జగిత్యాల రైతు బజార్ వద్ద ట్రాఫిక్ సమస్యకు చెక్

జగిత్యాల,జూలై 13 (ధనాధన్ న్యూస్): జగిత్యాల పట్టణంలోని రైతు బజార్ ముందు రహదారిపై రైతులు కూరగాయలు విక్రయించడం వల్ల గత కొంతకాలంగా తీవ్ర ట్రాఫిక్ సమస్య నెలకొంది. ముఖ్యంగా విద్యానగర్ వైపు వెళ్లే ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో పాటు, సమీపంలోని ఆసుపత్రులకు వెళ్లే రోగులు, అంబులెన్స్‌లు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ సమస్యపై స్పందించిన ట్రాఫిక్ ఎస్‌ఐ మల్లేశం సోమవారం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం వార్డు కౌన్సిలర్ అరవ లక్ష్మి, మున్సిపల్ సిబ్బందితో […]