ప్రభుత్వ భూమిలో నిర్మాణం..అధికారుల మౌనం..!

కాటారం,జూన్ 30(ధనాధన్ న్యూస్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ఇబ్రహీంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 257లో ప్రభుత్వ భూమిగా పేర్కొంటున్న స్థలంలో నిర్మాణ పనులు జరుగుతున్నాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ భూమి అని తెలిసినా కొందరు వ్యక్తులు ఎలాంటి భయం లేకుండా ఇంటి నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారని వారు అంటున్నారు. ప్రభుత్వ స్థలాలు కబ్జాలకు గురవుతున్నాయంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉన్నప్పటికీ, ఫిర్యాదులు వచ్చినా స్పందించడం […]
కల్యాణలక్ష్మి చెక్కులతో పాటు తులం బంగారం ఎక్కడ?

కమలాపూర్,జూన్ 30(ధనాధన్ న్యూస్): హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలంలో నిర్వహించిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలంగాణలో పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించిన కల్యాణలక్ష్మి, గర్భిణీల సంక్షేమం కోసం కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, రైతులకు రైతుబంధు వంటి పథకాలతో బీఆర్ఎస్ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం […]
మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

కరీంనగర్/ధనాధన్ న్యూస్,జూన్ 28: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ పాఠశాలల్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించి, కనీస వేతనం అమలు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య, జిల్లా అధ్యక్షుడు కటికరెడ్డి బుచ్చన్న యాదవ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆదివారం బద్దం ఎల్లారెడ్డి భవన్‌లోని ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) కరీంనగర్ జిల్లా మహాసభ సీనియర్ నాయకుడు బొజ్జ సాయిలు […]
ప్రజల పక్షాన పోరాడే సీపీఐని బలోపేతం చేద్దాం

కరీంనగర్/ధనాధన్ న్యూస్, జూన్ 27: ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడే కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ)ని బలోపేతం చేయాలని, ప్రజా సమస్యలపై సంఘటితంగా ఉద్యమాలు నిర్వహించేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ పిలుపునిచ్చారు.శనివారం గుంటూరుపల్లి గ్రామంలో సీపీఐ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ […]
“తవ్వారు..వదిలేశారు..! స్కూల్ పక్కనే ప్రమాదాలకు ఆహ్వానం”

కరీంనగర్/ధనాధన్ న్యూస్,జూన్ 23: కరీంనగర్ నగరంలోని 40వ డివిజన్ హనుమాన్‌నగర్‌లో డ్రైనేజీ నిర్మాణ పనుల కోసం రహదారి పక్కన గుంతలు తవ్వి, ఎలాంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకుండా వదిలేయడం కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి నిదర్శనమని సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడు పైడిపల్లి రాజు విమర్శించారు. బ్లూబెల్స్ పాఠశాల సమీపంలోని సందు రహదారి వెంట డ్రైనేజీ పనులు చేపట్టి, ప్రజలకు హెచ్చరికలు లేకుండా వదిలేయడం పూర్తిగా బాధ్యతారాహిత్యమని ఆయన పేర్కొన్నారు. ప్రతిరోజూ వందలాది మంది విద్యార్థులు, స్థానిక ప్రజలు […]
హమాలి కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

కరీంనగర్/ధనాధన్ న్యూస్,జూన్ 23: రాష్ట్రంలోని అన్ని రంగాల హమాలి కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య, జిల్లా అధ్యక్షుడు కటికరెడ్డి బుచ్చన్న యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మంగళవారం బొమ్మకల్ సిమెంట్ గోదాముల హమాలి కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర నాలుగో మహాసభల కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని సిమెంట్ గోదాముల్లో పనిచేస్తున్న హమాలి కార్మికులకు పని భద్రత […]
ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కల నెరవేరుస్తున్నాం

జగిత్యాల/ధనాధన్ న్యూస్, జూన్ 17:ఇందిరమ్మ రాజ్యంలో పేద ప్రజల స్వంతింటి కల నెరవేర్చుతున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. బుధవారం జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.కొండాపూర్ గ్రామానికి మంజూరైన ఇందిరమ్మ ఇళ్లలో 9 ఇళ్ల పూర్తి కాగా బుధవారం గృహ ప్రవేశాలు నిర్వహించారు. గృహప్రవేశ వేడుకలకు హాజరైన మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో […]
కరీంనగర్‌లో పిడుగుపాటు..యువకుడికి తృటిలో తప్పిన ప్రమాదం.

కరీంనగర్/ధనాధన్ న్యూస్: కరీంనగర్ జిల్లాలో గురువారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్‌లో ఒక స్థానికుడు తన మొబైల్‌తో వర్షాన్ని రికార్డ్ చేస్తుండగా, సమీపంలో అకస్మాత్తుగా పిడుగు పడింది.ఈ సంఘటనతో అతడు తీవ్ర భయాందోళనకు గురై ఉలిక్కిపడ్డాడు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం.
16నెలలుగా ఫైల్ పెండింగ్..!డిపివోపై ఫిర్యాదు

జగిత్యాల/ధనాధన్ న్యూస్ జూన్ 2:జగిత్యాల జిల్లా పంచాయతీ అధికారి (డిపివో) చీకోటి మదన్ మోహన్ గత 16 నెలలుగా నివేదిక సమర్పించకుండా జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ కోరుట్లకు చెందిన చుక్క గంగారాజం సోమవారం జిల్లా కలెక్టర్‌కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ కమిషనర్ 2025 సెప్టెంబర్ నెలలో జారీ చేసిన ఆదేశాలను సైతం జిల్లా పంచాయతీ అధికారి బేఖాతర్ చేశారని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన చుక్క గంగారాజం, కోరుట్ల […]
నిజమైన తెలంగాణ ఉద్యమకారులను గుర్తించాలి

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలంలోని నిజమైన తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించాలని ఉద్యమ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేశామని తెలిపారు. రాష్ట్ర ఏర్పాటు కోసం నిర్వహించిన నిరసనలు, ధర్నాలు, ర్యాలీలు తదితర కార్యక్రమాల్లో పాల్గొని అహర్నిశలు శ్రమించామని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అసలైన ఉద్యమకారులకు గుర్తింపు కల్పించాలని కోరారు. ఈ మేరకు జూన్ 2న వర్గ కేంద్రంలో […]
