పార్టీ కార్యకర్తలను కాపడుకుంటాం

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామని రాబోయే రోజుల్లో ప్రతి కార్యకర్తకి సముచిత స్థానం కల్పిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పరిశీలకులుగా వచ్చిన నమిండ్ల శ్రీనివాస్,రఘునాథ్ రెడ్డి తెలిపారు.శనివారం రోజున హుజురాబాద్ పట్టణంలోని సాయి రూప గార్డెన్స్ లో హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అధ్యక్షతన నిర్వహించిన పార్టీ నిర్మాణ,సంస్థాగత సమావేశానికి వారు హాజరయ్యారు.అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్,పీసీసీ అధ్యక్షుడు […]

ప్రత్యేక కరాటే శిక్షణ తరగతులు ప్రారంభం

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: గ్లోబల్ షో టో కాన్ కరాటే డో ఇండియా కరీంనగర్ జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో హుజురాబాద్‌లో వేసవి ప్రత్యేక కరాటే శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్కే జలీల్ పర్యవేక్షణలో ఈ తరగతులు స్థానిక న్యూ కాకతీయ మోడల్ స్కూల్‌లో ప్రతిరోజు సాయంత్రం జరుగుతున్నాయి.పాఠశాలలకు వేసవి సెలవులు రావడంతో ఆటల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు కరాటే ఒక చక్కని ప్రత్యామ్నాయమని కరాటే మాస్టర్ జలీల్ అభిప్రాయపడ్డారు. కరాటే నేర్చుకోవడం వల్ల పిల్లలకు ఆరోగ్యం, […]

మూడోసారి మాల సంఘం అధ్యక్షునిగా వేలంగి ప్రేమ్ సాగర్ ఎన్నిక

సైదాపూర్/ధనాధన్ న్యూస్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని సర్వాయిపేట గ్రామంలో మాల సంఘం అధ్యక్షుడిగా వేలంగి ప్రేమ్  సాగర్ మూడవసారి మాల సంఘం అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.మాల సంఘం నాయకులు గ్రామ ప్రజలు సర్వాయిపేట మాల సంఘం అధ్యక్షునిగా ఎన్నికైన వేలంగి ప్రేమ్ సాగర్ కు ఘనంగా శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం వేలంగి ప్రేమ్ సాగర్ మాట్లాడుతూ మూడవసారి సర్వాయిపేట మాల సంఘం అధ్యక్షునిగా కొనసాగింపు పట్ల సహకరించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని ప్రతిక్షణం ప్రతి […]

పేదవారి కడుపునింపేలా కాంగ్రెస్ పాలన

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా గ్రామ గ్రామాన ప్రజల నుంచి ఊహించని స్పందన కనబడుతుందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.సోమవారం రోజున హుజురాబాద్ పట్టణ పరిధిలోని 13వ వార్డు ఇందిరానగర్ లోని రేషన్ కార్డు లబ్ధిదారుడు పోతుల శ్రీవాణి-శ్రీనివాస్ ఇంటికి భోజనానికి ఆహ్వానించగా వారి ఇంటికి ప్రణవ్ వెళ్ళారు.ప్రణవ్ రాకతో ఆ కుటుంబం సంతోషాన్ని వ్యక్తం చేశారు.ఇన్నేళ్లుగా తమ ఇంటికి ఎ రాజకీయ […]

శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం ఏర్పాట్లు పూర్తి

కరీంనగర్/ధనాధన్ న్యూస్ ఏప్రిల్ 05:కరీంనగర్ టౌన్ జ్యోతి నగర్ శ్రీ సంతోషి మాత పంచముఖ వినాయక శ్రీ హనుమాన్ దేవాలయ ఆవరణలో అంగరంగ వైభవంగా జరగబోయే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మంచినీరు పులిహోర ప్రసాద వితరణ పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశామని ఈవో శ్రీనివాస్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు చవిటి రామశర్మ, అర్చకులు రాంపల్లి రాజేశ్వర శర్మ, కార్తీక్ శర్మ, హనుమాన్ భక్తులు కోడిపల్లి కృష్ణ కృష్ణ స్వామి […]

అనాధ పిల్లలతో ఉగాది వేడుకలు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజురాబాద్ పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త ప్రముఖ వ్యాపారి వర్ధినేని రవీందర్ రావు- లక్ష్మీ దంపతులు ఆదివారం ఉగాది వేడుకలను జమ్మికుంటలోని స్పందన అనాధ శరణాలయంలో ఉగాది వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా రవీందర్ రావు లక్ష్మీ దపతులు సుమారు 30 మంది అనాధ పిల్లలకు బట్టలు అందజేసి పండ్లు పంపిణీ చేశారు. తెలుగు నూతన సంవత్సరం సందర్భంగా అనాధ పిల్లలకు మధ్య ఉగాది వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తల్లి తండ్రి […]

షాపింగ్ కాంప్లెక్స్ వేలం వాయిదా

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట మండలంలోని కోరపల్లి గ్రామంలో  నిర్వహించిన  గ్రామపంచాయతీ షాపింగ్ కాంప్లెక్స్ వేలం వాయిదా పడినట్లు పంచాయతీ కార్యదర్శి కే తారకరామారావు తెలిపారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దారించిన ధర రాకపోవడంతో ఈ నెల 29న 12:00 గంటలకు మళ్ళీ వేలం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.వేలంలో కొత్తగా పాల్గొనదలిచిన వారు ఈ నెల 29న ఉదయం 10: 00 గంటల వరకు రూ. 5000 చిన్న షెటర్ గాను 10000 పెద్ద షెటర్ గాను డిపాజిట్ చెల్లించాలని […]

జమ్మికుంట మండల బీఎస్పీ పార్టీ అధ్యక్షునిగా దాసారపు మహేందర్

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: బహుజన్ సమాజ్ పార్టీ జమ్మికుంట మండల అధ్యక్షులు గా తనుగుల గ్రామానికి చెందిన దాసరపు మహేందర్ ఎన్నికయ్యారు.బీఎస్పీ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు మంద సమ్మయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మహేందర్ ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జోనల్ కోఆర్డినేటర్ మారేపల్లి మొగిలయ్య,జిల్లా ఉపాధ్యక్షులు పల్లె ప్రశాంత్ గౌడ్,జిల్లా కార్యవర్గ సభ్యుడు ఈదునూరి రమేష్,అసెంబ్లీ ఉపాధ్యక్షుడు పెరుక శ్రీనివాస్,అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి మంతెన సంపత్,కార్యదర్శి రేణిగుంట్ల రంజిత్,కోశాధికారి రాచపల్లి […]

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: వరల్డ్ యాంటీ స్మోకింగ్ డే సందర్భంగా జమ్మికుంట పట్టణ సిఐ వరగంటి రవి మీడియాతో మాట్లాడుతూ సిగరెట్ తాగే అలవాటు వల్ల అనేక ప్రాణాంతకమైన వ్యాధుల పాలు అయ్యే  అవకాశం ఉన్నందున వాటికి దూరంగా ఉండాలని ముఖ్యంగా యువత సిగరెట్లకు,మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. స్నేహితులతో సరదాగా ప్రారంభమై వ్యసనంగా మారి జీవితాలను నాశనం అయ్యే స్థితికి మత్తు పదార్థాలు చేరుస్తాయని కాబట్టి వాటికి దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పిల్లల ప్రవర్తన పట్ల […]

ఎస్సీ వర్గీకరణ పూర్తి అయ్యేవరకు గ్రూప్స్ ఫలితాలను నిలుపుదల చేయాలి

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: గ్రూపు1, గ్రూప్ 2, గ్రూప్3లతో పాటు అన్ని రకాల ఫలితాలు నిలుపుదల చేయాలని బేడ బుడగ జంగం_ జన సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ అతి త్వరలో పూర్తి చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి ఒకవైపు చర్యలు చేపడుతున్నట్లు ప్రకటిస్తూనే మరోవైపు ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తికాక ముందే నేడు గ్రూప్1 ఫలితాలు ప్రకటించడం, అదేవిధంగా ఈనెల 11న గ్రూప్ 2, 14న గ్రూప్ 3 అదేవిధంగా […]