ఎండదెబ్బతో గొర్రెల కాపరి మృతి

సైదాపూర్/ధనాధన్ న్యూస్ జూన్ 5: మండలంలోని పెర్కపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు ఎండదెబ్బ తగిలి మృతి చెందిన ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పిల్లి శ్రీశైలం (29) గురువారం ఉదయం గొర్రెలను మేపేందుకు వెళ్లాడు. మధ్యాహ్న సమయంలో తీవ్ర ఎండ ప్రభావంతో తల తిరగడం, వాంతులు, విరేచనాలు అవుతున్నాయని తన తండ్రి పిల్లి తిరుపతికి ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. దీంతో తిరుపతి గ్రామానికి చెందిన […]

క్రికెట్ ఫీవర్..పోలీసుల స్పెషల్ నిఘా..!

హుజూరాబాద్‌/ధనాధన్ న్యూస్,మే 31 :ఈ రోజు జరగనున్న క్రికెట్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా హుజూరాబాద్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఏసీపీ వాసంశెట్టి మాధవి తెలిపారు. మ్యాచ్ నేపథ్యంలో ఎలాంటి బెట్టింగ్ కార్యకలాపాలు, అవాంఛనీయ ఘటనలు, గొడవలు చోటు చేసుకోకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఏసీపీ ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని ప్రధాన కూడళ్లు, ప్రజా రద్దీ ప్రాంతాలు, సున్నిత ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించినట్లు తెలిపారు. […]

దారి దోపిడీ కేసు ఛేదన

జమ్మికుంట/ధనాధన్ న్యూస్ మే 21:కోరపల్లి గ్రామ రహదారిపై ఇటీవల చోటుచేసుకున్న దోపిడీ ఘటనను జమ్మికుంట పోలీసులు వేగంగా ఛేదించి, ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు హుజురాబాద్ ఏసీపీ వి. మాధవి తెలిపారు. గురువారం జమ్మికుంట పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె కేసు వివరాలను వెల్లడించారు.పోలీసుల కథనం ప్రకారం, మే 20వ తేదీ రాత్రి కోరపల్లి గ్రామం వైపు వెళ్తున్న అశోక్ లేలాండ్ వాహనం (టీఎస్ 08 యూడీ 5457)ను 11 మంది […]

అదనపు కట్నం కోసం వేధింపులు.. నలుగురిపై కేసు నమోదు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్ మే 10: అదనపు కట్నం తీసుకురావాలని కోడలిని వేధించిన భర్తతో పాటు అత్తమామలు, బంధువులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మడిపల్లి గ్రామానికి చెందిన ఇగ్గేటి అనూష (26)కు గత ఏడాది ఉల్లంపల్లి గ్రామానికి చెందిన బుల్లి అజయ్‌కుమార్‌తో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. వివాహ సమయంలో వధువు కుటుంబ సభ్యులు ఎకరం భూమి, రూ.8 లక్షల నగదు, ఇతర లాంఛనాలతో ఘనంగా పెళ్లి జరిపించినట్లు తెలిపారు. పెళ్లి […]

వావిలాల గ్రామంలో వ్యక్తి మృతి.. కారణాలపై పోలీసుల విచారణ

వావిలాల: గ్రామానికి చెందిన రాగల సాంబయ్య (55) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.సాంబయ్యకు ఇద్దరు కుమారులు ఉండగా, చిన్న కుమారుడు రాగల వంశీ (26) హైదరాబాద్‌లో స్వంత కారును అద్దెకు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఏడాది క్రితం అతని తల్లి అనారోగ్యంతో మృతి చెందగా, అప్పటి నుంచి సాంబయ్య తన పెద్ద కుమారుడు నాగరాజుతో కలిసి […]

పండుగల వేళ వాట్సాప్ స్కాంల మోత

కరీంనగర్/ధనధన్ న్యూస్: పండుగ వాతావరణం నెలకొన్న సమయంలో వాట్సాప్ ద్వారా స్కాం మెసేజెస్ ఊపందుకుంటున్నాయి.ప్రత్యేకంగా “మీకు ₹5,000 వచ్చాయి”అనే తరహా సందేశాలు ప్రజలను ఆకర్షిస్తున్నాయి.ఈ మెసేజెస్ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల వాట్సాప్ ల్లోనూ విస్తృతంగా ఫార్వర్డ్ అవుతున్నాయి.తెలియని లింక్‌పై క్లిక్ చేస్తే డబ్బు వస్తుందని నమ్మించే ప్రయత్నం జరుగుతోంది.ఇది పూర్తిగా సైబర్ మోసమేనని పోలీసు అధికారులు స్పష్టం చేస్తున్నారు.లింక్ ఓపెన్ చేసిన వెంటనే ఫోన్‌లో హానికర సాఫ్ట్‌వేర్ ప్రవేశిస్తుందని చెబుతున్నారు.దీంతో బ్యాంక్ ఖాతాలు, యూపీఐ యాప్‌లు […]

జమ్మికుంట ఫ్లైఓవర్ వద్ద రోడ్డు ప్రమాదం – దంపతులకు గాయాలు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్,సెప్టెంబర్ 3:జమ్మికుంటలో ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో దంపతులు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే,తనుగుల గ్రామానికి చెందిన బొల్లు మధుకర్ రెడ్డి తన భార్య బొల్లు శ్రీలతతో కలిసి ద్విచక్ర వాహనంపై (AP 15 AY 9284) ఆగస్టు 27న జమ్మికుంటకు వచ్చారు. పని ముగించుకొని తిరిగి తనుగుల గ్రామానికి వెళ్లే క్రమంలో, జమ్మికుంట ఫ్లైఓవర్ వద్దకు చేరుకునే సరికి, వెనుక నుంచి అతివేగంగా నుంచి వచ్చిన కారు (TS 02 […]

జమ్మికుంటలో గణేష్ నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై అధికారుల సూచనలు

జమ్మికుంట,ధనాధన్ న్యూస్ ఆగస్టు 26:రేపటి నుంచి ప్రారంభమయ్యే గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని జమ్మికుంట పట్టణంలో అధికారులు ప్రత్యేక సూచనలు జారీ చేశారు. ఈ రోజు జమ్మికుంట టౌన్ ఇన్స్పెక్టర్ ఎస్. రామకృష్ణ, మండల తహసీల్దార్ (ఎం.ఆర్.వో), మున్సిపాలిటీ సిబ్బంది,ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులు సమావేశమై ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టౌన్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ గణేష్ మండపాల వద్ద విద్యుత్ వైరింగ్‌ను తప్పనిసరిగా లైసెన్స్ పొందిన ఎలక్ట్రీషియన్ ద్వారానే చేయాలని స్పష్టం చేశారు. వైరింగ్‌లో […]