, ఇతర లాంఛనాలతో ఘనంగా పెళ్లి జరిపించినట్లు తెలిపారు. పెళ్లి […]
తెలంగాణ జన సమితి పార్టీ 4వ ప్లీనరీ విజయవంతం చేయండి

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: తెలంగాణ జన సమితి (TJS) పార్టీ 4వ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేయాలని ఆ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరికిల్ల స్రవంతి పిలుపునిచ్చారు. ఆదివారం జమ్మికుంట పట్టణంలో ప్లీనరీకి సంబంధించిన వాల్ పోస్టర్‌ను టీజేఎస్ పార్టీ జమ్మికుంట మండల అధ్యక్షుడు పల్లెర్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆమె ఆవిష్కరించారు.ఈ సందర్భంగా అరికిల్ల స్రవంతి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో నిత్యం పోరాడుతున్న ఏకైక […]
కరీంనగర్‌లో శాంతిభద్రతలపై డీజీపీకి బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు

కరీంనగర్/ధనాధన్ న్యూస్: కరీంనగర్‌లో రోజురోజుకీ దిగజారుతున్న శాంతిభద్రతల పరిస్థితిపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద, కల్వకుంట్ల సంజయ్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్‌తో పాటు ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, దాసోజు శ్రవణ్ కలిసి కలసి వినతిపత్రం సమర్పించారు.ఇటీవల కరీంనగర్ నగరంలో వరుసగా జరుగుతున్న జ్యూవెలరీ షాపుల దొంగతనాలు, ప్రజలపై దాడులు, […]
తెలంగాణ జన సమితి పార్టీ 4వ ప్లీనరీ విజయవంతం చేయండి

హుజురాబాద్/ధనాధన్ న్యూస్ మే 02: తెలంగాణ జన సమితి (TJS) పార్టీ 4వ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముక్కెర రాజు పిలుపునిచ్చారు. శనివారం హుజురాబాద్ పట్టణంలో ప్లీనరీకి సంబంధించిన వాల్ పోస్టర్‌ను పార్టీ నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ముక్కెర రాజు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో నిత్యం పోరాడుతున్న ఏకైక పార్టీ తెలంగాణ జన సమితి అని […]
హుజురాబాద్ డివిజన్‌లో చీటింగ్ కేసులపై సీపీ సమీక్ష

కరీంనగర్/ధనాధన్ న్యూస్, ఏప్రిల్ 29:కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం బుధవారం హుజురాబాద్ ఏసీపీ కార్యాలయంలో డివిజన్ స్థాయి పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న నేరాల విచారణ తీరును సమగ్రంగా పరిశీలించారు. ముఖ్యంగా చీటింగ్ (మోసం) మరియు ఫోర్జరీ కేసులపై ప్రత్యేక దృష్టి సారించిన సీపీ, అమాయక ప్రజలను మోసం చేసే నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కేసులను […]
ఘనంగా తెలంగాణ జన సమితి 8వ ఆవిర్భావ వేడుకలు

కరీంనగర్/ధనాధన్ న్యూస్ ఏప్రిల్ 29:తెలంగాణ జన సమితి (TJS) పార్టీ 8వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా కేంద్రంలో పార్టీ శ్రేణులు సేవా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాయి.సామాజిక బాధ్యతలో భాగంగా జిల్లా కేంద్రంలోని వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు, మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేసి తమ మానవత్వాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా పార్టీ నాయకులు వృద్ధాశ్రమ నివాసితులతో నేరుగా మాట్లాడి, వారి ఆరోగ్యం మరియు ఇతర అవసరాల గురించి అడిగి తెలుసుకున్నారు. వృద్ధులకు ఎల్లవేళలా అండగా ఉంటామని, వారి […]
కల్వరి టెంపుల్‌లో ఘనంగా ఈస్టర్ వేడుకలు

హుజూరాబాద్/ధనాధన్ న్యూస్: హుజూరాబాద్ మండలంలోని రంగాపూర్ గ్రామంలో ఉన్న కల్వరి టెంపుల్‌లో ఈస్టర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక సంఘ కాపరి పాస్టర్ నెల్సన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ వేడుకలను భక్తిశ్రద్ధలతో జరిపారు.ఈస్టర్ పర్వదినం సందర్భంగా, గుడ్ ఫ్రైడే నాడు యేసు క్రీస్తు శిలువపై మరణించి, ఆదివారం తిరిగి లేచిన దినాన్ని పునరుత్థాన ఈస్టర్‌గా భావిస్తారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ప్రత్యేక ప్రార్థన కార్యక్రమంలో సభాధ్యక్షుడిగా బండ రమేష్ వ్యవహరించి కార్యక్రమాన్ని సమర్థంగా […]
వర్కింగ్ జర్నలిస్టుగా పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలి
జర్నలిస్టులను అరెస్టు చేయడం అన్యాయం

టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కోకన్వీనర్ కే బాపురావు కరీంనగర్/ధనాధన్ న్యూస్:ఎన్టీవీ మీడియాలో ఒక మహిళా ఐఏఎస్ అధికారిపై ప్రసారమైన కథనంపై ఎటువంటి విచారణ చేయకుండా, ముందస్తు నోటీసు ఇవ్వకుండా సిట్ పోలీసులు ఓ ముగ్గురు సీనియర్ జర్నలిస్టులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) తీవ్రంగా ఖండించింది. ఎన్టీవీలో వచ్చిన కథనానికి జర్నలిస్టులు దొంతు రమేశ్, పరిపూర్ణ చారి, సుధీర్ లను బాధ్యులను చేస్తూ ‘సిట్’ పోలీసులు ముందస్తునోటీసులు ఇవ్వకుండా నేరుగా అరెస్టు చేయడం దారుణమని […]
సీనియర్ జర్నలిస్ట్ మండల యాదగిరికి
రాష్ట్రస్థాయి సర్వోత్తమ సేవ పురస్కారం

హుజురాబాద్ /ధనాధన్ న్యూస్:కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ మండల యాదగిరిని రాష్ట్రస్థాయి సర్వోత్తమ సేవ పురస్కారంతో ఘనంగా సత్కరించారు. గత 30 సంవత్సరాలుగా పత్రికా రంగంలో ఆయన అందిస్తున్న నిస్వార్థ, విశిష్ట సేవలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేశారు.మానవ విలువల పరిరక్షణ సేవా సంస్థ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు ప్రజాకవి నాగుల సత్యం గౌడ్ ఆధ్వర్యంలో ఈ పురస్కారాన్ని అందజేశారు. హైదరాబాద్ రవీంద్ర భారతి మెయిన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో పలు […]
