ఆదివాసి ఎరుకల కులస్తులకు అండగా ఉంటాం

వరంగల్/ధనాధన్ న్యూస్: బిఆర్ఎస్ పార్టీ రజతోఉత్సవ సభ పరిశీలన సందర్భంగా వరంగల్ మీదుగా ఎలుకతుర్తికి వచ్చిన కే కవితక్కని తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు మరియు ఉమ్మడి వరంగల్ జిల్లా తరఫున ఆదివాసి ఎరుకల సమస్యల పరిష్కరించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు  ( నాంచారమ్మ )  ఎరుకల బుట్టను ఇచ్చి  స్వాగతం  పలికారు.కవితక్క  ఆదివాసి ఎరుకల జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ గత కేసీఆర్ […]

బిఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రజలు స్వచ్ఛందంగా లక్షలాదిగా తరలి రావాలి

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: బిఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రజలు గ్రామ గ్రామాల నుంచి స్వచ్ఛందంగా లక్షలాదిగా తరలి రావాలనీ బిఆర్ఎస్ కొత్తపల్లి మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు, సీనియర్ నాయకుడు ఆకుల రవీందర్ పటేల్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ రజతోత్సవ సభ కానీ విని ఎరుగని రీతిలో జరగనుందని రవీందర్ పటేల్ తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈనెల 27న జరగనున్న ఎల్కతుర్తి బిఆర్ఎస్ రజతోత్సవ సభలో కెసిఆర్ మాటల కోసం అన్ని వర్గాల ప్రజలంతా […]

శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం ఏర్పాట్లు పూర్తి

కరీంనగర్/ధనాధన్ న్యూస్ ఏప్రిల్ 05:కరీంనగర్ టౌన్ జ్యోతి నగర్ శ్రీ సంతోషి మాత పంచముఖ వినాయక శ్రీ హనుమాన్ దేవాలయ ఆవరణలో అంగరంగ వైభవంగా జరగబోయే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మంచినీరు పులిహోర ప్రసాద వితరణ పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశామని ఈవో శ్రీనివాస్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు చవిటి రామశర్మ, అర్చకులు రాంపల్లి రాజేశ్వర శర్మ, కార్తీక్ శర్మ, హనుమాన్ భక్తులు కోడిపల్లి కృష్ణ కృష్ణ స్వామి […]

అనాధ పిల్లలతో ఉగాది వేడుకలు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజురాబాద్ పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త ప్రముఖ వ్యాపారి వర్ధినేని రవీందర్ రావు- లక్ష్మీ దంపతులు ఆదివారం ఉగాది వేడుకలను జమ్మికుంటలోని స్పందన అనాధ శరణాలయంలో ఉగాది వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా రవీందర్ రావు లక్ష్మీ దపతులు సుమారు 30 మంది అనాధ పిల్లలకు బట్టలు అందజేసి పండ్లు పంపిణీ చేశారు. తెలుగు నూతన సంవత్సరం సందర్భంగా అనాధ పిల్లలకు మధ్య ఉగాది వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తల్లి తండ్రి […]

ఎస్సీ వర్గీకరణ పూర్తి అయ్యేవరకు గ్రూప్స్ ఫలితాలను నిలుపుదల చేయాలి

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: గ్రూపు1, గ్రూప్ 2, గ్రూప్3లతో పాటు అన్ని రకాల ఫలితాలు నిలుపుదల చేయాలని బేడ బుడగ జంగం_ జన సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ అతి త్వరలో పూర్తి చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి ఒకవైపు చర్యలు చేపడుతున్నట్లు ప్రకటిస్తూనే మరోవైపు ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తికాక ముందే నేడు గ్రూప్1 ఫలితాలు ప్రకటించడం, అదేవిధంగా ఈనెల 11న గ్రూప్ 2, 14న గ్రూప్ 3 అదేవిధంగా […]

ప్రసన్న హరికృష్ణకు మద్దతుగా అభిమానుల విస్తృత ప్రచారం

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రసన్న హరికృష్ణను అట్టభద్రులు సంపూర్ణ మద్దతు ప్రకటించి భారీ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన అభిమానులు సూచించారు. ఈ సందర్భంగా విద్యా వ్యాపారాన్ని చేస్తున్న కొందరికి గుణపాఠం చెప్పాలనే లక్ష్యంతో విద్యావేత్త అయిన ప్రసన్న హరికృష్ణ పోటీ చేస్తున్నందుకు తనకు మద్దతు ఇవ్వాలని పెర్కో న్నారు. ఈ ఎన్నికల వార్ వన్ సైడ్ కావాలని పట్టభద్రులు, మేధావులు, […]

ఘనంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు

సైదాపూర్/ధనాధన్ న్యూస్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలు బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సోమారపు రాజయ్య ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.అనంతరం బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సోమారపు రాజయ్య  మాట్లాడుతూ ఆంధ్ర వలస పాలనలో తెలంగాణ ప్రజలు అరిగోసలు పడుతున్న దృశ్యాన్ని చూసి ప్రత్యేక రాష్ట్రం కోసం ఆహార్నిషలు శ్రమించి […]

సదరం సర్టిఫికెట్ల పాత్రదారులు..సూత్ర దారులపై చర్యలు తీసుకోవాలి

కరీంనగర్/ధనాధన్ న్యూస్: సదరం సర్టిఫికెట్ల అవకతవకలపై సంబంధించిన అధికారులు చర్యలు తీసుకోవాలని మేము చేసే పనులకు మాత్రం ఏ లెక్క లేదు..అన్న చందంగా జిల్లా రూరల్ డెవలప్మెంట్ అథారిటీ (డిఆ ర్డీఏ) అధికారులు సంబంధిత సూపిరింటెండెంట్ వ్యవహరిస్తున్నారని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) జిల్లా ప్రధాన కార్యదర్శి బ్రాహ్మణపల్లి యుగేందర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సదరం సర్టిఫికేట్లలో లక్షల రూపాయల కుంభకోణంపై సిబిసిఐడి విచారణ జరిపించాలని తాము మొదటి నుండి డిమాండ్ చేస్తున్నామన్నారు. […]

మాదిగలకు 11 శాతం రిజర్వేషన్లు కల్పించాలి

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఎమ్మార్పీఎస్ మండల మాజీ అధ్యక్షుడు బత్తుల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మాదిగలకు 11 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఎమ్మార్పీఎస్ మండల మాజీ అధ్యక్షులు బత్తుల లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.15 లక్షల జనాభా ఉన్న మాలలకు 5శాతం రిజర్వేషన్ కల్పించి 33 లక్షల జనాభా ఉన్న మాదిగలకు 9 శాతం రిజర్వేషన్ కల్పించడం సరికాదన్నారు.జనాభా ప్రతిపాదికన మాదిగలకు 11 శాతం  రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గత ఏళ్ల తరబడి ఏ […]

పట్టభద్రులకు,ప్రభుత్వానికి వారధిగా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వూట్కూరి నరేందేర్ రెడ్డి భారీ మెజారిటీతో మండలికి వెళ్లడం ఖాయమని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ అన్నారు.ఆదివారం రోజున హుజురాబాద్ పట్టణంలోని సిటీ సెంట్రల్ కన్వెన్షన్ హాల్ లో జరిగిన ఆత్మీయ సమ్మేళనం సభకు ఆయన ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి తో పాటు హాజరయ్యారు.ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ పట్టభద్రులు ఓటును వృధా చేసుకోవద్దని,ఓటు వేసేటప్పుడు జాగ్రత్తగా […]