విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టం తో చదవాలి

By dhanadhannews.com

  • చదువుతో పాటు సంస్కారం ముఖ్యం
  • ప్రవేట్ పాఠశాల ఎస్ ఎస్ సి విద్యార్థుల కు మోటివేషన్ క్లాసు
  • ప్రముఖ సైకాలజీస్ట్ రవికాంత్
కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు.

విద్యార్థులు జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే చదువు కష్టంగా కాకా ఇష్టంగా చదవాలని, విద్య తో
పాటు సంస్కారం కూడా అవసరమని తల్లిదండ్రులను,గురువులను, పెద్దలను గౌరవించాలని అలాగే జీవన నైపుణ్యాలను పెంచుకోవాలని ప్రముఖ సైకాలజీస్ట్ రవికాంత్ అన్నారు.జమ్మికుంట పట్టణంలో స్థానిక పి.వి.ఆర్ గార్డెన్స్ లో జమ్మికుంట ట్రస్మా అధ్యక్షులు డాక్టర్ పుల్లూరి సంపత్ రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రవేట్ పాఠశాల పదవ తరగతి విద్యార్థులకు మోటివేషన్ కార్యక్రమానికి ప్రధాన వక్తగా ప్రముఖ సైకాలజీస్ట్ ప్రొపెసర్ రవికాంత్ హాజరై విద్యార్థులకు పదవ తరగతి పరీక్షలపై భయాన్ని వీడి ఏ విధంగా చదవాలో ప్రతి అంశాన్ని ప్రొజెక్టర్ ద్వారా చూపిస్తూ విద్యార్థులకు అర్థం అయ్యే విధంగా వివరించి విద్యార్థులకు ఉత్సాహాన్ని నింపారు.నిరుపేద కుటుంబాల నుండి ఉన్నత స్థాయిలో పేరుపొందిన ప్రముఖ గూగుల్, మైక్రో సాప్ట్ కంపనీ లలో ఉద్యోగులు సాధించిన ప్రముఖుల గురించి విద్యార్థుల వివరిస్తూ వారి లక్ష్యాలను పెంపొందిస్తూ ఉన్నత శిఖరాల వైపు వెళ్ళుటకు విద్యార్థులకు మోటివేషన్ చేసి ఉన్నతమైన మార్కులు సాధించడానికి విద్యార్థులకు వివిధ విజయం సాధించిన వ్యాపారవేత్తలని, క్రికెటర్లని, రాజకీయ నాయకుల జీవిత చరిత్రలు చూపిస్తూ పరీక్షల్లో మార్కులు రాకుంటే ఆత్మహత్యలు లాంటివి చేసుకోకుండా, జీవితంలో మార్కులతో సంబంధం లేకుండా ఉన్నత లక్ష్యాలను సాధించే దిశగా వెళ్లాలని విద్యార్థులకు మోటివేషన్ చేశారు.. అనంతరం ట్రస్మా రాష్ట్ర సలహాదారు యాదగిరి శేఖర్ రావు మాట్లాడుతూ పిల్లలు భారతీయ సంస్కృతిని సాంప్రదాయాలను అవలంబిస్తూ ఆధునిక జీవన నైపుణ్యాలను పెంచుకోవాలని అన్నారు.. జమ్మికుంట ప్రైవేట్ పాఠశాలలు జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయి పాఠశాలలకు దీటుగా గత 30 సంవత్సరాలుగా మార్కులలోనైనా, గ్రేడులలోనైనా గట్టి పోటీని ఇస్తూ గ్రామీణ ప్రాంత విద్యార్థులను రాష్ట్రస్థాయి ర్యాంకులను తీసుకొస్తూ విద్యార్థులకు తల్లిదండ్రులకు ఎలాలేని సేవలు చేస్తున్నా యాజమాన్యాలకు అభినందించారు..కరీంనగర్ లోని రేసొనన్స్ జూనియర్ కాలేజి చైర్మన్ అంజిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు పదవ తరగతి తర్వాత ఎలాంటి విద్యా అవకాశాలు ఉన్నాయో ఏఏ విద్యను అభ్యసిస్తే ఎలాంటి అవకాశాలు పొంది జీవితాలను ఉన్నత శిఖరాలకు అధిరోహించవచ్చునో విద్యార్థులకు మార్గదర్శనం చేశారు..ఈ జమ్మికుంట మండల ట్రస్మా అధ్యక్షులు డా. పుల్లూరి సంపత్ రావు, ట్రస్మా జిల్లా అధ్యక్షులు కోరేం సంజీవా రెడ్డి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మూసిపట్ల తిరుపతి రెడ్డి, మండల విద్యాధికారి విడపు శ్రీనివాస్, జమ్మికుంట పాఠశాలల కరస్పాండెంట్ అవిర్నేని సుధాకర్ రావు, బెన్ని, రఘుపతి రెడ్డి, రమణా రెడ్డి, కృష్ణా రెడ్డి, సునీల్, తదితరులు పాల్గొన్నారు.