కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పెద్దపీట వేస్తుంది

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలమైన పునాదనీ,కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఇస్తుందని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.శుక్రవారం రోజున కరీంనగర్ పట్టణంలోని ఇందిరా భవన్ లో నూతనంగా కరీంనగర్ జిల్లా అధ్యక్షుడుగా ఎన్నికైన చొప్పదండి శాసన సభ్యుడు మేడిపల్లి సత్యం ప్రమాణస్వీకార కార్యక్రమం కార్యకర్తల కోలాహలల మధ్య ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్,ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్,మానకొండూర్ ఎమ్మెల్యే […]

జమ్మికుంటలో రికార్డింగ్ స్టూడియో ప్రారంభం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్:జమ్మికుంట మండల కేంద్రంలో శ్రావణ్ రికార్డింగ్ స్టూడియో ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ప్రొప్రైటర్ పుల్లా శ్రీలత మీడియాతో మాట్లాడుతూ జమ్మికుంట పట్టణ, పరిసరాల ప్రాంత ప్రజల సౌకర్యార్థం అట్టహాసంగా, అత్యంత నూతన పరికరాలతో నేడు జమ్మికుంట బస్టాండ్ ఆవరణలో శ్రావణ్ రికార్డింగ్ స్టూడియో ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ ప్రాంత ప్రజలు ఇకపై రికార్డింగ్ కొరకు దూర ప్రాంతాలకు వెళ్ళవలసిన అవసరం లేదని, అత్యంత మెరుగైన పరికరాలతో రికార్డింగ్ స్టూడియో ను అందుబాటులోకి తీసుకోవచ్చామని […]

హుజురాబాద్ ఎంఈఓ కమిషనర్ అండ్ డైరెక్టర్ కు ఫిర్యాదు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజూరాబాద్ మండల విద్యాధికారి పై కమిషనర్ మరియు సంచాలకులు పాఠశాల విద్య తెలంగాణ కి ఫిర్యాదు చేసినట్లు ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ తెలంగాణ రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ మెంబర్ కొలుగూరి సూర్య కిరణ్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరుసగా విద్యాశాఖ ఉన్నతాధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ సదరు మండల విద్యాధికారి మరియు గోపాల్ రెడ్డి అనే ఉపాధ్యాయుడు పై చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందని అన్నారు. అధికార దుర్వినియోగం జరిగింది […]

ఎన్నికల్లో గెలిపిస్తే కటింగ్-షేవింగ్ ఫ్రీ!

సిద్దిపేట/ధనాధన్ న్యూస్: సిద్దిపేట జిల్లా, దుబ్బాక మండలం, రఘోత్తంపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికలు… ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్! ఏంటీ అంత స్పెషల్ అంటే… ఇక్కడ పోటీ చేస్తున్న ఒక వార్డు సభ్య అభ్యర్థి భర్త ఇచ్చిన హామీ మామూలుగా లేదు. అభివృద్ధి, రోడ్లు, డ్రైనేజీ ఇవన్నీ కామన్. కానీ ఈయన ఇచ్చింది మాత్రం పక్కా “మెస్మరైజింగ్ ఆఫర్”! ఐదేళ్ల పాటు ఫ్రీగా కటింగ్, షేవింగ్!రఘోత్తంపల్లిలో తన భార్య వార్డు సభ్యురాలిగా పోటీ చేస్తుండగా, ఆమె భర్త, […]

కొత్తపల్లిలో మార్మోగిన అయ్యప్ప శరణు ఘోష

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలోని కొత్తపల్లి గ్రామం నిన్న (మంగళవారం) ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయింది. స్థానిక నాగేంద్ర స్వామి దేవాలయ ప్రాంగణంలో పోరెడ్డి రవీందర్ రెడ్డి తన 18వ పడి సందర్భంగా మహా దివ్య పడిపూజ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం అయ్యప్ప స్వామి శరణు ఘోషతో ఆ ప్రాంతమంతా మారు మ్రోగింది. పండితుల మంత్రోచ్ఛారణల మధ్యమోతే తిరుపతి గురుస్వామి, కే వెంకట్రావు, కన్నన్ దురై రాజ్ గురు స్వాముల ఆధ్వర్యంలో […]

దళిత బంధు నిధులపై వివక్ష ఏంది!

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: దళిత బంధు పథకం రెండో విడత నిధులు మంజూరు చేయడంలో జరుగుతున్న జాప్యం, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై జమ్మికుంట మండలంలోని దళిత లబ్ధిదారులు, దళిత బంధు పోరాట సమితి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిధులు అందనందున, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయవద్దని దళితులకు విజ్ఞప్తి చేస్తూ తమ సమితి సభ్యులు మండలంలోని దళితవాడల్లో ప్రచారం చేయనున్నట్లు పోరాట సమితి సభ్యుడు కోడెపాక రక్షిత్ ఒక ప్రకటనలో తెలిపారు. నాయకుడిపై కోపాన్ని […]

ఐబొమ్మపై సీపీఐ నారాయణ సంచలనం

హైదరాబాద్: సీపీఐ సీనియర్ నేత నారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఐబొమ్మ పైరసీ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్, అలాగే మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్ అంశాలపై స్పందిస్తూ ఆయన వ్యవస్థాగత లోపాలను తీవ్రంగా దుయ్యబట్టారు.ఐబొమ్మలో సినిమాలు చూసిన నారాయణఐబొమ్మ వ్యవహారంపై మాట్లాడిన నారాయణ, తాను కూడా ఆ వెబ్‌సైట్‌లో సినిమాలు ఫ్రీగా చూసినట్లు బహిరంగంగా ఒప్పుకున్నారు. “ఆరేడు వందలు పెట్టి సామాన్యులు సినిమాలు ఎలా చూసేది? నేను కూడా ఐబొమ్మలోనే సినిమాలు […]

హుజురాబాద్‌లో ఆధ్యాత్మిక శోభ

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: కరీంనగర్ జిల్లా,హుజురాబాద్ ప్రాంతంలో ఆదివారం ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ప్రముఖ రైస్ మిల్లు వ్యాపారులు కాళ్ళ సంతోష్ మరియు ఆయన ధర్మపత్ని అనిమ దంపతులు తమ స్వంత ఆర్థిక సహకారంతో మహా దివ్య పడిపూజ మరియు స్వాములకు భిక్ష కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు.వరంగల్ రోడ్డులోని పరకాల క్రాస్ సమీపంలో గల వాసవి ఇండస్ట్రీస్‌ (ఎం.ఆర్.ఎం) ప్రాంగణం ఈ దివ్య కార్యక్రమానికి వేదికైంది. కల్లూరు వెంకట్రావు, కన్నన్ దురై రాజ్ గురు స్వాముల ఆధ్వర్యంలో […]

గోనె సంచిలో గుర్తుతెలియని శవం లభ్యం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట మండలంలోని శంభునిపల్లె గ్రామ శివారులో ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమవడం స్థానికంగా సంచలనం సృష్టించింది.పోలీసుల అంచనా ప్రకారం, మృతి చెందిన వ్యక్తి వయస్సు సుమారు 30 సంవత్సరాలు ఉంటుందని,మృతదేహాన్ని గుర్తుతెలియని దుండగులు ఎక్కడో హత్య చేసి,గోనె సంచిలో కట్టి,అనంతరం వాహనంలో తీసుకువచ్చి శంభునిపల్లె శివారులో పడేసినట్లు తెలుస్తోంది.కేసు నమోదు చేసి ఈ ఘటనపై జమ్మికుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.హత్యకు గురైన వ్యక్తిని గుర్తించేందుకు మరియు ఈ దారుణానికి […]

ఉపాధ్యాయులు విద్యార్థులకు మార్గదర్శకులు

కరీంనగర్/ధనాధన్ న్యూస్: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కొత్తపల్లిలో సుదీర్ఘకాలం ఆంగ్ల ఉపాధ్యాయులుగా సేవలందించిన కనపర్తి రమేష్ ఉద్యోగ విరమణ సమావేశం గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాధికారి (DEO) శ్రీరామ్ మొండయ్య హాజరయ్యారు. ఈ సమావేశంలో శ్రీరామ్ మొండయ్య మాట్లాడుతూ, ఉపాధ్యాయులు విద్యార్థులకు మార్గదర్శకులని అన్నారు. వారి యొక్క క్రమశిక్షణ, పట్టుదల, అంకితభావం పిల్లల భవిష్యత్తుపై చాలా గొప్ప ప్రభావాన్ని చూపుతాయని పేర్కొన్నారు.పదవీ విరమణ పొందిన కనపర్తి రమేష్ సేవలను […]