ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

సైదాపూర్(ధనాధన్ న్యూస్)జూన్12:ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని అందుకోసం ప్రభుత్వాలు సకల సౌకర్యాలు అందిస్తున్నట్లు ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి తెలిపారు.విద్యా సంవత్సరం ప్రారంభ రోజును పురస్కరించుకుని మండల కేంద్రంలోని వెన్కెపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో బుధవారం రోజున ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా విద్యార్థులకు స్కూల్ యూనిఫాం లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు ఆది నుండి నేటి […]

బడి బాటకి విస్తృత ప్రచారం

సైదాపూర్(ధనాధన్ న్యూస్)జూన్10:సైదాపూర్ మండల కేంద్రంలోని వెన్కేపల్లి ఉన్నత పాఠశాల ఉపాద్యాయులు మండలంలోని సైదాపూర్,వెన్కేపల్లి,జాగిరిపల్లి,గర్రెపల్లి,ఘనపూర్,బొత్తలపల్లి, రామచంద్రాపూర్,కురుమపల్లి,దుద్దేనపల్లీ గ్రామాలలో ఇంటింటా తిరుగుతూ విద్యార్థులకు, ఉపాధ్యాయులు ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమంలో భాగంగా ఉపాద్యాయులు విస్తృత ప్రచారం చేస్తు అవగాహన కల్పిస్తున్నారు.ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన ఉచిత విద్యతో పాటు, డిజిటల్  విద్యాబోధన,అత్యాధునిక సౌకర్యాలు,ఉచిత పుస్తకాలు,సన్నబియ్యంతో నాణ్యమైన ఉచిత మధ్యాహ్న బిజనంతో పాటు యునిఫాం ఇస్తున్నట్లు ఉపాద్యాయులు చెబుతున్నారు.ఈ విద్యాసంవత్సరం వెన్కేపల్లి పాఠశాలలో 10వ తరగతిలో 100శాతం ఉత్తీర్ణత సాధించినట్లు వివరించారు.మానసిక […]

రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ 100 కోట్లు స్కామ్

హుజురాబాద్(ధనాధన్ న్యూస్)జూన్08:రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రవాణా సంస్థ అధికారులతో కుమ్మక్కై రోజుకు 50 లక్షలు సంపాదిస్తున్నారని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు.శనివారం వే బిల్లు లేకుండా  అధిక లోడ్ రూల్ ప్రకారం 32 టన్నులతో పోవాల్సిన లారీలు 80 టన్నుల లోడ్ తో వెళ్తున్న ఫ్లై యాష్ లారీలను  అడ్డుకున్న సందర్భంగా ఆయన మాట్లాడారు.రోజుకి రెండు మూడు వందల ఫ్లై యాష్ లారీలు రామగుండం ఎన్.టి.పి.సి నుంచి ఖమ్మం వైపు […]

విద్యుత్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా మోతే శ్రీనివాస్ ఎన్నిక

హుజురాబాద్(ధనాధన్ న్యూస్)జూన్07:హుజురాబాద్ పట్టణంలో  1104 విద్యుత్ ఉద్యోగుల సంఘం డివిజన్ స్థాయి ఎన్నికలు శుక్రవారం ఉత్కంఠభరితంగా సాగాయి.విద్యుత్ ఉద్యోగుల సంగం డివిజన్ అధ్యక్షునిగా మోతే శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శి గా డి.శంకర్,వర్కింగ్ ప్రెసిడెంట్ గా మహేశ రవి,అడిషనల్ సెక్రటరీ గా అశ్వంత్ కుమార్ ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా డివిజన్ స్థాయి అధ్యక్షునిగా ఎన్నికైన మోతే శ్రీనివాస్ మాట్లాడుతూ కార్మికుల సమస్యల కోసం నిరంతరం కృషి చేస్తానని, బదిలీ విషయాలలో నిష్పక్షపాతంగా అందరితో చర్చించి సమన్వయంగా కృషి చేస్తానని తెలిపారు. తనను […]

దశాబ్ది ఉత్సవాలకు తరలివెళ్లిన హుజురాబాద్ ఉద్యమకారులు

హుజురాబాద్(ధనాధన్ న్యూస్)జూన్02:తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు నిండిన సందర్భంగా  ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం మేరకు హుజురాబాద్ ప్రాంతానికి చెందిన ఉద్యమకారులు ఆదివారం రోజున అధిక సంఖ్యలో హైదరాబాద్ కు తరలివెళ్లారు.తమ త్యాగాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం ఉద్యమకారులను పట్టించుకోక నిర్లక్ష్యం చేసిందని వారు ఆరోపించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించడం హర్షణీయమని,ఇదే వైఖరిని ప్రభుత్వం కొనసాగిస్తుందని, ఉద్యమకారుల సలహాలు, సూచనలు తీసుకుని తెలంగాణ పునర్నిర్మాణం చేస్తుందని వారు […]

దుద్దెనపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన కమిటీ ఎన్నిక

సైదాపూర్(ధనాధన్ న్యూస్)జూన్02:సైదాపూర్ మండలంలోని దుద్దేనపల్లి గ్రామంలో ఆదివారం రోజున ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ముదిరాజ్ సంఘం నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది.కుల పెద్దమనిషిగా గూళ్ల వెంకటయ్య,ప్రెసిడెంట్ గా నెల్లి శ్రీనివాస్,క్యాషియర్ గా నీల తిరుపతి,వైస్ ప్రెసిడెంట్ గా రొయ్యల శ్రీనివాస్, మెంబర్లు గా బొల్లి సురేష్,గూళ్ల అజయ్,పిట్టల కొమురయ్య,పిట్టల మొండయ్య,పెసరి సమ్మయ్య,నీల సమ్మయ్య లను ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా ప్రెసిడెంట్ శ్రీనివాస్ మాట్లాడుతూ నా పై నమ్మకం ఉంచి నా ఎన్నికకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా […]

ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)జూన్01:హనుమాన్ జన్మదిన పర్వదినాన్ని పురస్కరించుకుని జమ్మికుంట మండల పరిధిలోని జగ్గయ్యపల్లి గ్రామంలో హనుమాన్ మాల ధారణ స్వాములు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయమే స్వామీకి ప్రత్యేక అభిషేకం చేశారు.అనంతరం ప్రత్యేక పూజలు చేశారు.అభిషేకం చేసే సమయంలో రాముని భజన,రామ నామ స్మరణతో భక్తులు తన్మయత్వం పొందారు.జయంతి సందర్భంగా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు ఆలయాన్ని సందర్శించి ప్రత్యెక మొక్కులు చెల్లించుకున్నారు.విరుముడి కట్టుకొని హనుమాన్ మాల ధారణ స్వాములు విరమణకు బయలుదేరారు.అనంతరం మహా […]

ప్రైవేటు విద్యాసంస్థల విద్యా వ్యాపారాన్ని అరికట్టాలి

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)మే30:తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ విద్యాసంస్థలు విద్య వ్యాపారం చేస్తూ ఫీజుల పేరుతో లక్షలాది రూపాయలు దోచుకుంటున్నారని, సిఎం రేవంత్ రెడ్డి రాష్ర్టంలో ప్రైవేట్ విద్యాసంస్థలు చేస్తున్న   ఫీజుల దోపిడీ అరికట్టే విధంగా  చర్యలు తీసుకొని ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలని, ఎన్నికల హామీలో విద్యార్థులకు  ఇచ్చిన హామీలను విద్యాసంవత్సరం ప్రారంభం కాగానే అమలు చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి లద్దునూరి విష్ణు  అన్నారు.ఆయన మాట్లాడుతూ జమ్మికుంట పట్టణ కేంద్రంలో ఉన్న ప్రైవేటు విద్యాసంస్థలను ఆయా […]

తెలంగాణలో ప్రజావ్యతిరేక పాలన సాగుతుంది

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)మే30:జమ్మికుంట పట్టణంలోని జెడ్పిటిసి కార్యాలయంలో పత్రిక సమావేశంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన ప్రజా వ్యతిరేక కొనసాగుతుందని, ఈ సందర్భంగా జమ్మికుంట జడ్పిటిసి డాక్టర్.శ్రీరామ్ శ్యామ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా కాంగ్రెస్ పాలన ప్రజలకు ఎంతగానో మేలు చేసిందని భావించిన తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి పాలన మొండి చేయి చూసిందని వారు గుర్తు చేశారు.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఆరు నెలల గడుస్తున్నప్పటికీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో రూపొందించిన.ఏ ఒక్క అంశం కార్యచరణ […]

గ్రామపంచాయతీ ని సందర్శించిన జిల్లా పంచాయతీ అధికారి

చిత్రంలో జిల్లా పంచాయతీ అధికారి. జమ్మికుంట(ధనాధన్ న్యూస్)మే30:జమ్మికుంట మండలంలోని విలాసాగర్ గ్రామపంచాయతీ కార్యాలయం తో పాటు గ్రామపంచాయతీ చేసిన అభివృద్ధి పనులను జిల్లా పంచాయతీ అధికారి ఏ రవీందర్ గురువారం సందర్శించారు. గురువారం స్థానిక ఎంపీవో సతీష్ కుమార్ విలాసాగర్ గ్రామపంచాయతీ కార్యదర్శి మనోహర్ రెడ్డి తో కలిసి గ్రామంలో ఏర్పాటుచేసిన పల్లె ప్రకృతి వనం,కంపోస్టు షెడ్,వైకుంఠ ధామం,నర్సరీ, క్రీడా ప్రాంగణాల ను జిల్లా పంచాయతీ అధికారి తనిఖీ చేశారు. గ్రామపంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన వివిధ […]