ఆడ్తిదారుల సంఘం నూతన కార్యవర్గానికి ఘన సన్మానo

జమ్మికుంట జనవరి 24: అడ్తీదారుల, ఖరీదు వ్యాపారుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని అడ్తిదారుల సంఘం అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేశ్వరరావు అన్నారు.జమ్మికుంట అడ్తిదారుల సంఘం నూతన కార్యవర్గాన్ని బుధవారం జమ్మికుంట ఆడ్తిదారులు ఖరీదు వ్యాపారులు శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఆడ్తిదారుల సంఘం అధ్యక్షులుగా మూడవసారి ఏకగ్రీవంగా ఎన్నికైన అడ్తీదారుల సంఘం అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేశ్వర్ రావుని గౌరవ అధ్యక్షుడు పాకాల రవీందర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి గౌడ శ్రీనివాస్ ఉపాధ్యక్షులు గుత్తి కుమారస్వామి కోశాధికారి రావికంటి సత్యనారాయణ ఇతర పాలకవర్గ సభ్యులను జమ్మికుంట ఆడ్తిదారులు వ్యాపారులు శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రక్తదారుల సంఘం అధ్యక్షుడు రాజేశ్వరరావు మాట్లాడుతూ నాపై నమ్మకంతో నన్ను మూడవసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్న అడ్తిదారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారులు బచ్చు భాస్కర్ ముక్క శివన్న బచ్చు వీరన్న ముక్క నారాయణ నగునూరి రవీందర్ రావికంటి బాబన్న, శ్యామ్ అడ్తీ దారులు తదితరులు పాల్గొన్నారు