ప్రజా పాలనలో కొలువుల జాతర

By dhanadhannews.com

  • 5,192 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించిన సీఎం
  • సీఎం రేవంత్ రెడ్డికి జీవితకాలం రుణపడి ఉంటాం
  • జూనియర్ లెక్చరర్ గా ఉద్యోగం సాధించిన కల్లూరి సత్యవేణి

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తను ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్క పథకాన్ని అమలు చేస్తూ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా 90 రోజుల్లోనే ప్రజలు మెచ్చే విధంగా తన పరిపాలన కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన విషయంలో ఒక అడుగు ముందుకు వేసి 5192 మంది కి జూనియర్ లెక్చరర్, గురుకుల టీచర్లు గా ఉద్యోగ నియామక పత్రాలు అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. ఇదే కాకుండా ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు మెగా డీఎస్సీని ప్రకటించి త్వరలోనే వారికి కూడా ఉద్యోగాలు ఇవ్వడానికి రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధంగా ఉండడం నిరుద్యోగుల్లో ఆనందం వెల్లులిస్తుంది.

జూనియర్ లెక్చరర్ గా ఉద్యోగం రావడం సంతోషంగా ఉంది.

కల్లూరి సత్యవేణి.




తాను వైశ్య కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకున్నానని రేవంత్ రెడ్డి సర్కార్లో నాకు జూనియర్ లెక్చరర్ ఉద్యోగం రావడం సంతోషంగా ఉందని సత్యవేణి తెలిపారు. గత ప్రభుత్వంలో ఎన్నో రోజుల నుండి ఎదురుచూసిన ఉద్యోగ నియామకాలు లేక నిరుత్సాహంగా ఉన్న మాకు సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగ నియామక పత్రం అందించడం సంతోషంగా ఉందని ఆమె తెలిపారు.