-తెలంగాణ జనసమితి మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరికిళ్ల స్రవంతి.
తెలంగాణ లో కెసిఆర్ అరాచక పాలన అంతం అయినకూడా తెలంగాణ ఉద్యమ రథ సారధి ప్రొఫెసర్ కోదండరాం పై కెసిఆర్ కుట్రలు మాత్రం ఆగడం లేదని తెలంగాణ జన సమితి మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరికిల్ల స్రవంతి ఆరోపించారు.ప్రొఫెసర్ కోదండరాం ని శాసన మండలికి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఆమె హెచ్చరించారు.గత తొమ్మిది సంవత్సరాలుగా అనేక రకాల దాడులు చేస్తూ కోదండరాం ని కెసిఆర్ ఇబ్బంది పెట్టాడని, ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల్లో వందలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టు ఆయన్ను ఓడించారని పేర్కొన్నారు.తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపిన కోదండరాం ని చట్ట సభకు వెళ్లకుండా అడ్డుకోవడం సిగ్గు చేటని ఆమె విమర్శించారు. ఉద్యమకారులపై కెసిఆర్ చేస్తున్న కుట్రలను, నిర్భంధాలను తెలంగాణ ప్రజలు, ప్రజాస్వామికవాదులు, ఉద్యమకారులు వ్యతిరేకించాలని ఆమె కోరారు. తెలంగాణ సమాజానికి కెసిఆర్ ని శాశ్వతంగా దూరం చేసే రోజులు దగ్గర పడ్డాయని స్రవంతి పేర్కొన్నారు.
