- ముఖ్య అతిథిగా హాజరైన హుస్నాబాద్ అసెంబ్లీ కన్వీనర్ గుర్రాల లక్ష్మారెడ్డి
సైదాపూర్/ధనాధన్ న్యూస్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని ఆకునూరు గ్రామంలో చత్రపతి శివాజీ జయంతి వేడుకల్లో భాగంగా చత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలవేసి స్వీట్లు పంపిణీ చేయడం జరిగినది అనంతరం హుస్నాబాద్ అసెంబ్లీ కన్వీనర్ గుర్రాల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ
స్వతంత్ర మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి, మధ్యయుగంలో హిందూ మతధర్మాన్ని పరిరక్షించిన ఘనత శివాజీకే దక్కుతుందనడంలో అతిశయోక్తిలేదు. అలాగని ఆయన హిందూ మత దురాభిమాని కూడా కాదు. ఇతర మతాలను గౌరవించి, ఆదరించాడు. నిజాంషాహీల ప్రతినిధి అయిన శివాజీ తండ్రి శహాజీ మొఘలులకు వ్యతిరేకంగా అనేకసార్లు పోరాటం చేశారు. అయితే తన ఆదేశాలను ధిక్కరించినందుకు లఖూజీ జాదవ్రావ్ అనే మరాఠా వీరుణ్ని నిజాం నవాబు హత్య చేయించడంతో వారితో వైరాన్ని పెంచుకుని, తిరుగుబావుటా ఎగురవేసి స్వతంత్ర మరాఠా సామ్రాజ్యానికి నాంది పలికాడు. ఈ కాలంలో శివనేర్ కోటలో శివాజీకి జిజాబాయి జన్మనిచ్చింది. ఫిబ్రవరి 19, 1627 వైశాఖ శుక్ల తదియనాడు పుట్టిన తాను ఆరాధించే శివై స్త్రీల పట్ల గౌరవం శివాజీ మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపనే లక్ష్యంగా వ్యూహరచన చేశాడు 17 వ ఏటనే తొలిసారిగా యుద్ధంలో పాల్గొన్న తన పాలనలో ఒక ముస్లిం మంత్రి ఒక ముస్లిం సైన్యాధ్యక్షుడు ముస్లింలకు తన పాలనలో ప్రాధాన్యతను ఇచ్చేవాడు అని తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు శ్రీనివాస్, హుస్నాబాద్ అసెంబ్లీ కన్వీనర్ గుర్రాల లక్ష్మారెడ్డి, జిల్లా కన్వీనర్ వీరమల్ల రవీందర్ రెడ్డి, భరద్వాజ్, భాష్యం సంపత్, లక్ష్మారెడ్డి, తోట వేణు, శశి రెడ్డి, గర్నపూడి వెంకటేష్,శివాజీ కార్యకర్తలు అభిమానులు నాయకులు పాల్గొన్నారు.
