- కాంగ్రెస్ యువ నాయకుడు ప్రశాంత్ మద్దుల
వీణవంక/ధనాధన్ న్యూస్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు పెద్దపీట వేయాలని, పోటీకి అవకాశం కల్పించాలని కాంగ్రెస్ యువ నాయకుడు ప్రశాంత్ మద్దుల కోరారు. బుధవారం ఆయన వీణవంక మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పదికాలాలపాటు ప్రజా శ్రేయస్సుకు పనిచేయాలంటే గ్రామాల్లో యువతకు చాన్స్ ఇవ్వాలని కోరారు. యువ రక్తం హస్తం పార్టీలో ఉన్నంతగా మరే పార్టీలో లేదని చెప్పారు. హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలో యువతీ యువకులకు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో అత్యధిక ప్రాధాన్యతనిచ్చి పోటీకి అవకాశం కల్పించాలని అన్నారు. నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి ప్రణవ్ నాయకత్వంలో రాబోయే ఎన్నికల్లో స్థానికంగా బలం కలిగిన కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వీణవంక మండల పరిధిలో కొమ్మిడి రాకేష్ రెడ్డి నాయకత్వంలో పార్టీ శ్రేణులు బలంగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. కేంద్ర స్థాయిలో ఏఐసీసీ అగ్రనేత లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మార్గదర్శనంలో రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు ఫుల్ ప్రయారిటీ ఇవ్వాలని అభ్యర్థించారు. గత పాలకుల మాదిరిగా పాతవారికే మళ్లీ ప్రయారిటీ ఇస్తే గ్రామాల్లో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
స్థానిక కాంగ్రెస్ నాయకత్వం ఈ విషయాలన్నిటిని నిశితంగా గమనించి.. యువతకు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చి.. పోటీకి పెద్దపీట వేయాలని కోరారు. పార్టీ పెద్దల మార్గదర్శనంలో యువత చక్కగా పనిచేసే అవకాశాన్ని నాయకత్వం పరిశీలించాలని అభ్యర్థించారు.