సైబర్ క్రైమ్ నేరాల పట్ల అవగాహన

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: సైబర్ క్రైమ్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని,బండి మీద వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ ఆంక్షలను పాటించాలని జమ్మికుంట ఎస్సై ఆరోగ్యం తెలిపారు.జమ్మికుంట మండల పరిధిలోని జగ్గయ్యపల్లి గ్రామములో సాయంత్రం సైబర్ క్రైమ్ మోసాల పట్ల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.నేను సైతం కార్యక్రమంలో సోలార్ సీసీ కెమెరాల పట్ల ప్రజల మరింత బాధ్యతగా ముందుకు వెళ్లాలని,దాతలు సహకరించాలని,మంచి కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ పోలీసు అధికారులు జలీల్,సోని,బ్లూ కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

సైదాపూర్ ఎస్ఐగా సిహెచ్ తిరుపతి నియామకం

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండల ఎస్ఐగా సి.హెచ్ తిరుపతిని నియమించినట్లు కరీంనగర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అభిషేక్ మహంతి ఉత్తర్వులు జారి చేశారు.గతంలో సైదాపూర్ ఎస్సై గా విధులు నిర్వహించిన జన్ను ఆరోగ్యంని జమ్మికుంట ఎస్ఐగా బదిలీ చేయగా కరీంనగర్ వీఆర్ లో ఉన్న సిహెచ్ తిరుపతి సైదాపూర్ ఎస్ఐగా నియమించినట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

అగ్ని ప్రమాద చిరు వ్యాపారులకు పోలీసుల చేయూత

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: నిన్న రాత్రి హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తా ఎదురుగా పాపారావు బొందలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆర్థికంగా నష్టపోయిన చిరు వ్యాపారులకు హుజురాబాద్ పోలీసులు అండగా నిలిచారు.హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జి మంగళవారం సాయంత్రం తన కార్యాలయం వద్ద రేక్కాడితే గానీ డొక్కాడని 10 మంది అగ్ని ప్రమాద బాధితులను గుర్తించి ఒక్కొక్కరికి తక్షణ సహాయంగా రూ.3000 చొప్పున 30,000 నగదును పదిమందికి అందజేశారు.అగ్ని ప్రమాదం సంభవించి చిరు వ్యాపారుల జీవనోపాధి లేకుండా చేయడం అత్యంత […]

ఘనంగా తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలు

సైదాపూర్ (ధనాధన్ న్యూస్ )జూన్ 02:సైదాపూర్ మండల కేంద్రంలో హుస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర రవాణ&బీసీ సంక్షేమశాఖ  పొన్నం ప్రభాకర్  ఆదేశాల మేరకు ఘనంగా  తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలు  ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నేటితో పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో సైదాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు  దొంత సుధాకర్  ఆధ్వర్యంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మొదటి అవతరణ దినోత్సవం కావడంతో ఈ […]

అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు

జమ్మికుంట,ధనాధన్ న్యూస్: జమ్మికుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల నుండి అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జమ్మికుంట పట్టణ సిఐ వరగంటి రవి ఒక ప్రకటనలో తెలిపారు.ఈరోజు జమ్మికుంట మండలంలోని విలాసాగర్ గ్రామానికి చెందిన పలువురు ఇసుక ట్రాక్టర్ యజమానులను పోలీస్ స్టేషన్ కు పిలిపించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ అక్రమంగా ఇసుక తరలిస్తూ అడ్డుకుంటున్న పోలీస్ సిబ్బంది విధులకు ఆటంకం కలిగించిన విలాసాగర్ గ్రామానికి […]

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

జమ్మికుంట,ధనాధన్ న్యూస్: జమ్మికుంట పట్టణ సీఐ గా వరగంటి రవి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.గతంలో రామగుండం ట్రాఫిక్ సీఐగా,అదేవిధంగా కరీంనగర్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో వరగంటి రవి విధులు నిర్వహించి జమ్మికుంట సీఐగా బదిలీపై వచ్చారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని సీఐ తెలిపారు.పట్టణంలో ట్రాఫిక్ తో పాటు చిన్న చిన్న సమస్యలు ఉన్నట్టు తమ దృష్టికి వచ్చిందని త్వరలోనే వాటిని పరిష్కరిస్తామని  ఆయన అన్నారు.ప్రజలకు […]