ఇక అంగన్వాడీలోనూ యూనిఫామ్

By dhanadhannews.com

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: అంగన్‌వాడీ స్కూళ్లలోనూ ఇక నుంచి యూనిఫామ్‌ ఉండనుంది.ప్రీ ప్రైమరీ స్కూళ్లలో చిన్నారులకు యూనిఫామ్‌ అందించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా ఈ ఏడాది నుంచే అమల్లోకి రానుంది. ఒక్కో విద్యార్థికి జత చొప్పున పంపిణీ చేయనుండగా.. ఇప్పటికే క్లాత్‌ జిల్లాకు చేరుకుంది. వచ్చే నెల మొదటి వారంలో యూనిఫామ్‌ పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లల్లో చదువుతున్న విద్యార్థులకు సర్కారు ఉచితంగా రెండు జతల యూనిఫామ్‌ అందిస్తున్నది. ఇందులో భాగంగా జిల్లాలో ప్రస్తుతం ఒక జత ఇవ్వగా,త్వరలో రెండో జత ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.యూనిఫారమ్‌ పంపిణీ పాఠశాల హెచ్‌ఎం,పాఠశాల ఆశా కార్యకర్త,తల్లులు,జమ్మికుంట-2 హెచ్ఎం శకుంతల, దేవేందర్,అంగన్వాడీ టీచర్ స్వరూప, ఆయ అరుణ,ఆశా వర్కర్ రమ తదితరులు పాల్గొన్నారు.