జర్నలిస్టుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)మే29:జమ్మికుంట పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ హుజరాబాద్ డివిజన్ కమిటీ అధ్యక్షులు సౌడమల్ల యోహాన్ అధ్యక్షతన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షులు తిరుపతిరెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా అధ్యక్షులు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారి యొక్క ముఖ్య డిమాండ్ అయిన హెల్త్ కార్డు,నివేషణ స్థలాలు,రైల్వే పాసులను పునరుద్దించలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.ఫోర్త్ స్టేట్ అని చెప్పుకునే జర్నలిస్టులకే రక్షణ లేకుండా పోతుందని ప్రజలకు ప్రభుత్వానికి […]
ఇల్లందకుంట రామాలయానికి వెలిచాల విరాళం

ఇల్లందకుంట(ధనాధన్ న్యూస్)మే28:కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలకేంద్రంలోని రామాలయానికి కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు విరాళం ప్రకటించారు. అపర భద్రాద్రిగా పేరు గాంచిన సీతారామచంద్రస్వామి దేవస్థాన అభివృద్ధికి కాంగ్రెస్ నాయకుడు వెలిచాల రూ.2 లక్షల నగదును మంగళవారం అందజేశారు.
ప్రభుత్వ భూమి కబ్జా పై జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)మే27:జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ధర్మారంలోని సర్వే నెం. 368 కుంట శిఖం భూమి 0-33 గుంటలు కబ్జాదారుల బారి నుండి కాపాడాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి జమ్మికుంట మున్సిపాలిటీ 1వ వార్డు కౌన్సిలర్ బొంగోని వీరన్న ఫిర్యాదు చేశారు.ధర్మారం గ్రామంలోని సర్వే నెం 368 లో 0-33 గుంటల కుంట శిఖం భుమి ఉండగా మధ్యలో నుండి 1965లో ఆర్&బి రోడ్డు జమ్మికుంట నుండి వావిలాల వరకు పోయింది.అప్పటి నుండి ఆ కుంట ఖాళీగా […]
ఖబర్దార్ కేటీఆర్

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)మే25:మొన్న డిసెంబర్ లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కేటీఆర్ కు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినప్పటికీ ఇంకా అహం తగ్గలేదని, వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల స్థానానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సామాన్యుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి అసామాన్యుడిగా ఎదిగిన తీన్మార్ మల్లన్నను చూసి ఓర్వలేక ” మీకు బిట్స్ పిలానీ కావాలా.. పల్లి బఠాణి కావాలా..! అంటూ మల్లన్నను ఉద్దేశించి హేళన చేస్తూ మాట్లాడిన కేటీఆర్ ఒళ్ళు […]
భూ ఆక్రమణలపై కలెక్టర్ కు పిర్యాదు

సైదాపూర్(ధనాధన్ న్యూస్)మే25:సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామ శివారులోని ప్రభుత్వ భూమిని మాజీ సర్పంచ్ తన కుటుంబ సభ్యుల పేరున అక్రమ పట్టా చేసి ఆక్రమించుకున్నాడని గ్రామ ప్రజలు జిల్లా కలెక్టర్ కి పిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే గ్రామ శివారు లోని మసీదు దగ్గర భూమిని పూర్వం అంబేద్కర్ భవనం,ప్రాథమిక పశువుల వైద్యశాలకు కేటాయించిన భూమిని ఇందిరా సుధీర్ కుమార్ గౌడ్ సర్పంచ్ పదవిలో కొనసాగుతూ తన రాజకీయ పలుకుబడి ఉపయోగించి సర్వేనెంబర్ 399/ఆ లో సుమారు […]
నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దు

హుజురాబాద్(ధనాధన్ న్యూస్)మే24:వర్షాకాలం వస్తుండడంతో రైతులు దుక్కి దున్ని పంట సాగుచేయడానికి విత్తనాలు ఎప్పుడు వస్తాయా పంట ఎప్పుడు వేయాలా అని ఎదురుచూస్తూ ఉంటారని,రైతుల అవసరాన్ని ఆసరా చేసుకునే కొందరు నకిలీ విత్తనాలు రైతులకు అమ్మి సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తారని రైతులు జాగ్రత్తగా ఉండాలని హుజురాబాద్ ఏసీపీ శ్రీనివాస్ జీ తెలిపారు.హుజురాబాద్ లోని ఏసీపీ కార్యాలయం లో డివిజన్ లోని పోలీస్ అధికారులతో కలిసి జై కిసాన్ పోస్టర్ ని ఆవిష్కరించారు.ఈ సందర్బంగా ఏసీపీ శ్రీనివాస్ జీ […]
ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు

సైదాపూర్(ధనాధన్ న్యూస్)మే21:సైదాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నవ భారత నిర్మాత నవ యువతకు స్ఫూర్తి మాజీ ప్రధాని,భారత రత్న స్వర్గీయులు రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర రవాణ, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు సైదాపూర్ మండల కేంద్రంలో కొత్త బస్ స్టేషన్ అవరణలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొంత సుధాకర్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చిత్ర పటానికి పూల మల వేసి ఘన నివాళి అర్పించడం […]
అకాల వర్షాలకు నష్ట పోయిన రైతులను ఆదుకోవాలి

కరీంనగర్(ధనాధన్ న్యూస్)మే18:గత రెండు రోజుల నుండి రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యం కారణంగా అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఏఐకేఎస్ జిల్లా కార్యదర్శి పైడిపల్లి రాజు ఒక ప్రకటనలో శనివారం ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా పైడిపల్లి రాజు మాట్లాడుతూ మార్కెట్ కల్లాలలో,ఐకెపి కేంద్రాలలో ఉన్న ధాన్యం పూర్తిగా తడిసి పోయిందని, పండ్ల తోటలు మామిడి,సపోటా బొప్పాయి తదితర కాయలు ఈదురు గాలులకు నేలమట్టమై తీవ్ర నష్టం వాటిలిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం […]
ప్రమాదంలో గాయపడిన వారికి సహాయచర్యలు అందించిన ప్రణవ్

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)మే13:జమ్మికుంట మండలం తనుగుల గ్రామంలో ని మూల మలుపు వద్ద చెట్టును కారు ఢీ కొట్టిన ఘటన లో భార్యభర్తలకు తీవ్రగాయాలయ్యాయి.వరంగల్ నుండి కాల్వశ్రీరాంపూర్ మండలం బేగంపేటకు గ్రామానికి ఓటు వేయడానికి వెళుతున్న శ్రీనివాస్-రమ దంపతుల కారు తనుగుల గ్రామంలోని మూలమలుపు వద్ద చెట్టుని డీకొట్టింది.కారు లో ప్రయాణిస్తున్న భార్యభర్తలతో పాటు చిన్న పాప కి గాయాలయ్యాయి.ఆ సమయం లో వావిలాల నుండి పోలింగ్ కేంద్రాలను పరిశీలించి వస్తున్న హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వోడితల […]
ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

వీణవంక(ధనాధన్ న్యూస్)మే13:పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా సోమవారం హుజురాబాద్ నియోజకవర్గం లోని సొంత గ్రామం వీణవంక లోని ప్రభుత్వ పాఠశాలలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, భార్య శాలిని తోపాటు కుటుంబ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కౌశిక్ రెడ్డి తల్లిదండ్రులు సాయినాథరెడ్డి,శైలజ సోదరుడు కార్తీక్ రెడ్డి ,సంతోషిని దంపతులు ఓటు వేశారు. అనంతరం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును […]
