ప్రముఖ సినీనటుడు అజిత్ కుమార్ ఈరోజు చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు.
సినిమా షూటింగ్ సమయంలో బాడీ సహకరించ కపోవడంతో సాధారణ శారీరక పరీక్షల నిమిత్తం అజిత్ ను ఆస్పత్రిలో చేర్చినట్లు సమాచారం.
ప్రస్తుతం ఆయన మగిజ్ తిరుమేని దర్శకత్వంలో‘విడముయార్చి’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా గత కొన్ని రోజులుగా షూటింగ్ ఆగిపోయింది.ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు
