జమ్మికుంట,ధనాధన్ న్యూస్:
తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు వికాస సమితి (రి.1251/2016) రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు
యర్రమాద కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు జమ్మికుంట మండల అధ్యక్షులుగా కొలుగూరి అనిల్ ను నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణారెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ఆశయాలను ఆదర్శాలను మండల వ్యాప్తంగా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి,చట్టాలపై అవగాహన కల్పిస్తామన్నారు.సమాజంలో జరుగుతున్న అవినీతిని అక్రమాలను వెలికి తీసేందుకు సమాచార హక్కు చట్టం ఒక వజ్రాయుధమని తెలిపారు.(సహవిస) జమ్మికుంట మండల అధ్యక్షుడిగా నియమించిన సందర్భంగా రాష్ట్ర,జిల్లా అధ్యక్షులకు అనిల్ కృతజ్ఞతలు తెలిపారు.
