మండల బాలల పరిరక్షణ కమిటీ శిక్షణ కార్యక్రమం.

By dhanadhannews.com

మాట్లాడుతున్న ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి

కరీంనగర్ జిల్లా సంక్షేమ శాఖ సమగ్ర బాలల అభివృద్ధి విభాగం ఆధ్వర్యంలో హుజురాబాద్ సిడిపిఓ భాగ్యలక్ష్మి అధ్యక్షతన సైదాపూర్ ఎంపీడీవో కార్యాలయం నందు మండల బాలల పరిరక్షణ కమిటీ కార్యక్రమము నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ బాలల పరిరక్షణ కమిటీల ఏర్పాటు విధి విధానాలు బాలల హక్కుల పరిరక్షణ మరియు బాలల చట్టాల గురించి బాల కార్మిక, బాల్యవివాహాల నిర్మూలన, లైంగిక వేధింపులు, బ్రూణ హత్యలు నిర్మూలన మరియు విద్యాహక్కు చట్టం వివిధ చట్టాల పైన ముఖ్యంగా గ్రామ స్థాయిలో అంగన్వాడీ కార్యకర్త ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు వివిధ గ్రామస్థాయి అధికారులు అవగాహనా కలిగి ఉండాలని అన్నారు.కరీంనగర్ కలెక్టర్ ప్రమీల సత్పతి ప్రత్యేక చొరవతో స్నేహిత కార్యక్రమంను వివిధ మండలాల్లోని వివిధ పాఠశాలల్లో బాలికల యొక్క రక్షణ పరిరక్షణకు దోహదపడే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు.బాలల హక్కుల పరిరక్షణ కోసం అందరు సహకరించాలని,18 సంవత్సరాల లోపు పిల్లలకు సంబంధించి ఏదైనా సమస్య దృష్టికి వస్తే కమిటీ దృష్టికి గాని పోలీసువారి 100 కానీ చైల్డ్ హెల్ప్ లైన్ 1098 ఉచిత నెంబర్ కు సమాచార ఇవ్వాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సైదాపూర్ తహసిల్దార్ మంజుల, ఎంపీడీవో పద్మావతి , సిడిపిఓ భాగ్యలక్ష్మి, ఎస్సై ఆరోగ్యం,బాలల పరిరక్షణ అధికారి రమేష్, చైల్డ్ హెల్ప్ లైన్ 1098 సూపర్వైజర్ దూడం కుమారస్వామి,ఐసిడిఎస్ సూపర్వైజర్ జ్యోతి, స్వరూప, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సౌమ్య,మండల సమైక్య అధ్యక్షురాలు రజిత,విద్యాశాఖ సిబ్బంది,పూజారులు,పాస్టర్లు,అంగన్వాడీ టీచర్స్ మరియు తదితరులు పాల్గొన్నారు.