పెన్షనర్స్ న్యాయపరమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలి

జమ్మికుంట/ధనాధన్ న్యూస్ అక్టోబర్ 10:జమ్మికుంట రైల్వే స్టేషన్ ఆవరణలో ఏఐఆర్ఆర్ఎఫ్, ఎన్సిసిపిఏ, ఫోరమ్ ఆఫ్ నేషనల్ పెన్షనర్స్ అసోసియేషన్, ఎఫ్ ఓ సి పి ఏ పిలుపుమేరకు జమ్మికుంట బ్రాంచి ఆధ్వర్యంలో భారీ ఎత్తున దర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా రైల్వే పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జమ్మికుంట బ్రాంచ్ అధ్యక్షులు, జాతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ దాసరి రాజేశ్వర్ మాట్లాడుతూ పెన్షనర్స్ యొక్క న్యాయమైన డిమాండ్లు అయినటువంటి పెన్షన్ వాలిడేషన్ బిల్లు 2025ను రద్దు చేయాలి,అందరికి … Read more

హుజురాబాద్ గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగురుతుంది – ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

హుజురాబాద్/ధనాధన్ న్యూస్:హుజురాబాద్ నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం అని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం హుజురాబాద్ ఎమ్మెల్యే కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లను 42 శాతం పెంచే ప్రతిపాదనను బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముందుకు తెచ్చారని గుర్తుచేశారు. బీసీలకు న్యాయం చేసే విషయంలో తమ పార్టీ ఎప్పటికీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని భరోసా ఇచ్చారు. … Read more

అవయవదానం చేస్తే జీవితాలు నిలుస్తాయి

జమ్మికుంట/ధనాధన్ న్యూస్, సెప్టెంబర్ 4:జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా అవయవదానం పై అవగాహన కల్పించేందుకు సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జమ్మికుంట పట్టణంలోని కార్తికేయ ఐటీఐ కళాశాలలో ప్రత్యేక సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో చైర్మన్ లెంకలపల్లి శరత్, ఫౌండేషన్ జిల్లా అధ్యక్షులు నరహరి గురూజీ పాల్గొని విద్యార్థులకు అవయవదానం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. మరణం తర్వాత శరీరం కాలిపోతే బూడిద, పూడితే మట్టిగా మారిపోతుందని, అదే అవయవాలను దానం చేస్తే మరొకరి జీవితానికి పునర్జన్మ కల్పించగలమని వారు … Read more

గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా అన్ని శాఖలు సమన్వయం చేసుకోవాలి

కరీంనగర్/ధనాధన్ న్యూస్, సెప్టెంబర్ 4 : హుజురాబాద్ డివిజన్ పరిధిలో గణేష్ నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, ఎటువంటి అవాంతరాలు లేకుండా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకోవాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం సూచించారు. హుజురాబాద్ ఏసీపీ కార్యాలయంలో పోలీస్, విద్యుత్, వైద్య, మున్సిపల్, ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ, నిమజ్జన ప్రదేశాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని, బారికేడ్లు, సరైన లైటింగ్, క్రేన్లు, అదనపు డ్రైవర్లు … Read more

కల సౌకర్యాలతో మహా మేడారం జాతర – మంత్రి సీతక్క

హైదరాబాద్, సెప్టెంబర్ 03:సమ్మక్క–సారలమ్మల త్యాగ ఔన్నత్యానికి తగిన వేడుకగా మేడారం మహా జాతరను నిర్వహిస్తామని మంత్రి దనసరి అనసూయ సీతక్క ప్రకటించారు. జాతర ప్రారంభానికి ముందుగానే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్, ఉన్నతాధికారులు, ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్, వివిధ విభాగాల ఇంజనీర్లు పాల్గొన్నారు. సమ్మక్క–సారలమ్మ పూజారుల సూచనల మేరకు … Read more

ఆర్టీవో నూతన భవన నిర్మాణానికి కృషి

హుజురాబాద్, సెప్టెంబర్ 03 (ధనాధన్ న్యూస్):హుజురాబాద్ ఆర్టీవో కార్యాలయానికి కొత్త భవనం నిర్మాణం కోసం కృషి చేస్తానని రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ మెంబర్ పడాల రాహుల్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని కేసి క్యాంప్‌లో గల ఆర్టీవో కార్యాలయాన్ని ఆయన బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా హుజురాబాద్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వేణు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. కార్యాలయాన్ని పరిశీలించిన అనంతరం పడాల రాహుల్ మాట్లాడుతూ, హుజురాబాద్ డివిజన్ పరిధిలో ప్రజలకు మెరుగైన … Read more

ఆకునూరులో అన్నదానం

సైదాపూర్/ధనాధన్ న్యూస్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఆకునూరు గ్రామంలో వాయుపుత్ర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహా అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా అన్నదాత గుర్రాల సంజీవ్ ఉమా దంపతులు మాట్లాడుతూ గ్రామ ప్రజల సుఖసంతోషాల కోసం, అష్ట ఐశ్వర్యాలు, సిరిసంపదలు లభించాలని గణనాధుని ప్రార్థించామని తెలిపారు.అన్నదానం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాయుపుత్ర యూత్ అసోసియేషన్ సభ్యులు, ఆకునూరు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

యూత్ కాంగ్రెస్ మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా రాఘన్‌

సైదాపూర్/ధనాధన్ న్యూస్:యూత్ కాంగ్రెస్ మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా రాఘన్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు రాఘన్‌ను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఏఎంసీ డైరెక్టర్ చోటే మియా మాట్లాడుతూ – రాఘన్ పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తూ, కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో విశేష కృషి చేశారని అన్నారు. రాఘన్ ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ ఎండీ చోటే మియా, పల్లె గోపాల్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ … Read more

సైదాపూర్‌లో బిఆర్ఎస్ ధర్నా, రాస్తారోకో

సైదాపూర్, సెప్టెంబర్ 2 (ధనాధన్ న్యూస్):సైదాపూర్ మండలంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల సమస్యల పరిష్కారం కోసం భారీ స్థాయిలో ధర్నా, రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సోమారపు రాజయ్య మాట్లాడుతూ –రైతులు యూరియా కోసం రోజుల తరబడి క్యూల్లో నిలబడుతున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని తీవ్ర విమర్శలు చేశారు. వారానికి ఒక్కటి రెండు లారీలు యూరియా సరఫరా చేస్తే సమస్య పరిష్కారం అవుతుందా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై … Read more