నువ్వు మొగోడివి అయితే.. రాజీనామా చేసి మళ్ళీ గెలువు

ఫైల్ ఫోటో హుజురాబాద్/ధనాధన్ న్యూస్: జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పై బిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన దాడిని ఖండిస్తున్నట్లు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ అన్నారు.వారు మాట్లాడుతూ పదేళ్లపాటు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటి చిల్లర పనులు ఏరోజు చేయలేదని పార్టీ ఫిరాయింపులపై గగ్గోలు పెట్టే ఎమ్మెల్యే తను ఏ పార్టీ నుంచి ఫిరాయించి బిఆర్ఎస్ లో చేరాడో తెలుసుకోవాలని సూచించారు.సంవత్సరం గడుస్తున్నా కౌశిక్ రెడ్డికి అధికారం మదం […]
ఎమ్మెల్యే పై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: సహాచర జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రవర్తించిన తీరు హేయమైన చర్య అని హుజురాబాద్ కాంగ్రెస్ శ్రేణులు అన్నారు.ఈ మేరకు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఆదేశాల మేరకు స్థానిక పోలీస్ స్టేషన్ లో అతనిపై ఫిర్యాదు చేశారు.కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రులు,ఎమ్మెల్యేల పట్ల కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు,వాడిన పదజాలం సరిగా లేదని ప్రజా సమస్యల పట్ల […]
మా గ్రామాన్ని పట్టించుకోండి మంత్రి గారు

సైదాపూర్/ధనాధన్ న్యూస్: పాలకులు మారినా…ప్రభుత్వాలు మారినా…ప్రజల ఇబ్బందులు తప్పడం లేదు…కొత్త గ్రామపంచాయతీగా ఆవిర్భవించిన గర్రెపల్లి గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యము లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యంతో పాటు గ్రామంలో రేషన్ షాపు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దోకిడి తిరుపతి అన్నారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ…హుస్నాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విషయంపై ప్రత్యేకమైన […]
ప్రజాకవి నాగుల సత్యం గౌడ్ కు భారత్ వరల్డ్ రికార్డు అవార్డు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజరాబాద్ పట్టణానికి చెందిన మానవ విలువల పరిరక్షణ సేవ సంస్థ జాతీయ అధ్యక్షులు, వ్యక్తిత్వ వికాస నిపుణులు, ఇంటర్నేషనల్ భారత్ ప్రతిభ రత్న అవార్డు గ్రహీత, ప్రజాకవి, రచయిత సామాజికవేత్త డాక్టర్ నాగుల సత్యం గౌడ్ భారత్ వరల్డ్ రికార్డ్ అవార్డు అందుకున్నారు. అంతర్జాతీయ భారత్ వరల్డ్ రికార్డు కమిటీ సత్యం గౌడ్ సామాజిక, ఆధ్యాత్మిక సేవలను సేవలను గుర్తించి, చతుష్టి కలలు, సంక్రాంతి సంబరాలు, గణతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా ప్రపంచ భారత్ […]
ఊరుగొండ లో లక్ష్మీనర్సింహస్వామి జాతర మహోత్సవం

దామెర/ధనాధన్ న్యూస్: దామెర మండలం ఊరుగొండ లక్ష్మీనర్సింహస్వామి అధ్యయన కల్యాణ మహోత్సవాలు ఈ నెల 7 నుంచి జరుగనున్నాయి.స్వామి వారి కల్యాణ బ్రహ్మోత్సవాలను నిర్వాహకులు 12 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు.ఈ క్రమంలో జనవరి 7 నుంచి 18 వరకు 12 రోజుల పాటు నిర్వహించనున్న అధ్యయన కల్యాణ మహోత్సవాలకు చుట్టు పక్కల గ్రామాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకోనున్నారు.స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు హైదరాబాద్, […]
విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ల పంపిణి

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజురాబాద్ కు చెందిన గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ వారు హుజురాబాద్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్( బాలికలు ) లో చదువుతున్న 140 మంది విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ లను ట్రస్టు నిర్వాహకులు గంగిశెట్టి జగదీశ్వర్ (రిటైర్డ్ టీచర్) పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బోరగాల తిరుమల చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా ఈశ్వర్ రెడ్డి మాట్లాడుతూ 13 సంవత్సరముల నుండి గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్టు ద్వారా ట్రస్టు నిర్వాహకులు […]
ఇక అంగన్వాడీలోనూ యూనిఫామ్

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: అంగన్‌వాడీ స్కూళ్లలోనూ ఇక నుంచి యూనిఫామ్ ఉండనుంది.ప్రీ ప్రైమరీ స్కూళ్లలో చిన్నారులకు యూనిఫామ్ అందించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా ఈ ఏడాది నుంచే అమల్లోకి రానుంది. ఒక్కో విద్యార్థికి జత చొప్పున పంపిణీ చేయనుండగా.. ఇప్పటికే క్లాత్ జిల్లాకు చేరుకుంది. వచ్చే నెల మొదటి వారంలో యూనిఫామ్ పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లల్లో చదువుతున్న విద్యార్థులకు సర్కారు ఉచితంగా రెండు జతల యూనిఫామ్ అందిస్తున్నది. ఇందులో భాగంగా జిల్లాలో […]
సైబర్ క్రైమ్ నేరాల పట్ల అవగాహన

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: సైబర్ క్రైమ్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని,బండి మీద వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ ఆంక్షలను పాటించాలని జమ్మికుంట ఎస్సై ఆరోగ్యం తెలిపారు.జమ్మికుంట మండల పరిధిలోని జగ్గయ్యపల్లి గ్రామములో సాయంత్రం సైబర్ క్రైమ్ మోసాల పట్ల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.నేను సైతం కార్యక్రమంలో సోలార్ సీసీ కెమెరాల పట్ల ప్రజల మరింత బాధ్యతగా ముందుకు వెళ్లాలని,దాతలు సహకరించాలని,మంచి కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ పోలీసు అధికారులు జలీల్,సోని,బ్లూ కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆటోల బంద్ విజయవంతం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట మండల పరిధిలోని స్థానిక బస్టాండ్ ఏరియా,కొత్తపల్లి మడిపల్లి చౌరస్తా వద్ద శనివారం రోజున,రాష్ట్రవ్యాప్తంగా ఆటోల బందుకు పిలుపునిచ్చిన యూనియన్ సంఘాలు నేడు రాష్ట్రవ్యాప్తంగా ఆటోలను బందు చేస్తూ నిరసనలు వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టి నేటితో సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆటో కార్మికులు జీవనోపాధి తీవ్రంగా దెబ్బతిన్నదని,ఈ పథకం వలన ఆటో కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని రాష్ట్రవ్యాప్తంగా మహాలక్ష్మి […]
ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలను ఆకస్మిక తనిఖీలు చేసిన ప్రణవ్

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: గతంలో కంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ పాఠశాలలో అన్నిరకాల సౌకర్యాలు చేపడుతున్నామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ అన్నారు.శనివారం నాడు హుజురాబాద్ నియోజకవర్గంలోని వీణవంక,సైదాపూర్ మండలాల పరిధిలోగల ఎంజెపిబిటి బాలుర పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీలు చేశారు.అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి వసతులపై ఆరాతీసి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు.గతానికంటే భిన్నంగా విద్యార్థుల డైట్ విషయంలో అనేక రకాల చర్యలు […]
