జమ్మికుంటలో ఎరుకల జాతి ఆత్మగౌరవ పోరాట జెండా ఆవిష్కరణ

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట పట్టణ పరిధి 16వ వార్డులోని ఎస్టీ కాలనీలో ఆదివారం ఎరుకల కులస్తుల సమక్షంలో ఎరుకల జాతి ప్రజల ఆత్మగౌరవ పోరాట జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తిరుపతి శ్రీనివాస్ మాట్లాడుతూ,1952 ఆగస్టు 31న క్రిమినల్ ట్రైబ్స్ (CT Act) రద్దు చేయబడిన దినాన్ని పురస్కరించుకొని ఈ జెండా ఆవిష్కరణ చేపట్టినట్లు తెలిపారు. బ్రిటిష్ పాలకులు ఎరుకల తెగల అడవి సంపదను దోచుకోవడానికి కుట్రలు పన్ని, వారి ప్రతిఘటనను అణచివేయడానికి ఈ చట్టాన్ని అమలు […]

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై బిగ్ అప్‌డేట్

హైదరాబాద్/ధనాధన్ న్యూస్, ఆగష్టు 26: తెలంగాణలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు మార్గం సుగమమైంది. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన స్పష్టమైన ఆదేశాల నేపథ్యంలో, రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణ ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ క్రమంలో ఎన్నికల షెడ్యూల్ కోసం కీలకమైన ఓటర్ల జాబితా సవరణ పనులను ప్రారంభించింది. హైకోర్టు కీలక తీర్పు 2024 జనవరి 31తోనే తెలంగాణలోని సర్పంచుల పదవీకాలం ముగిసింది. దీంతో గ్రామాల్లో సర్పంచ్ చెక్ పవర్ నిలిచిపోగా, […]

అక్క చెల్లెళ్లకు రాఖీ పండుగ శుభాకాంక్షలు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్ : రాఖీ పౌర్ణమి సందర్భంగా హుజురాబాద్ పట్టణానికి  చెందిన తెలంగాణ యూత్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్వి అర్జున్ ని ఆయన  నివాసంలో సోదరి అశ్విని, తదితర సోదరీమణులు రాఖీలు కట్టారు. ముందుగా హారతి ఇచ్చి తిలకం దిద్ది రాఖీ కట్టిన అనంతరం నోరు తీపి చేసి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎల్ వి అర్జున్ మాట్లాడుతూ, రక్షాబంధన్ పండుగ కులమతాలకు అతీతంగా సోదర–సోదరీమణుల అనుబంధానికి ప్రతీక. ఈ పండుగ మనసుల్లో ప్రేమ, […]

దుద్దెనపల్లి ప్రాథమిక పాఠశాలలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలంలోని దుద్దెనపల్లి గ్రామంలో శనివారం రోజున ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు,విద్యార్థులు బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు,విద్యార్థులు తెలంగాణ సాంప్రదాయకంగా చీరలు కట్టి, నెత్తిన బోనం ఎత్తి, శివసత్తులు,పోతరాజు వేషం కట్టి విద్యార్థులు ఆటపాటలతో అలరిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బోనాల పండుగను అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో, బోనం వండి,గ్రామ దేవతలను స్మరిస్తూ ప్రసాదం సమర్పించారు.ప్రైమరీ స్కూల్ హెచ్ఎం విజయ్ మాట్లాడుతూ ఉపాధ్యాయులతో మరియు పిల్లలతో కలిసి బోనాల పండుగను […]

తప్పుడు పత్రాలతో అధికారులను మోసం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: తప్పుడు పత్రాలు సృష్టిస్తూ అధికారులను మోసం చేస్తూ దొంగే దొంగ అన్నట్టుగా వ్యవహరిస్తున్న భూ కబ్జాదారులపై  ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని కోరపల్లి మాజీ సర్పంచ్ బోయిని సమ్మయ్యఅన్నారు .మంగళవారం జమ్మికుంట ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోఆయన మాట్లాడుతూ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ తనను మానసికంగా హింసిస్తున్నారని, ప్రజల్లో తనను ఒక తప్పుడు వ్యక్తిగా సూచిస్తున్నారని పలువురు ప్రజాప్రతినిధులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు .దళితుడైన తనను కొంతమంది కావాలని […]

రుణమాఫీ పేరిట రైతులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ

వీణవంక/ధనాధన్ న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ చేశామని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ ఎక్కడ జరిగిందో వివరించాలని వీణవంక మండల కేంద్రానికి చెందిన రైతు నాయకుడు నీల పున్నం చెందర్ అన్నారు. గడిచిన సంవత్సర కాలం నుంచి ఇప్పటివరకు రుణమాఫీ చేశామని గొప్పలు చెప్పుకుంటుంది కాంగ్రెస్ పార్టీ, ఇప్పటికి కూడా రుణమాఫీ కాక లబోదిబో అంటున్న రైతులు, ఎవరికి రుణమాఫీ చేశారు. మేము రైతులం కాదా మాకెందుకు రుణమాఫీ చేయలేదు.. ఇప్పటివరకు మా గురించి కాంగ్రెస్ […]

42శాతం రిజర్వేషన్లు అమలు అందరి బాధ్యత

హన్మకొండ/ధనాధన్ న్యూస్: ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా స్థానిక సంస్థల్లో 42శాతం రిజర్వేషన్ ఆగదని, ఆర్డినెన్స్ తెచ్చుటకు విపక్షాలు సహకరించాలని  ఫూలే ఆశయ సాధన సమితి (పాస్) వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ సంగని మల్లేశ్వర్ అన్నారు. సోమవారం కాకతీయ యూనివర్సిటీ లోని జర్నలిజం విభాగంలో ఫూలే ఆశయ సాధన సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు డాక్టర్ తాడూరి శాస్త్రి ఆధ్వర్యంలో  ఉమ్మడి జిల్లా సమావేశం జరిగింది. దీనికి పాస్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సంగని మల్లేశ్వర్ ముఖ్యఅతిధిగా […]

స్కూల్ ను కాపాడడం కోసం కదం తొక్కిన మహిళలు

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలంలోని దుద్దెనపల్లి గ్రామంలో గురువారం రోజున ఉదయం గ్రామంలోని విద్యార్థులను ప్రైవేట్ స్కూళ్లకి తీసుకుని వెళ్లడానికి వచ్చిన స్కూల్ బస్సులను, మోడల్ స్కూల్ బస్సును, మహిళలందరూ అడ్డుకొని, బస్సు వెళ్లకుండా రోడ్డుపై బైఠాయించి మహిళలు ధర్నా చేసి,గ్రామంలోని విద్యార్థులను బస్సులో నుంచి దింపి విద్యార్థులు ప్రైవేట్ స్కూల్ వెళ్లడానికి గల కారణాలు అడిగి తెలుసుకోని,విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా మన గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించేటువంటి బాధ్యత మాదేనని […]

రసమయి బాలకిషన్ నోరు అదుపులో పెట్టుకో

కరీంనగర్/ధనాధన్ న్యూస్: ఇందిరమ్మ ఇండ్ల పైన మానకొండూరు నియోజకవర్గం అభివృద్ధి పైన రసమయి బాలకిషన్ చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కొరివి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు.  స్థానిక జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన పత్రిక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రజాపాలనలో మానకొండూరు నియోజకవర్గంలో జరుగుతున్న […]

ప్రవేట్ పాఠశాల యాజమాన్యం,బుక్ స్టాల్స్ యజమాన్యాలపై  చర్యలు తీసుకోవాలి

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట పట్టణంలోని ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలపై బుక్ స్టాల్ యాజమాన్యాలపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఏఐఎఫ్ డిఎస్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం శ్రీకాంత్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జమ్మికుంట పట్టణం లో ఉన్న అన్ని ప్రైవేట్ స్కూల్స్ సిండికేట్ అయ్యారని  బుక్ స్టాల్స్ యజమానియాలతో ఒప్పందం  చేసుకున్నారనీ బుక్ స్టాల్స్ యాజమాన్యాల దగ్గరికి వెళ్లి తక్కువ ధర ఉన్న పుస్తకాలకు ఎక్కువ ధరలకు విక్రయించేలా ఒప్పందం చేసుకున్నారని […]