మరికొన్ని క్షణాల్లో పది పలితాల విడుదల

  • ఒక్క క్లిక్ తో పలితాలు పొందండి


హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పదో తరగతి ఫలితాలు ఇవాళ (బుధవారం) విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు SCERT Telangana ఆడిటోరియంలో ప్రభుత్వ సలహాదారు K. Keshava Rao ఫలితాలను అధికారికంగా ప్రకటించనున్నారు.ఈసారి పరీక్షలను విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేలా ప్రత్యేకంగా ప్లాన్ చేశారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు దశలవారీగా నిర్వహించి, ప్రతి పరీక్షకు మధ్య 3-4 రోజుల విరామం ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 2,676 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షలకు సుమారు 5.28 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.


WhatsApp ద్వారా ఫలితాలు:
మధ్యాహ్నం 2:30 గంటల తర్వాత 8096958096 నంబరుకు “Hi” అని మెసేజ్ పంపితే మీ ఫలితాలు సులభంగా తెలుసుకోవచ్చు.


అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫలితాలు చెక్ చేయండి:
https://bse.telangana.gov.in
https://results.bsetelangana.org
ఎలా చెక్ చేయాలి?
హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయండి
Submit పై క్లిక్ చేయండి
మీ మార్క్స్ వెంటనే స్క్రీన్‌పై కనిపిస్తాయి


ఈసారి స్పెషల్ ఏమిటంటే…
విద్యార్థుల మానసిక ఒత్తిడి తగ్గించేందుకు గ్యాప్‌లు ఇవ్వడం, పరీక్షల నిర్వహణలో కొత్త మార్పులు తీసుకురావడం వల్ల ఫలితాపై ఆసక్తి మరింత పెరిగింది.
..స్టూడెంట్స్‌కు బెస్ట్ ఆఫ్ లక్! మీ కష్టం ఫలించాలి..

Leave a comment