కాంగ్రెస్ గూటికి బిఆర్ఎస్ నేత మల్లికార్జున రాజేందర్

By dhanadhannews.com

  • మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన పలువురు బిఆర్ఎస్ నేతలు.

మంత్రి రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కరీంనగర్ పట్టణానికి చెందిన మాజీ కార్పొరేటర్ మల్లికార్జున రాజేందర్ తో పాటు పలువురు బిఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.మంత్రి పొన్నం ప్రభాకర్,మాజీ యం.ఎల్.సి టి.సంతోష్ కుమార్ బిఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.
గతంలో కాంగ్రెస్ పార్టీలో జిల్లా స్థాయి పదవులతో పాటు కార్పొరేటర్ గా అవకాశాలు ఇచ్చిన కాంగ్రెస్ గూటికి చేరడం సంతోషంగా ఉందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన గడిచిన కొద్ది రోజుల్లోనే రెండు గ్యారెంటీలు అమలు చేయడం మరొక రెండు గ్యారెంటీలను అమలు చేయడానికి కార్యచరణ ప్రారంభించడం కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు సంపూర్ణ విశ్వాసాన్ని వ్యక్తం చేయడం పట్ల ఆకర్షితులై రాష్ట్ర భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యమని భావించి నేడు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుందని తమను పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి పొన్నం ప్రభాకర్ కి,స్వాగతించిన జిల్లా నాయకత్వానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పొన్నం ప్రభాకర్ నాయకత్వంలో,జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాలతో, కరీంనగర్ అస్సెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ పురుమళ్ల శ్రీనివాస్ సూచనలతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని మల్లికార్జున రాజేందర్ పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో 14వ డివిజన్ బిఆర్ఎస్ నేత జంగ శరత్ చంద్ర,వాసర హాస్పిటల్ చైర్మన్ నాగసముద్రం వాసరయ్య,నాగసముద్రం పురుషోత్తం,బిఆర్ఎస్ నేతలు యాగండ్ల అనిల్ కుమార్, సిద్ది లక్ష్మణ్, వెంకటేశం, రంగు చెన్నయ్య గౌడ్, పంజాల వెంకన్న, నవీన్ తదితరులు ఉన్నారు.