మాదిగలకు 11 శాతం రిజర్వేషన్లు కల్పించాలి

By dhanadhannews.com

  • రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఎమ్మార్పీఎస్ నాయకుడు బత్తుల లక్ష్మీనారాయణ

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఎమ్మార్పీఎస్ మండల మాజీ అధ్యక్షుడు బత్తుల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మాదిగలకు 11 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఎమ్మార్పీఎస్ మండల మాజీ అధ్యక్షులు బత్తుల లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.15 లక్షల జనాభా ఉన్న మాలలకు 5శాతం రిజర్వేషన్ కల్పించి 33 లక్షల జనాభా ఉన్న మాదిగలకు 9 శాతం రిజర్వేషన్ కల్పించడం సరికాదన్నారు.జనాభా ప్రతిపాదికన మాదిగలకు 11 శాతం  రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గత ఏళ్ల తరబడి ఏ బి సి డి వర్గీకరణ కోసం పోరాటం చేస్తూ ఏబిసిడి వర్గీకరణ జరిగితే మా మాదిగ జాతి బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని  ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.సుప్రీంకోర్టును తీర్పును గౌరవించి రాష్ట్ర ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ కు శాసనసభలో ఆమోదించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.కానీ మాదిగ జాతి బిడ్డలకు జనాభా ప్రాతిపదికన 11 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సైదాపూర్ ఎమ్మార్పీఎస్ మండల మాజీ అధ్యక్షుడు బత్తుల లక్ష్మీనారాయణ,మొలుగూరి  తిరుపతి,కండె  కరుణాకర్,ఎమ్మార్పీఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.