- ఏఐవైఎఫ్ కరీంనగర్ జిల్లా కమిటి డిమాండ్
ధనాధన్ న్యూస్ మే23: బోర్డ్ నిబంధనలను ఉల్లంగిస్తూ అక్రమంగా నడిపిస్తూ వేసవి తరగతులు నిర్వహిస్తున్న కరీంనగర్ నగరంలోని ప్రైవేట్ కళాశాలల ను సీజ్ చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని, ఇంటర్ బోర్డ్ నిబంధనలను భేకాతరు చేస్తున్న కార్పొరేట్ కళాశాలలపై చర్యలు తీసుకోవడంలో ఇంటర్ బోర్డ్ విఫలం చెందిందని బోనగిరి మహేందర్ బ్రాహ్మణపల్లి యుగంధర్ ఆరోపించారు.
ఈ సందర్భంగా ఏ ఐ వై ఎఫ్ జిల్లా అధ్యక్షులు బోనగిరి మహేందర్, ప్రధాన కార్యదర్శి బ్రాహ్మణ పెళ్లి యుగంధర్ మాట్లాడుతూ ధనార్జనే ధ్యేయంగా కేవలం కాసుల కక్కుర్తితో విద్యార్థులను వారి తల్లిదండ్రులను మోసం చేస్తూ ఇంటర్ బోర్డ్ నిబంధనలు ఉల్లంఘించి అనధికారకంగా జూనియర్ కళాశాలల ను నడిపిస్తూ విద్యార్థులను మోసం చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు వారు అన్నారు. ఇంటర్మీడియట్ రెండవ విద్యా సంవత్సర తరగతులను జూన్ రెండవ వారం నుండి ప్రారంభించవలసి ఉండగా, ఏప్రిల్ 20వ తేదీ నుండే తరగతులు ప్రారంభించడం సిగ్గు చేటు అన్నారు. నగరంలోని ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలు కేవలం మార్కులు, రాంక్యుల పేరిట విద్యార్థులను ఆట వస్తువులుగా మార్చి, మానసిక పునరుత్తేజానికి అవకాశం ఇవ్వకుండా ప్రశాంతతను దూరం చేస్తున్నారని ధ్వజమెత్తారు. వాస్తవానికి ఈ కళాశాలలో లక్షలాది రూపాయలు ఫీజుల రూపంలో వసూళ్లు చేస్తున్న విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు.
ప్రధానంగా హాస్టల్ కు మున్సిపల్ అనుమతులు లేకున్నా నిర్లక్ష్యంగా అమ్మాయిలకు, అబ్బాయిలకు తరగతులు ఒకే రూమ్ ఏర్పాటు చేశారని ఆరోపించారు.
సరైన మరుగుదొడ్లు లేవని, నాణ్యత లేని ఆహార పదార్థాలను విద్యార్థులకు ఇస్తున్నారని అన్నారు.కరీంనగర్ జిల్లాలోకార్పొరేట్ విద్యాసంస్థల ఆగడాలకు అడ్డుకట్ట వేయడం లొ ఇంటర్మీడియట్ బోర్డు పూర్తిగా విఫలమైందన్నారు.https://www.facebook.com/profile.php?id=61557327330992&mibextid=ZbWKwL
కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న గుర్తింపు లేకుండా నడుస్తున్న జూనియర్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
తక్షణమే ఇంటర్ బోర్డ్ కార్పొరేట్ కళాశాలల ఆగడాలను ఆపాలని, లేనిపక్షంలో బోర్డ్ ఆదేశాలను భేకాతరు చేస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలపై దాడులు చేస్తామని దీనికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని బోనగిరి మహేందర్,బ్రాహ్మణపల్లి యుగంధర్ లు ఒక సంయుక్త ప్రకటనలో గురువారం డిమాండ్ చేశారు.
