అవయవదానం చేస్తే జీవితాలు నిలుస్తాయి

జమ్మికుంట/ధనాధన్ న్యూస్, సెప్టెంబర్ 4:జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా అవయవదానం పై అవగాహన కల్పించేందుకు సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జమ్మికుంట పట్టణంలోని కార్తికేయ ఐటీఐ కళాశాలలో ప్రత్యేక సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో చైర్మన్ లెంకలపల్లి శరత్, ఫౌండేషన్ జిల్లా అధ్యక్షులు నరహరి గురూజీ పాల్గొని విద్యార్థులకు అవయవదానం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. మరణం తర్వాత శరీరం కాలిపోతే బూడిద, పూడితే మట్టిగా మారిపోతుందని, అదే అవయవాలను దానం చేస్తే మరొకరి జీవితానికి పునర్జన్మ కల్పించగలమని వారు […]
గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా అన్ని శాఖలు సమన్వయం చేసుకోవాలి

కరీంనగర్/ధనాధన్ న్యూస్, సెప్టెంబర్ 4 : హుజురాబాద్ డివిజన్ పరిధిలో గణేష్ నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, ఎటువంటి అవాంతరాలు లేకుండా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకోవాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం సూచించారు. హుజురాబాద్ ఏసీపీ కార్యాలయంలో పోలీస్, విద్యుత్, వైద్య, మున్సిపల్, ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ, నిమజ్జన ప్రదేశాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని, బారికేడ్లు, సరైన లైటింగ్, క్రేన్లు, అదనపు డ్రైవర్లు […]
కల సౌకర్యాలతో మహా మేడారం జాతర – మంత్రి సీతక్క

హైదరాబాద్, సెప్టెంబర్ 03:సమ్మక్క–సారలమ్మల త్యాగ ఔన్నత్యానికి తగిన వేడుకగా మేడారం మహా జాతరను నిర్వహిస్తామని మంత్రి దనసరి అనసూయ సీతక్క ప్రకటించారు. జాతర ప్రారంభానికి ముందుగానే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్, ఉన్నతాధికారులు, ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్, వివిధ విభాగాల ఇంజనీర్లు పాల్గొన్నారు. సమ్మక్క–సారలమ్మ పూజారుల సూచనల మేరకు […]
ఆర్టీవో నూతన భవన నిర్మాణానికి కృషి

హుజురాబాద్, సెప్టెంబర్ 03 (ధనాధన్ న్యూస్):హుజురాబాద్ ఆర్టీవో కార్యాలయానికి కొత్త భవనం నిర్మాణం కోసం కృషి చేస్తానని రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ మెంబర్ పడాల రాహుల్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని కేసి క్యాంప్‌లో గల ఆర్టీవో కార్యాలయాన్ని ఆయన బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా హుజురాబాద్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వేణు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. కార్యాలయాన్ని పరిశీలించిన అనంతరం పడాల రాహుల్ మాట్లాడుతూ, హుజురాబాద్ డివిజన్ పరిధిలో ప్రజలకు మెరుగైన […]
ఆకునూరులో అన్నదానం

సైదాపూర్/ధనాధన్ న్యూస్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఆకునూరు గ్రామంలో వాయుపుత్ర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహా అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా అన్నదాత గుర్రాల సంజీవ్ ఉమా దంపతులు మాట్లాడుతూ గ్రామ ప్రజల సుఖసంతోషాల కోసం, అష్ట ఐశ్వర్యాలు, సిరిసంపదలు లభించాలని గణనాధుని ప్రార్థించామని తెలిపారు.అన్నదానం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాయుపుత్ర యూత్ అసోసియేషన్ సభ్యులు, ఆకునూరు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
యూత్ కాంగ్రెస్ మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా రాఘన్

సైదాపూర్/ధనాధన్ న్యూస్:యూత్ కాంగ్రెస్ మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా రాఘన్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు రాఘన్‌ను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఏఎంసీ డైరెక్టర్ చోటే మియా మాట్లాడుతూ – రాఘన్ పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తూ, కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో విశేష కృషి చేశారని అన్నారు. రాఘన్ ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ ఎండీ చోటే మియా, పల్లె గోపాల్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ […]
సైదాపూర్‌లో బిఆర్ఎస్ ధర్నా, రాస్తారోకో

సైదాపూర్, సెప్టెంబర్ 2 (ధనాధన్ న్యూస్):సైదాపూర్ మండలంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల సమస్యల పరిష్కారం కోసం భారీ స్థాయిలో ధర్నా, రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సోమారపు రాజయ్య మాట్లాడుతూ –రైతులు యూరియా కోసం రోజుల తరబడి క్యూల్లో నిలబడుతున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని తీవ్ర విమర్శలు చేశారు. వారానికి ఒక్కటి రెండు లారీలు యూరియా సరఫరా చేస్తే సమస్య పరిష్కారం అవుతుందా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై […]
బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్సీ కవిత సస్పెండ్

హైదరాబాద్, సెప్టెంబర్ 2:భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీకి అనుబంధంగా ఉన్న ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సస్పెండ్ చేశారు. క్రమశిక్షణ ఉల్లంఘన, పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా ప్రవర్తించిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక ప్రకటనలో తెలిపారు. సస్పెన్షన్ వెనుక కారణాలు ఇటీవల కాలంలో కవిత పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రవర్తించారని, పార్టీకి ఇబ్బందులు కలిగించే విధంగా కొన్ని వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చాయి. క్రమశిక్షణలో లోపం ప్రదర్శించినందుకు […]
అభివృద్ధి ని రాజకీయ ఎజెండా గా మార్చిన లీడర్

ధనాధన్ న్యూస్,సెప్టెంబర్ 01: నారా చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మూడు దశాబ్దాలకు పైగా తన ముద్ర వేసుకున్న అరుదైన నాయకుడు. 1950లో చిత్తూరు జిల్లా నారావారిపల్లిలో జన్మించిన ఆయన విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై ఆసక్తి కనబరిచారు. 1978లో కాంగ్రెస్ అభ్యర్థిగా చందరగిరి నుంచి ఎమ్మెల్యేగా తొలిసారి శాసనసభలో అడుగుపెట్టారు. రాష్ట్రంలో అగ్రి మంత్రిగా పనిచేశారు. 1980లలో ఎన్టీఆర్ కూతురు భువనేశ్వరిని వివాహం చేసుకోవడంతో ఆయన తెలుగు దేశం పార్టీలో కీలక స్థానాన్ని సంపాదించారు. […]
చెన్నూర్ ఎస్బీఐలో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం – 44 మంది అరెస్టు

చెన్నూర్ ఎస్బీఐ బ్రాంచ్‌లో భారీ గోల్డ్ లోన్ మోసం వెలుగులోకి వచ్చింది. ఆగస్టు 23న ఎస్బీఐ రీజినల్ మేనేజర్ రితేష్ కుమార్ గుప్తా ఫిర్యాదు మేరకు పోలీస్‌లు దర్యాప్తు చేసి, ఇప్పటివరకు 44 మంది నిందితులను అరెస్టు చేశారు. వీరిలో ముగ్గురు బ్యాంకు ఉద్యోగులు కూడా ఉన్నారు. ప్రధాన నిందితుడు నరిగె రవీందర్ (క్యాషియర్) ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌లో రూ.40 లక్షలు పోగొట్టి, నష్టాన్ని పూడ్చుకునేందుకు బ్రాంచ్ మేనేజర్ వెన్నపురెడ్డి మనోహర్ మరియు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి లక్కాకుల […]
